అన్వేషించండి

Paytm's Loan: డిసెంబర్‌లో కళ్లు తిరిగే బిజినెస్‌ - ఓ మంచి వార్త చెప్పిన పేటీఎం

రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, డిసెంబర్‌లో రూ. 3,665 కోట్ల విలువైన 3.7 మిలియన్ (37 లక్షలు) రుణాలను పంపిణీ చేసింది.

Paytm's Loan: భారతదేశంలో అతి పెద్ద డిజిటల్ చెల్లింపులు & ఆర్థిక సేవల (digital payments and financial services) సంస్థల్లో ఒకటైన పేటీఎం, 2022 డిసెంబర్‌ నెలలో బ్రహ్మాండమైన బిజినెస్‌ చేసింది. రుణాల పంపిణీలో గత సంవత్సరం కంటే (YoY) ఈసారి 330 శాతం వృద్ధిని సాధించింది. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, డిసెంబర్‌లో రూ. 3,665 కోట్ల విలువైన 3.7 మిలియన్ (37 లక్షలు) రుణాలను పంపిణీ చేసింది. 

"2022 డిసెంబరులో రుణాల సంఖ్య 117 శాతం YoY వృద్ధితో 3.7 మిలియన్లకు పెరిగింది. 2022 డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో 137 శాతం YoY వృద్ధితో 10.5 మిలియన్లకు రుణాలు పెరిగాయి" అని ఎక్సేంజ్‌ ఫైలింగ్‌లో ఈ కంపెనీ పేర్కొంది.

మూడున్నర రెట్ల రుణ వృద్ధి
2021 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ‍‌(అక్టోబర్‌-డిసెంబర్‌ కాలం) రూ. 2,181 కోట్ల విలువైన రుణాలను ఈ కంపెనీ మంజూరు చేసింది. 2022 డిసెంబర్ త్రైమాసికంలో ‍‌రుణ విలువ 357 శాతం పెరిగి రూ. 9,958 కోట్లకు చేరుకుంది. అంటే, ఒక్క ఏడాది కాలంలోనే మూడున్నర రెట్ల రుణ వృద్ధిని పేటీఎం సాధించింది.

నెలవారీ వినియోగదారుల సంఖ్య (monthly transacting users - MTU) కూడా గత ఏడాది కంటే గణనీయంగా పెరిగింది. 2021 డిసెంబర్‌లోని 64 మిలియన్లుగా MTU, 2022 డిసెంబర్‌ నాటికి 32 శాతం పెరిగి 85 మిలియన్లకు చేరుకుంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రాసెస్ చేసిన మర్చంట్‌ గ్రాస్‌ బిజినెస్‌ వాల్యూ(GMV) డిసెంబర్‌లో 38 శాతం వృద్ధితో రూ. మొత్తం రూ. 3.46 ట్రిలియన్లకు చేరుకుంది.

2022 డిసెంబర్‌లో, ముంబైలో జరిగిన ఒక సమ్మిట్‌లో Paytm CEO & ఫౌండర్‌ విజయ్ శేఖర్ శర్మ మాట్లాడారు. వ్యాపారంలో ఇకపై నగదు బర్న్ ఉండదని, ఖర్చులను తగ్గించాలన్న లక్ష్యంలో కంపెనీ చాలా ముందుందని చెప్పారు. ఎక్సేంజ్‌ ఫైలింగ్‌ కంపెనీ అప్‌డేట్‌ చేసిన డిసెంబర్‌ లావాదేవీల సమాచారాన్ని బట్టి చూస్తే, విజయ్‌ శేఖర్‌ శర్మ చెప్పింది నిజమేనని అనిపిస్తోంది.

త్రైమాసిక ఆదాయ నివేదిక ప్రకారం... 2022 సెప్టెంబర్ చివరి నాటికి నికర నగదు, నగదు సమానమైనవి, పెట్టుబడి పెట్టదగిన బ్యాలెన్స్ రూ. 91.82 బిలియన్లు కంపెనీ వద్ద ఉంది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & CEOగా సురీందర్ చావ్లాను నియమించేందుకు, బ్యాంకింగ్ రెగ్యులేటర్ RBI నుంచి Paytm పేమెంట్స్ బ్యాంక్ అనుమతి పొందింది. అయితే, కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా Paytm పేమెంట్స్ బ్యాంక్‌ మీద నిషేధం కొనసాగుతోంది. 

2022 డిసెంబర్‌ 23 నాటి కనిష్ట స్థాయి నుంచి ఇప్పటి వరకు (09 జనవరి 2023) ఈ స్టాక్‌ 18% పైగా పుంజుకుంది. గత నెల రోజుల కాలంలో 3% పైగా లాభపడింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

టాప్ హెడ్ లైన్స్

HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Jyothika Munirathnam: 'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
NTR Office Statement: ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు చేసే అధికారం Raw NTR 'సంస్థకు లేదు - అఫీషియల్ స్టేట్మెంట్
'ఊరూ వాడ'తో పొలిటికల్ ఎంట్రీ, ఫేక్ వార్తలకు చెక్ పెట్టిన ఎన్టీఆర్ ఆఫీస్
Embed widget