అన్వేషించండి

Nita Mukesh Ambani Anant Ashray: అనాథలకోసం కర్జాత్‌లో 100 ఎకరాల టౌన్‌షిప్‌.. నీతా అంబానీ కొత్త ప్రాజెక్ట్.

రిలయెన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ తన పుట్టిన రోజు నాడు కీలక ప్రకటన చేశారు. ఏ తోడూ అభాగ్యులకు జీవతకాల సంరక్షణ చేపట్టేలా మహరాష్ట్రలోని కర్జాత్‌లో అనంత్‌ ఆశ్రయ్ టౌన్‌ఫిప్ ఏర్పాటు చేస్తున్నారు. 

Nita Mukesh Ambani Anant Ashray: రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని కర్జాత్‌లో 100 ఎకరాల విస్తీర్ణంలో భారీ టౌన్‌షిప్‌ ఏర్పాటు చేయనున్నారు. అనాథ పిల్లలు, వృద్ధులు, ఎదుగుదలకు సంబంధించిన లోపాలున్న వారికి  జీవితకాలం నివాసం, వైద్యం, విద్య, పునరావాస సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ముంబై సమీపంలోని కర్జాత్‌లో ఈ ప్రాజెక్టును రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్‌పర్సన్ నీతా ఎం. అంబానీ ఆదివారం భూమిపూజ చేసి ప్రారంభించారు. తన భర్త ముఖేష్ అంబానీ పేరు మీదుగా నీతా ముఖేష్ అంబానీ అనంత్ ఆశ్రయ్ అని ఈ టౌన్‌షిప్‌కు పేరు పెట్టారు. దశలవారీగా  దీని నిర్మాణ పనులు చేపట్టనున్నారు.


5 వేల మందికి జీవితకాల సంరక్షణ

ఈ టౌన్‌షిప్‌లో 5,000 మందికి పైగా వ్యక్తులకు జీవితకాల నివాస సదుపాయాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడ ఆశ్రయం పొందేవారితో పాటు.. వారి సంరక్షకులువైద్య నిపుణులు, ఇతర సిబ్బంది కలిపి ఈ టౌన్‌షిప్‌లో 15వేల మంది నివాసం ఉండనున్నారు. నివాస సదుపాయాలతో పాటు ప్రత్యేక వైద్య సేవలు, పునరావాసం, విద్య, వృత్తి నైపుణ్య శిక్షణ వంటి సదుపాయాలు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు.

 ఈ సమాజంలో ఏ తోడూ లేని అనాథలకు . ప్రత్యేక సంరక్షణ అవసరమైన వారికి సురక్షితమైన ఇల్లు, వైద్య సహాయం, అభివృద్ధికి అవసరమైన అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. నీతా అంబానీ తెలిపారు.

“నాకు, నా కుటుంబానికి ‘నీతా ముఖేష్ అంబానీ అనంత్ ఆశ్రయ్’ ఎంతో మనసుకు దగ్గరైన కార్యక్రమం. వైకల్యాలు ఉన్నవారు, ఇల్లు అవసరమైన పిల్లలు, సంరక్షణ, ఆప్యాయత కోరుకునే వృద్ధుల కోసం ప్రేమతో కూడిన ఒక ఇంటిని నిర్మించే దిశగా ఇది తొలి అడుగు. కుటుంబ వాతావరణంతో కూడిన ఆప్యాయత, వైద్య సహాయం, ప్రత్యేక సంరక్షణ ఒకేచోట అందుబాటులో ఉండే సమాజాన్ని నిర్మించాలని మేము కోరుకుంటున్నాం. ప్రకృతి ఒడిలో నివసిస్తూ, నేర్చుకోవడానికి, పనిచేయడానికి, స్నేహితులను సంపాదించుకోవడానికి, పండుగలు, వేడుకలను ఆనందంగా జరుపుకోవడానికి ప్రతి ఒక్కరికీ అవకాశం ఉండాలి.”


ఆమె ఇంకా మాట్లాడుతూ.. “ఒక తల్లిగా నాకున్న అతిపెద్ద కోరిక ఒక్కటే. తమ తర్వాత తమ పిల్లలను ఎవరు చూసుకుంటారోనని జీవితమంతా ఆందోళన చెందే తల్లిదండ్రులు.. తమ పిల్లలకు ఎప్పటికీ ఒక ఇల్లు, ఒక కుటుంబం ఉంటాయనే నమ్మకంతో ప్రశాంతంగా ఉండగలగాలి. అన్నింటికంటే ముఖ్యంగా, ‘నీతా ముఖేష్ అంబానీ అనంత్ ఆశ్రయ్’ ప్రతి వయసులోని ప్రతి ఒక్కరికీ గౌరవప్రదంగా జీవించే అవకాశాన్ని కల్పించాలని, ప్రతి కొత్త రోజును ఆశతో స్వాగతించేలా చేయాలని మేము ఆశిస్తున్నాం” అని నీతా అంబానీ పేర్కొన్నారు.

ఎనిమిది గ్రామాలుగా టౌన్‌షిప్‌ నిర్మాణం

ఈ టౌన్‌షిప్‌లో మొత్తం ఎనిమిది నివాస గ్రామాలు ఉంటాయి. భారతదేశంలోని నదుల పేర్లతో వీటికి పేర్లు పెట్టనున్నారు. ప్రతి గ్రామానికి ప్రత్యేక రంగులు, చిహ్నాలు, సెన్సరీ గార్డెన్లు ఏర్పాటు చేస్తారు. నివాసితులు తమ పరిసరాలను సులభంగా గుర్తించేందుకు ఇవి ఉపయోగపడతాయి.

ప్రతి ఇంట్లో కుటుంబ వాతావరణం ఉండేలా ప్రత్యేక సంరక్షకులు, హౌస్ పేరెంట్స్‌ను నియమించనున్నారు. నివాసితుల ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, వ్యక్తిగత సంక్షేమానికి అనుగుణంగా ప్రత్యేక సంరక్షణ ప్రణాళికలు రూపొందిస్తారు. కనీసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి వీటిని సమీక్షిస్తారు.

ఈ ప్రాంగణంలో ఆసుపత్రి, ఆలయం, ఆటస్థలాలు, తోటలు, వ్యవసాయ క్షేత్రాలు, వర్క్‌షాప్‌లు, కేఫ్‌లు కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రత్యేక ఆసుపత్రిని నిర్మించనున్నారు. డెవలప్‌మెంటల్ మెడిసిన్, ఎపిలెప్సీ చికిత్స, ప్రత్యేక అవసరాలున్నవారికి డెంటల్ కేర్, పాలియేటివ్ కేర్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి.

పునరావాసంలో భాగంగా ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, హైడ్రోథెరపీ సేవలు కల్పిస్తారు. 

సంరక్షణతో పాటు ఉపాధి కూడా..

సంరక్షణ కల్పించడమొక్కటే కాదు.. అక్కడ ఉండే వారికి ఓ వ్యాపకంగా.. అలాగే వారికి ఓ ఉపాధి మార్గంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు వంటశాలలు, బేకరీ, కేఫ్‌లు, క్రాఫ్ట్ స్టూడియోల ద్వారా నివాసితులకు వృత్తి నైపుణ్యాలు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. కుటుంబ సభ్యులకు తాత్కాలిక విశ్రాంతి కల్పించే రెస్పైట్ హోమ్స్, మొబైల్ మెడికల్ క్లినిక్‌లు, హాస్పిస్ విభాగం, వైకల్యాల సంరక్షణ నిపుణుల కోసం జాతీయ శిక్షణ అకాడమీ కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటాయి.

చుట్టుపక్కల గ్రామాలకూ సేవలు

ఈ ప్రాజెక్టు కేవలం టౌన్‌షిప్‌లో నివసించే వారికే పరిమితం కాదు. చుట్టుపక్కల గ్రామాలు, జిల్లాలకు కూడా కొన్ని సేవలను విస్తరించనున్నారు. ఈ ప్రాంతానికి చెందిన సుమారు 1,000 మందికి థెరపీ, విద్య, ఉపాధి అవకాశాలు అందించాలని ప్రణాళిక రూపొందించారు. ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ, ఎపిలెప్సీ, అభివృద్ధి సంబంధిత వైకల్యాలు, సంక్లిష్ట ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ నిరంతర సంరక్షణ అవసరమైన వారికి ఈ ప్రాజెక్టు ద్వారా సహాయం అందించనున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన సేవా విభాగమైన రిలయన్స్ ఫౌండేషన్ ఇప్పటికే ఆరోగ్యం, విద్య, గ్రామీణ అభివృద్ధి, క్రీడలు, మహిళా సాధికారత తదితర రంగాల్లో పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా 98,000కు పైగా గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో 10 కోట్ల మందికి పైగా ప్రజలకు తమ కార్యక్రమాల ద్వారా సేవలు అందించినట్లు ఫౌండేషన్ వెల్లడించింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
CII Summit First Day MoUs: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. 35 ఒప్పందాల ద్వారా రూ.1.57 లక్షల కోట్ల పెట్టుబడులు.. 52,956 మందికి ఉపాధి అవకాశాలు
ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. 35 ఒప్పందాల ద్వారా రూ.1.57 లక్షల కోట్ల పెట్టుబడులు.. 52,956 మందికి ఉపాధి అవకాశాలు
Visakha CII Summit: విశాఖలో ఘనంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు.. ప్రగతి, సంప్రదాయాల సమ్మేళనంగా ఆంధ్రా వేదిక
విశాఖలో ఘనంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు.. ప్రగతి, సంప్రదాయాల సమ్మేళనంగా ఆంధ్రా వేదిక
పాత ఆభరణాలు మార్చి కొత్త బంగారం కొనడం శుభమా కాదా? బంగారం మార్పిడి నియమాలు తెలుసుకోండి!
పాత ఆభరణాలు మార్చి కొత్త బంగారం కొనడం శుభమా కాదా? బంగారం మార్పిడి నియమాలు తెలుసుకోండి!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ దోపీడీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ దోపీడీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
SpaceX Starship Flight 15: అంతరిక్ష చరిత్రలో స్పేస్ఎక్స్ మరో రికార్డు.. భూమికి తిరిగొచ్చిన స్టార్‌షిప్ రాకెట్‌ను చాప్‌స్టిక్స్‌తో క్యాచ్!
అంతరిక్ష చరిత్రలో స్పేస్ఎక్స్ మరో రికార్డు.. భూమికి తిరిగొచ్చిన స్టార్‌షిప్ రాకెట్‌ను చాప్‌స్టిక్స్‌తో క్యాచ్!
Tiger Tension: ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
Tirupati Crime News: అప్పు తిరిగి చెల్లించలేదని తల్లితో పాటు 6 నెలల చిన్నారి కిడ్నాప్! తిరుపతి జిల్లాలో దారుణం
అప్పు తిరిగి చెల్లించలేదని తల్లితో పాటు 6 నెలల చిన్నారి కిడ్నాప్! తిరుపతి జిల్లాలో దారుణం
Andhra Pradesh Rains: ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
Mohit Ulva Journey: టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Embed widget