search
×

Stocks to watch 10 October 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫోకస్‌లో TCS, HCL Tech, HDFC

మన మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.

FOLLOW US: 
Share:

Stocks to watch today, 10 October 2022: ఇవాళ (సోమవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 278 పాయింట్లు లేదా 1.61 శాతం రెడ్‌ కలర్‌లో 17,036 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS): టాటా గ్రూప్‌నకు చెందిన ఈ ఐటీ కంపెనీ, తన సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలను ఇవాళ ప్రకటించబోతోంది. JTL ఇన్‌ఫ్రా, ఇంటర్నేషనల్ ట్రావెల్ హౌస్, గోరాని ఇండస్ట్రీస్, ఎక్సెల్ రియాల్టీ ఎన్‌ ఇన్‌ఫ్రా కూడా క్యూలో ఉన్నాయి.

HDFC: వచ్చే వారం ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన బాండ్లను జారీ చేసి రూ.12,000 కోట్ల వరకు సమీకరించనుంది. బేస్ ఇష్యూ సైజ్‌ రూ.1,000 కోట్లు. మరో రూ.11,000 కోట్ల వరకు సబ్‌స్క్రిప్షన్‌ను కొనసాగించే అవకాశం ఉంది.

HCL టెక్నాలజీస్: ఈ  ఐటీ కంపెనీ, మెక్సికోలో, రాబోయే రెండేళ్లలో 1,300 మందిని నియమించుకోవాలని యోచిస్తోంది. దీంతో, ఆ దేశంలో ఈ కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2,400కు పెరుగుతుంది.

హిందుస్థాన్ యూనిలీవర్: పామాయిల్, ఇతర ముడి పదార్థాల ధరలు చౌకగా మారుతున్న నేపథ్యంలో, ఈ FMCG కంపెనీ కొన్ని బ్రాండ్ల సబ్బుల ధరలను 15 శాతం వరకు తగ్గించింది. Lifebooy, Lux బ్రాండ్ల రేట్లను ఇప్పటికే 5 నుంచి 11 శాతం వరకు తగ్గించింది.

గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్: పామాయిల్, ఇతర ముడి పదార్థాల ధరలు తగ్గిన నేపథ్యంలో ఈ FMCG కంపెనీ కూడా కొన్ని బ్రాండ్ల సబ్బుల ధరలను 11 శాతం వరకు తగ్గించింది. గోద్రెజ్ గ్రూప్‌ విభాగం GCPL కూడా, తాను ఉత్పత్తి చేస్తున్న బ్రాండ్ గోద్రెజ్ నంబర్ 1 సహా మరికొన్ని సబ్బుల రేట్లను 13 నుంచి 15 శాతం వరకు తగ్గించింది.

టాటా మోటార్స్: ఈ ఆటో మేజర్ యాజమాన్యంలో పని చేస్తున్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ (Jaguar Land Rover) రిటైల్‌ అమ్మకాలు సెప్టెంబర్‌ త్రైమాసికంలో 4.9 శాతం క్షీణించి 88,121 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ కంపెనీ 92,710 యూనిట్ల రిటైల్ విక్రయాలను నమోదు చేసింది.

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా: పవర్‌ గ్రిడ్‌ అనుబంధ సంస్థ అయిన భింద్ గుణ ట్రాన్స్‌మిషన్ (Bhind Guna Transmission), మధ్యప్రదేశ్‌లో ప్రసార వ్యవస్థను విజయవంతంగా ప్రారంభించింది. 400kV సబ్‌స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన అంతర్రాష్ట్ర ప్రసార పనుల కోసం ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌ ఏర్పాటు చేయడానికి ఒక ప్రాజెక్టును దక్కించుకుంది.

అంబుజా సిమెంట్స్: అదానీ గ్రూప్ సంస్థ నుంచి రూ.20 వేల కోట్లు సమీకరించాలన్న ప్రతిపాదనకు, కంపెనీ బోర్డులో గౌతమ్ అదానీ, మరికొందరి నియామకం సహా మరికొన్ని ప్రతిపాదనలకు EGMలో వాటాదారుల ఆమోదం లభించిందని ఈ సిమెంట్ ప్లేయర్ తెలిపింది.

IDBI బ్యాంక్: ఈ బ్యాంక్‌ను ప్రైవేటీకరించడానికి మూడు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం బిడ్‌లను ఆహ్వానించింది. LICతో కలిసి మొత్తం 60.72 శాతం వాటాను విక్రయించనుంది. ఈ వాటా కొనుగోలు చేయాలనుకునే వాళ్లు ఈ ఏడాది డిసెంబరు 16వ తేదీ లోపు బిడ్‌ (Expression of Interest - EoI) దాఖలు చేయాలి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 10 Oct 2022 08:22 AM (IST) Tags: Share Market Stocks to watch stocks in news Stock Market

ఇవి కూడా చూడండి

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

టాప్ స్టోరీస్

Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !

Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !

Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్

Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన

Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!

Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!