By: Arun Kumar Veera | Updated at : 25 Sep 2024 06:00 PM (IST)
మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్ ( Image Source : Other )
Investment Tips For Mutual Funds: గత కొన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్ (MF) పేరు ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఎక్కువగా వినిపిస్తోంది. 'మ్యూచువల్ ఫండ్స్ సురక్షితమైనవి' అని మీరు యాడ్స్‌లో ప్రకటనలో కూడా వినే ఉంటారు. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బును త్వరగా రెట్టింపు చేసే అవకాశం ఉన్న అసెట్ క్లాస్‌గా కూడా MFs ఉద్భవించాయి. మీ పెట్టుబడి పదేళ్లలో రెట్టింపు కావాలనకుంటే, మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్‌లో, ముఖ్యంగా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులు అసాధారణంగా ఉంటాయి. అంతర్జాతీయ ఈక్విటీ పథకాల్లో పెట్టుబడులు పెరుగుతున్నందున పెట్టుబడిదార్లు 15% CAGR రిటర్న్ పొందుతున్నారు. గత ఐదేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మార్కెట్ నిపుణులు చెబుతున్న ప్రకారం... వరుసగా 10 సంవత్సరాల పాటు సగటున 15 శాతం రాబడిని పొందినట్లయితే, మీ డబ్బు 10 సంవత్సరాల్లోనే రెట్టింపు అవుతుంది.
గత నెలలో (ఆగస్టు 2024) ఈక్విటీ ఫండ్ పథకాల్లోకి రూ.38,239 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. జులైలో వచ్చిన రూ.37,113 కోట్ల నెట్ ఇన్‌ఫ్లో కంటే ఇది 3.3 శాతం ఎక్కువ. అంతేకాదు, MFsలోకి సిప్ (SIP) ద్వారా వచ్చిన డబ్బు వరుసగా 14వ నెలలోనూ రికార్డ్ సృష్టించింది.
1. లార్జ్ క్యాప్ ఫండ్స్ (Large Cap Funds)
స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన పెద్ద కంపెనీల షేర్లలో ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్ పెట్టుబడిదార్లు గత ఐదేళ్లలో సగటున 19% రాబడి అందుకున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే, ఈ ఫండ్‌లలోని డబ్బు రాబోయే 5 సంవత్సరాలలో రెట్టింపు అవుతుందని భావిస్తున్నారు. అయితే, లార్జ్ క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్‌లను ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఎంచుకుని, వాటి స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి.
2. మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ (Multi Cap Mutual Fund)
అన్ని కేటగిరీ స్టాక్స్‌లో ఇవి డబ్బును ఇన్వెస్ట్ చేస్తాయి. ఉదాహరణకు... లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెడతాయి. ఈ ఫండ్స్‌లోని ప్రత్యేకత ఏమిటంటే, మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో మార్పులకు అనుగుణంగా తమ పోర్ట్‌ఫోలియోను మారుస్తూ ఉంటాయి. ఇవి అత్యంత ఆకర్షణీయమైన మ్యూచువల్ ఫండ్స్‌గా మారాయి. ఇవి సగటున 25% CAGRని (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) అందిస్తున్నాయి.
3. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ (Flexi Cap Funds)
స్టాక్ మార్కెట్‌లోని వివిధ రంగాల్లో & వివిధ నిష్పత్తుల్లో పెట్టుబడి పెట్టే ఫండ్స్ ఇవి. ముఖ్యంగా, స్టాక్ మార్కెట్లో బబుల్ రిస్క్‌ను ఇవి తగ్గిస్తాయి. ఫండ్ మేనేజర్లకు కూడా పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఈ కేటగిరీలోని ఫండ్స్ గత 5 ఏళ్లలో 21% శాతం CAGR రిటర్న్ ఇచ్చాయి.
4. కాంట్రా ఫండ్స్ (Contra Funds)
పెరుగుతున్న షేర్లలో పెట్టుబడి పెట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ పెరుగుతున్న మార్కెట్‌లో కూడా పెద్దగా పెరగని షేర్లలో పెట్టుబడి పెట్టే పద్ధతిని కాంట్రా ఫండ్స్ ద్వారా తీసుకొచ్చారు. పేరుకు తగ్గట్లుగా విరుద్ధమైన కదలికల ఆధారంగా పెట్టుబడి పెడతాయి. వీటి రిస్క్-రివార్డ్ రేషియో చాలా బాగుంది. కొంచెం ఎక్కువ రిస్క్‌తో కూడుకున్నవే అయినప్పటికీ... అధిక రాబడి, దీర్ఘకాలిక వృద్ధి, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ వంటి లక్షణాలు వీటి సొంతం. వీటి రిటర్న్స్ గురించి వింటే మీరు షాక్ అవుతారు. గత 5 సంవత్సరాలలో కాంట్రా ఫండ్స్ సగటున 27% అద్భుతమైన రాబడి ఇచ్చాయి.
5. మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ (Multi Asset Allocation Funds)
నిజానికి, ఇవి హైబ్రిడ్ ఫండ్స్ కేటగిరీ కిందకు వస్తాయి. ఈ ఫండ్స్ కనీసం 3 విభిన్న అసెట్ క్లాస్‌ల్లో పెట్టుబడి పెట్టాలి. ఈక్విటీ, డెట్‌తో పాటు మూడో అసెట్ క్లాస్‌గా బంగారం లేదా రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. చాలా ఈక్విటీ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ కంటే తక్కువ రిస్క్‌ను కలిగి ఉండటం వీటి ప్రత్యేకత. గత 5 సంవత్సరాల్లో ఈ ఫండ్స్ సగటున 19% శాతం రిటర్న్స్ ఇచ్చాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: దసరా నుంచి దీపావళి వరకు - అక్టోబర్‌లో బ్యాంక్‌లకు భారీగా సెలవులు
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్
Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్ సెర్చ్‌లో ఐపీఎల్, పవన్ కల్యాణ్, కల్కి, సలార్ టాప్
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy