By: Arun Kumar Veera | Updated at : 29 Jun 2024 04:07 PM (IST)
నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు
Tax Saver Funds: పన్ను ఆదా చేసే పెట్టుబడుల్లో చాలా పథకాలు కనీసం ఐదేళ్ల లాక్-ఇన్ పిరియడ్‌తో ఉంటాయి. ELSS (ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్) లాక్-ఇన్ పిరియడ్ మాత్రం మూడేళ్లే. ఈక్విటీలతో ముడిపడి, పన్ను ప్రయోజనాలను అందించే మ్యూచువల్ ఫండ్స్ ఇవి. వీటిని "ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్" అని కూడా పిలుస్తారు.
గత మూడేళ్లలో ఎక్కువ రాబడి అందించిన ELSS మ్యూచువల్ ఫండ్స్:
1) SBI లాంగ్-టర్మ్ ఈక్విటీ ఫండ్ - డైరెక్ట్ ప్లాన్
SBI మ్యూచువల్ ఫండ్ నిర్వహించే ELSS ఫండ్ 38.65 శాతం వార్షిక SIP రిటర్న్‌తో టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ ఫండ్ 'అసెట్ అండర్ మేనేజ్‌మెంట్' (AUM) రూ. 23,888 కోట్లు, దీని 'నెట్ అసెట్ వాల్యూ' (NAV) రూ. 451.7710. ఈ ఫండ్‌ను 11 ఏళ్ల క్రితం ప్రారంభించారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు 17.94 శాతం రిటర్న్ ఇచ్చింది. ఫండ్ ఎక్స్‌పెన్స్ రేషియో 0.94 శాతం. ఫండ్‌లో కనీస SIP మొత్తం రూ.500.
ఫండ్‌లో నెలకు రూ. 10,000 SIP చేస్తే, మూడేళ్లలో పెట్టుబడి మొత్తం రూ. 3,60,000 అవుతుంది. దీనిపై రూ. 6,19,482 రిటర్న్ ఇచ్చింది.
రూ.20,000 నెలవారీ SIP ద్వారా మూడేళ్లలో పెట్టుబడి మొత్తం రూ.7,20,000 అవుతుంది. దీనిపై రూ.12,38,963 తిరిగి ఇచ్చింది.
2) క్వాంట్ ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ - డైరెక్ట్ ప్లాన్
ఈ ఫండ్ మూడేళ్లలో 35.97 శాతం వార్షిక రిటర్న్ ఇచ్చింది. ఫండ్ AUM రూ. 9,860 కోట్లు, NAV రూ. 439.3527. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 23.45 శాతం రాబడి ఇచ్చింది. వ్యయ నిష్పత్తి 0.77 శాతం. ఫండ్‌లో కనీస SIP రూ.500.
రూ. 10,000 నెలవారీ SIP ద్వారా మూడేళ్లలో రూ. 5,98,430 ఇచ్చింది.
రూ. 20,000 నెలవారీ SIP ద్వారా మూడేళ్లలో రూ. 11,96,860 రిటర్న్ చేసింది.
3) మోతీలాల్ ఓస్వాల్ ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ - డైరెక్ట్ ప్లాన్
ఈ ELSS ఫండ్ మూడేళ్లలో 38.09 శాతం రాబడిని ఇచ్చింది. AUM రూ. 3,436 కోట్లు, NAV విలువ రూ. 54.3278. 2015 జనవరిలో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వకు 19.64 శాతం వార్షిక రాబడి ఇచ్చింది. 0.68 శాతం వ్యయ నిష్పత్తితో, ఫండ్‌లో కనీస SIP పెట్టుబడి రూ.500.
రూ. 10,000 నెలవారీ SIP మూడేళ్ల వ్యవధిలో రూ. 6,15,069గా మారింది.
రూ. 20,000 నెలవారీ SIP అదే సమయంలో రూ. 12,30,137 అయింది.
4) ITI ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ - డైరెక్ట్ ప్లాన్
ఈ ఫండ్ మూడేళ్లలో 35.71 శాతం వార్షిక SIP రిటర్న్ ఇచ్చింది. దీనికి రూ. 338 కోట్ల AUM ఉండగా, NAV రూ. 26.5845. 2019 అక్టోబర్‌లో ప్రారంభమైనప్పటి నుంచి 23.15 శాతం రాబడిని ఇచ్చింది. ఫండ్ ఎక్స్‌పెన్స్ రేషియో 0.48 శాతం. కనీస SIP పెట్టుబడి రూ. 500.
ఈ ఫండ్‌లో రూ. 20,000 నెలవారీ SIPతో మూడేళ్లలో రూ. 11,92,762 రాబడి ఇచ్చింది.
5) బ్యాంక్ ఆఫ్ ఇండియా ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ - డైరెక్ట్ ప్లాన్
గత మూడేళ్లలో ఈ ఫండ్ 35.10 శాతం లాభాలు ఇచ్చింది. ఫండ్ AUM రూ. 1,327 కోట్లు, NAV విలువ రూ. 196.2300. 2013 జనవరిలో ప్రారంభమైనప్పటి నుంచి 20.29 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. ఫండ్ వ్యయ నిష్పత్తి 0.98 శాతం. కనీస SIP పెట్టుబడి రూ. 500.
రూ. 10,000 నెలవారీ SIP మొత్తం మూడేళ్లలో రూ. 5,91,681 గా మారింది.
రూ. 20,000 నెలవారీ SIPపై మూడేళ్లలో రూ. 11,83,363 రిటర్న్ వచ్చింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: మన దేశంలో అత్యధిక లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు ఇవి - టాప్ ప్లేస్‌లో రిలయన్స్
Home Loans Interest Rate: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే.. పూర్తి జాబితా
Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Personal loan Interest Rates: దిగొచ్చిన పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు.. టాప్ 5 బ్యాంకులలో ఏది తక్కువ వడ్డీకి లోన్ ఇస్తుంది
PPF vs FD : సేవింగ్స్ చేయడానికి PPF మంచిదా? FD బెటరా? ఎక్కువకాలం పొదుపు చేస్తే ట్యాక్స్, వడ్డీ ఎలా ఉంటాయి?
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Avatar OTT: 'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?