search
×

Stocks to watch: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి

మన మార్కెట్‌ ఇవాళ గ్యాప్‌ డౌన్‌లో ప్రారంభమవుతుందని ఇది సూచిస్తోంది.

FOLLOW US: 

Stocks to watch: ఇవాళ ఉదయం 7.30 గం. సమయానికి సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) నెగెటివ్‌గా ట్రేడవుతోంది. ఆ సమయంలో 58 పాయింట్లు లేదా 0.33 శాతం రెడ్‌లో 17,452 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ గ్యాప్‌ డౌన్‌లో ప్రారంభమవుతుందని ఇది సూచిస్తోంది. 

నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

రిలయన్స్ ఇండస్ట్రీస్: దిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి స్వదేశీ కూల్‌డ్రింక్‌ బ్రాండ్ కాంపాకోలాను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.22 కోట్లు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ దీనిని దీపావళి నాటికి మార్కెట్‌లోకి తెస్తుంది.

చమురు సంస్థలు: డీజిల్ ఎగుమతిపై లీటరుకు రూ.13.5, జెట్ ఇంధనం ఎగుమతులపై రూ.9 మేర విండ్‌ ఫాల్‌ ప్రాఫిట్‌ టాక్స్‌ను ప్రభుత్వం పెంచింది, అంతేకాకుండా దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురుపై గ్లోబల్ ధరల గట్టిపడటానికి అనుగుణంగా లెవీని పెంచింది. .

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: అనామికా కండక్టర్స్‌కు చెందిన మొండి బకాయిల ఖాతాను ఈ నెలాఖరులో ఈ-బిడ్డింగ్ ద్వారా ఎస్‌బీఐ విక్రయించనుంది. ఎస్‌బీఐకి అనామికా కండక్టర్స్‌ రూ.102.30 కోట్లు బకాయి ఉంది. 

ఎన్‌టీపీసీ: మూలధన వ్యయం, వర్కింగ్ క్యాపిటల్, ఇతర కార్పొరేట్ అవసరాల కోసం, ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ చేసి రూ.12,000 కోట్ల వరకు సమీకరించడానికి వాటాదారుల ఆమోదాన్ని పొందింది. వార్షిక సాధారణ సమావేశంలో ఈ తీర్మానానికి ఆమోదం దక్కింది.

టాటా మోటార్స్: బస్ బాడీలను తయారు చేసే జాయింట్ వెంచర్‌లో మార్కోపోలో మోటార్స్‌కు ఉన్న వాటా కొనుగోలును టాటా మోటార్స్‌ పూర్తి చేసింది. 51:49 నిష్పత్తిలో, 2006లో జాయింట్‌ వెంచర్‌ ఏర్పడింది.

వొడాఫోన్ ఐడియా: కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షయ ముంద్రను కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించడానికి ఈ టెలికాం ప్లేయర్ షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు. ఈ కంపెనీ దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయింది.

బయోకాన్: బయోకాన్‌ ఆర్మ్‌ 'బయోకాన్ బయోలాజిక్స్‌'కు చెందిన ఏడు మాన్యుఫాక్చరింగ్‌ ఫెసిలిటీల్లో తనిఖీలు చేసిన USFDA, బెంగళూరులోని రెండు సైట్లకు 483s, 11 అబ్జర్వేషన్లు; మలేషియాలోని ప్లాంట్‌కు ఆరు అబ్జర్వేషన్లను జారీ చేసింది.

హావెల్స్ ఇండియా: ఎలక్ట్రికల్ వస్తువులు, ఇతర ఉపకరణాలను తయారు చేసే ఈ సంస్థ, రాజస్థాన్‌లోని గిలోత్ ప్లాంట్‌లో వాషింగ్ మెషీన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని యోచిస్తోంది. అక్కడ మరో రూ.130 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది.

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్: వచ్చే నాలుగేళ్లకు, ఐసీసీ పురుషుల టోర్నీలు & అండర్-19 గ్లోబల్‌ ఈవెంట్‌ల టెలివిజన్ ప్రసార హక్కుల కోసం డిస్నీ స్టార్‌తో లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డిస్నీ+ హాట్‌స్టార్ ద్వారా అన్ని ఐసీసీ  టోర్నమెంట్‌ల ప్రసారం కొనసాగుతుంది.

స్పైస్‌జెట్: పెరిగిన ఇంధన ధరలు, రూపాయి క్షీణత ప్రభావం చూపడంతో, జూన్ త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రూ.789 కోట్లకు పెరిగిందని నివేదించింది. మరోవైపు, $200 మిలియన్లు లేదా రూ.1,600 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. దీని లాభదాయక కార్గో వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా మార్చాలని కూడా చూస్తోంది. 

న్యూఢిల్లీ టెలివిజన్ (ఎన్‌డీటీవీ): ఎన్‌డీటీవీలో 26 శాతం అదనపు వాటా కొనుగోలు కోసం అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌ను అక్టోబర్ 17న ప్రారంభించనుంది. ఈ ఆఫర్‌లో భాగంగా... ఒక్కో ఈక్విటీ షేరును రూ.294 చొప్పున 1.67 కోట్ల షేర్లను కొనుగోలు చేస్తుంది. నవంబర్ 1న ఆఫర్‌ ముగుస్తుంది.

కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్: ఈ ఏడాది మార్చి 31 నాటికి ఈ కంపెనీ రుణాలు గణనీయంగా తగ్గి, రూ.1,810 కోట్లకు పడిపోయాయని కంపెనీ తెలిపింది. అయినా, ఇప్పటికీ కొన్ని రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీ చెల్లింపుల్లో ఎగవేతలు కూడా ఉన్నాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 01 Sep 2022 08:41 AM (IST) Tags: Stock market Share Market Stocks to watch stocks in news

సంబంధిత కథనాలు

Can Fin Homes - M&M Fin: BSE500లో 345 షేర్లు విలవిల - వారంలో 19% వరకు పతనం

Can Fin Homes - M&M Fin: BSE500లో 345 షేర్లు విలవిల - వారంలో 19% వరకు పతనం

Electric SUV Space: ఎలక్ట్రిక్‌ SUVల కోసం ₹4 వేల కోట్ల ప్లాన్‌లో మహీంద్ర

Electric SUV Space: ఎలక్ట్రిక్‌ SUVల కోసం ₹4 వేల కోట్ల ప్లాన్‌లో మహీంద్ర

Stock Market Crash: రూపాయి ఆల్‌టైమ్‌ లో - సెన్సెక్స్‌, నిఫ్టీ డౌన్‌తో రూ.5లక్షల కోట్లు ఆవిరి!

Stock Market Crash: రూపాయి ఆల్‌టైమ్‌ లో - సెన్సెక్స్‌, నిఫ్టీ డౌన్‌తో రూ.5లక్షల కోట్లు ఆవిరి!

Mahindra & Mahindra Shares: ఆర్‌బీఐ దెబ్బకు మహీంద్ర ఫైనాన్షియల్‌ మైండ్‌ బ్లాంక్‌, షేర్లు డౌన్‌

Mahindra & Mahindra Shares: ఆర్‌బీఐ దెబ్బకు మహీంద్ర ఫైనాన్షియల్‌ మైండ్‌ బ్లాంక్‌, షేర్లు డౌన్‌

Tata Group Shares: 25% జంప్‌ మీద టాటా షేర్ల కన్ను, ఇదిగో వాటి లిస్ట్‌!

Tata Group Shares: 25% జంప్‌ మీద టాటా షేర్ల కన్ను, ఇదిగో వాటి లిస్ట్‌!

టాప్ స్టోరీస్

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

MS Dhoni: ధోనీ ఫేస్ బుక్ పోస్టుపై స్పష్టత, ఈసారి ప్రపంచకప్ మనదే అంటున్న మహీ

MS Dhoni:  ధోనీ ఫేస్ బుక్ పోస్టుపై స్పష్టత, ఈసారి ప్రపంచకప్ మనదే అంటున్న మహీ

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం