search
×

Stock Market Today: యుద్ధ భయాల నుంచి కోలుకున్న మార్కెట్లు! 19,600 పైకి నిఫ్టీ

Stock Market Opening 10 October 2023: భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం చక్కని లాభాల్లో ఉన్నాయి. సోమవారం నాటి నష్టాల నుంచి రికవరీ అయ్యాయి.

FOLLOW US: 
Share:

Stock Market Opening 10 October 2023:

భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం చక్కని లాభాల్లో ఉన్నాయి. సోమవారం నాటి నష్టాల నుంచి రికవరీ అయ్యాయి. ఇజ్రాయెల్‌, పాలస్తీనా యుద్ధ భయాల నుంచి ఇన్వెస్టర్లు భయటపడుతున్నారు. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 117 పాయింట్లు పెరిగి 19,630 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 394 పాయింట్లు పెరిగి 65,906 వద్ద కొనసాగుతున్నాయి. స్థిరాస్తి రంగ షేర్లు జోరుమీదున్నాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,512 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,662 వద్ద మొదలైంది. 65,662 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,909 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 394 పాయింట్లు పెరిగి 65,906 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

సోమవారం 19,512 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,565 వద్ద ఓపెనైంది. 19,565 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,631 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 117 పాయింట్లు పెరిగి 19,630 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ ఎగిసింది. ఉదయం 44,027 వద్ద మొదలైంది. 44,004 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,139 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 194 పాయింట్లు ఎగిసి 44,081 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 41 కంపెనీలు లాభాల్లో 9 నష్టాల్లో ఉన్నాయి. కోల్‌ ఇండియా, అదానీ పోర్ట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యూపీఎల్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టీసీఎస్‌, సిప్లా, హిందాల్కో నష్టపోయాయి. ఫార్మా, హెల్త్‌కేర్‌ రంగాల సూచీలు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎగిశాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.58,530 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 పెరిగి రూ.72,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.140 పెరిగి రూ.23,760 వద్ద కొనసాగుతోంది.

క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?

భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఇజ్రాయెల్‌, పాలస్తీనా యుద్ధం అంతర్జాతీయ మార్కెట్లలో నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. ఒక్క రోజులోనే ముడి చమురు ధరలు ఐదు శాతానికి పైగా పెరగడంతో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే ఆర్థికవృద్ధి మందగించే అవకాశం ఉంది. దాంతో ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 141 పాయింట్లు తగ్గి 19,512 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 483 పాయింట్లు తగ్గి 65,512 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఫ్లాట్‌గా 83.27 వద్ద స్థిరపడింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 10 Oct 2023 11:47 AM (IST) Tags: Nifty Stock Market Sensex

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!

Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!

Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు

Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు

Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!

Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!

PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ

PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ