By: ABP Desam | Updated at : 31 May 2023 11:31 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening, 31 May 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 83 పాయింట్లు తగ్గి 18,550 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 327 పాయింట్లు తగ్గి 62,641 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 62,969 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,839 వద్ద మొదలైంది. 62,586 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,876 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 327 పాయింట్ల నష్టంతో 62,641 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 18,633 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,594 వద్ద ఓపెనైంది. 18,531 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,603 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 83 పాయింట్లు తగ్గి 18,550 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 44,318 వద్ద మొదలైంది. 44,050 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,339 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 296 పాయింట్లు తగ్గి 44,140 వద్ద మొదలైంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభాల్లో 26 నష్టాల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఏసియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, రిలయన్స్ నష్టపోయాయి. ఐటీ, మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎగగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.440 పెరిగి రూ.60,930గా ఉంది. కిలో వెండి రూ.300 పెరిగి రూ.76,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.26,910 వద్ద ఉంది.
Also Read: రిటైర్మెంట్ తర్వాత ₹6 కోట్లు, నెలకు ₹50 వేల పెన్షన్- బిందాస్‌గా బతకొచ్చు
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది
Congratulations to Asian Paints Ltd for completing 28 years of listing in NSE. #Listed #ListingAnniversary #Nifty50 #Nifty50Companies #ShareMarket #StockMarket @ashishchauhan pic.twitter.com/lnfvXt6PiN
— NSE India (@NSEIndia) May 31, 2023
Arbitration is a quasi-judicial process of settlement of disputes between Investor and company/ RTA.#NSE #NSEIndia #DisputeResolution #Arbitration @ashishchauhan pic.twitter.com/QOfffNeqLQ
— NSE India (@NSEIndia) May 30, 2023
Market Update for the day.
— NSE India (@NSEIndia) May 30, 2023
See more:https://t.co/XW5Vr5nX8chttps://t.co/hyRwDLLexj#NSEUpdates #Nifty #Nifty50 #NSEIndia #StockMarketIndia #ShareMarket #MarketUpdates pic.twitter.com/vK5KxaA0L7
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement: "స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్