By: Rama Krishna Paladi | Updated at : 24 Apr 2023 10:48 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Opening 24 April 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం మళ్లీ ఫ్లాట్‌గానే మొదలయ్యాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు ఎగగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 3 పాయింట్లు పెరిగి 17,627 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 18 పాయింట్లు పెరిగి 59,673 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,655 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,873 వద్ద మొదలైంది. 59,635 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,958 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 18 పాయింట్ల లాభంతో 59,673 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 17,624 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,707 వద్ద ఓపెనైంది. 17,620 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,709 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 3 పాయింట్లు పెరిగి 17,627 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 42,469 వద్ద మొదలైంది. 42,269 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,469 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 230 పాయింట్లు పెరిగి 42,348 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభాల్లో 28 నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా కన్జూమర్, హీరోమోటో కార్ప్, అపోలో హాస్పిటల్స్, విప్రో షేర్లు లాభపడ్డాయి. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్, ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్‌టెల్ నష్టపోయాయి. ఆటో, మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, రియాల్టీ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.80 తగ్గి రూ.60,710గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.76,400 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.620 తగ్గి రూ.29,030 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
In today's #StockTerm, let's look at what Portfolio Investment is!#NSE #StockMarket #ShareMarket #StockTerms #NSEIndia #InvestorEducation #StockMarketIndia #StockExchange #StockTrading #Stocks #Investing #Trading #Crossmargining pic.twitter.com/woU8grQ2DF
— NSE India (@NSEIndia) April 24, 2023
Can you spot the 3 companies that are part of FinNifty? Write your answers in the comments.#NSECrossword #Crossword #ShareMarket #StockMarket #NIFTY50 #Investor pic.twitter.com/CZEOpejVAo
— NSE India (@NSEIndia) April 23, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement: "స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్