search
×

Stock Market News: నిన్న బంపర్‌ ప్రాఫిట్‌ నేడు సూచీలు డల్‌ - ఆటో, రియాల్టీ షేర్ల క్రేజ్‌!

Stock Market Opening 15 February 2023: స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో మొదలయ్యాయి. మెరుగైన ఫలితాలు విడుదల చేయడంతో అదానీ గ్రూప్‌ షేర్లు రాణిస్తున్నాయి.

FOLLOW US: 
Share:

Stock Market Opening 15 February 2023: 

స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. మెరుగైన ఫలితాలు విడుదల చేయడంతో అదానీ గ్రూప్‌ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 5 పాయింట్ల నష్టంతో 17,924 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 37 పాయింట్ల నష్టంతో 60,995 వద్ద ఉన్నాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 61,032 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,990 వద్ద మొదలైంది. 60,750 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,057 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 37 పాయింట్ల నష్టంతో 60,995 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

మంగళవారం 17,929 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,896 వద్ద ఓపెనైంది. 17,853 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,939 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 5 పాయింట్ల నష్టంతో 17,924 వద్ద ట్రేడవుతుంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ స్వల్ప నష్టాల్లో ఉంది. ఉదయం 41,674 వద్ద మొదలైంది. 41,455 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,674 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 37 పాయింట్లు తగ్గి 41,611 వద్ద చలిస్తోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభాల్లో 29 నష్టపోయాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఐచర్‌ మోటార్స్‌, అపోలో హాస్పిటల్స్‌, రిలయన్స్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, హిందుస్థాన్‌ యునీలివర్‌, బ్రిటానియా, ఎల్‌టీ, సన్‌ఫార్మా షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు స్వల్పంగా తగ్గాయి. ఆటో, మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ సూచీలు ఎగిశాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరల్లో ఎక్కువ మార్పేమీ లేదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు  రూ.57,160గా ఉంది. కిలో వెండి రూ.450 తగ్గి రూ.69,950 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.660 తగ్గి రూ.24,720 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 15 Feb 2023 11:25 AM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

టాప్ స్టోరీస్

Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !

Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !

Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్

Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన

Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!

Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!