search
×

Stock Market News: జీడీపీ గ్రోత్‌రేట్‌ జోష్‌ - సెన్సెక్స్‌ 400, నిఫ్టీ 125 ప్లస్‌!

Stock Market Opening 08 February 2023: స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి.

FOLLOW US: 
Share:

Stock Market Opening 08 February 2023: 

స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. మెరుగైన జీడీపీ వృద్ధిరేటు అంచనాలు, రెపోరేటు పెరుగుదల నేపథ్యంలో సూచీలు ఎగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 125 పాయింట్ల లాభంతో 17,847 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 385 పాయింట్ల లాభంతో 60,671 వద్ద కొనసాగుతున్నాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 60,286 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,332 వద్ద మొదలైంది. 60,324 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,792 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 385 పాయింట్ల లాభంతో 60,671 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

మంగళవారం 17,721 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,750 వద్ద ఓపెనైంది. 17,744 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,878 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 125 పాయింట్ల లాభంతో 17,847 వద్ద ట్రేడవుతుంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ స్వల్ప లాభాల్లో ఉంది. ఉదయం 41,542 వద్ద మొదలైంది. 41,475 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,791 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 123 పాయింట్లు పెరిగి 41,614 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 35 కంపెనీలు లాభాల్లో 15 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌ షేర్లు లాభపడ్డాయి. హీరో మోటోకార్ప్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐచర్‌ మోటార్స్‌, టాటా స్టీల్‌, టాటా కన్జూమర్‌ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంకు, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్‌ సూచీలు ఎగిశాయి. రియాల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు స్వల్పంగా ఎరుపెక్కాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 08 Feb 2023 10:34 AM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

సంబంధిత కథనాలు

Stock Market News: ఆఖరి రోజు అదుర్స్‌! రిలయన్స్‌ అండతో 1031 పాయింట్లతో ఢంకా మోగించిన సెన్సెక్స్‌

Stock Market News: ఆఖరి రోజు అదుర్స్‌! రిలయన్స్‌ అండతో 1031 పాయింట్లతో ఢంకా మోగించిన సెన్సెక్స్‌

Stock Market News: రాకెట్లా దూసుకెళ్తున్న స్టాక్‌ మార్కెట్లు - సెన్సెక్స్‌ 550, నిఫ్టీ 160 పాయింట్లు అప్‌!

Stock Market News: రాకెట్లా దూసుకెళ్తున్న స్టాక్‌ మార్కెట్లు - సెన్సెక్స్‌ 550, నిఫ్టీ 160 పాయింట్లు అప్‌!

Stock Market News: ఈక్విటీ మార్కెట్లో ఈ జోష్‌ ఎక్కడిదీ! భారీగా పెరిగిన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market News: ఈక్విటీ మార్కెట్లో ఈ జోష్‌ ఎక్కడిదీ! భారీగా పెరిగిన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Opening 29 March 2023: అదానీ షేర్ల జోరు - నిఫ్టీ 80, సెన్సెక్స్‌ 229 పాయింట్లు అప్‌!

Stock Market Opening 29 March 2023: అదానీ షేర్ల జోరు - నిఫ్టీ 80, సెన్సెక్స్‌ 229 పాయింట్లు అప్‌!

Stock Market: ఊగిసలాడిన సూచీలు - రూపాయి 18 పైసలు జంప్‌!

Stock Market: ఊగిసలాడిన సూచీలు - రూపాయి 18 పైసలు జంప్‌!

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి