By: ABP Desam | Updated at : 06 Feb 2023 10:44 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ ( Image Source : istockphoto )
Stock Market Opening 06 February 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. దాంతో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 102 పాయింట్ల నష్టంతో 17,751 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 385 పాయింట్ల నష్టంతో 60,435 వద్ద కొనసాగుతున్నాయి. పవర్, మెటల్ షేర్లపై ఒత్తిడి నెలకొంది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 60,841 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,847 వద్ద మొదలైంది. 60,438 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,847 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 385 పాయింట్ల నష్టంతో 60,435 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 17,854 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,818 వద్ద ఓపెనైంది. 17,712 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,823 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 102 పాయింట్ల నష్టంతో 17,751 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 41,530 వద్ద మొదలైంది. 41,384 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,724 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 53 పాయింట్లు పెరిగి 41,553 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 10 కంపెనీలు లాభాల్లో 40 నష్టాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, హీరోమోటో, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, సిప్లా షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, దివిస్ ల్యాబ్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐచర్‌మోటార్స్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఐటీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఇండిగో: ఏవియేషన్ దిగ్గజం ఇండిగో డిసెంబర్ త్రైమాసిక నికర లాభం అనేక రెట్లు పెరిగి రూ. 1,422 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలోని రూ. 129 కోట్లతో పోలిస్తే లాభం 1,000% పెరిగింది. మూడో త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 61% పెరిగి రూ. 14,932 కోట్లకు చేరుకుంది
పేటీఎం: డిసెంబర్ త్రైమాసికంలో ఎబిటా స్థాయిని నెగెటివ్ నుంచి పాజిటివ్‌లోకి తీసుకొచ్చింది. మార్గదర్శకత్వం కంటే మూడు త్రైమాసికాల ముందే దీనిని పేటీఎం సాధించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర నష్టాన్ని రూ. 392 కోట్లకు తగ్గించింది. నికర నష్టం ఏడాది క్రితం రూ. 779 కోట్లుగా ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Stock Market News: ఫైనాన్స్ షేర్లు కుమ్మేశాయ్ - సెన్సెక్స్ 445, నిఫ్టీ 119 పెరిగేశాయ్!
Stock Market News: ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని సూచీలు డౌన్ - సాయంత్రానికి సెన్సెక్స్, నిఫ్టీ రికవరీ!
Financial Year: ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాల్సిన 7 ముఖ్యమైన పనులు, లేదంటే ఇబ్బంది పడతారు
Stock Market News: శుక్రవారం స్టాక్ మార్కెట్లో సిరుల పంట - సెన్సెక్స్ 355, నిఫ్టీ 114 అప్!
Stock Market News: వరుస నష్టాలకు తెర - ఒడుదొడుకులు ఎదురైన లాభాల్లోనే నిఫ్టీ, సెన్సెక్స్!
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్ థింగ్ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల
UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్!
Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు