By: ABP Desam | Updated at : 26 Sep 2022 11:49 AM (IST)
Edited By: Arunmali
సుజ్లాన్ ఎనర్జీ రైట్స్ ఇష్యూ
Suzlon Energy Stock In Focus: ఇండియన్ మల్టీనేషనల్ విండ్ టర్బైన్ తయారీ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ (Suzlon Energy) షేర్లు దాదాపు సగానికి సగం రేటుకే అందుబాటులోకి రానున్నాయి. రైట్స్ జారీ (Right Issue) ద్వారా ₹1200 కోట్ల వరకు సేకరించేందుకు ఈ కంపెనీ ప్లాన్ వేసింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు కూడా ఇందుకు ఆమోదం తెలిపింది.
కంపెనీ దాఖలు చేసిన ఫ్రెష్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, 240 కోట్ల ఈక్విటీ షేర్లను, ఒక్కో షేరును ₹5 చొప్పున జారీ చేయడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ షేర్ల ముఖ విలువ 2 రూపాయలు.
దాదాపు 50 శాతం డిస్కౌంట్
శుక్రవారం సెషన్‌లో, NSEలో, సుజ్లాన్ ఎనర్జీ షేర్ ధర ₹9.15 వద్ద ముగిసింది. అంటే షేర్ల రైట్ ఇష్యూ సుమారు 45 శాతం తగ్గింపుతో వస్తోంది. ఇవాళ్టి (సోమవారం) పతనంతో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం వరకు డిస్కౌంట్‌లో వస్తున్నట్లు లెక్క.
అర్హతలు
రైట్స్ ఇష్యూలో పాల్గొనాలటే కొన్ని అర్హతలు ఉండాలి. ఈ కంపెనీలో 21 ఫుల్లీ పెయిడప్ ఈక్విటీ షేర్లు ఉన్నవాళ్లు 5 రైట్స్ ఈక్విటీ షేర్లను (5:21) పొందడానికి అర్హులు. ఫుల్లీ పెయిడప్ షేర్లు అనగానే కొత్తవాళ్లు కంగారు పడొద్దు. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న లేదా ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో ట్రేడవుతున్న సుజ్లాన్ ఎనర్జీ షేర్లన్నీ ఫుల్లీ పెయిడప్ కిందే లెక్క. ఫుల్లీ పెయిడప్ అనేది ఒక సాంకేతిక పదం.
5:21 నిష్పత్తిని ఇంకా సింపుల్‌గా చెప్పుకుంటే, మీ దగ్గర 5 ఈక్విటీ షేర్లు ఉంటే, మీకు ఒక రైట్ ఈక్విటీ షేర్‌ను జారీ చేస్తారు. అంటే, కనీసం 5 ఈక్విటీ షేర్లు ఉన్నవాళ్లు ఈ రైట్స్‌లో ఇష్యూకి అర్హత పొందుతారు.
రికార్డ్ డేట్
రైట్స్ ఇష్యూకి రికార్డ్ తేదీని (మీ డీమ్యాట్ ఖాతాలో ఎప్పటికి కనీసం 5 షేర్లు ఉండాలో చెప్పే తేదీ) ఇంకా ఖరారు చేయలేదు. త్వరలోనే కంపెనీ వెల్లడిస్తుంది.
రైట్స్ ఇష్యూ అంటే?
రైట్స్ ఇష్యూ అంటే, కంపెనీ కొత్తగా కొన్ని షేర్లను రైట్స్ రూపంలో జారీ చేస్తుంది. రికార్డ్ తేదీ నాటికి షేర్లను కలిగివున్న, అర్హులైన వారికి మాత్రమే వీటిని జారీ చేస్తుంది. ఇలా అమ్మిన షేర్లకు తీసుకోవాల్సిన డబ్బును పెట్టుబడిదారుల నుంచి దఫదఫాలుగా వసూలు చేస్తుంది. పూర్తి మొత్తం వసూలు అయిన తర్వాత మాత్రమే సదరు షేర్లను స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయగలం. అప్పటివరకు వాటిని పార్షియల్లీ పెయిడప్ షేర్లుగా చూస్తాం, ట్రేడింగ్ కుదరదు. అంటే, భవిష్యత్తులో ఒకవేళ ఈ షేరు ధర పెరిగితే, ఇప్పుడు డిస్కౌంట్‌లో తీసుకుంటారు కాబట్టి, షేర్ల మీద లాభం వస్తుంది. ఇదే అంచనా రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది.
ఈ సంవత్సరం పొడవునా సుజ్లాన్ షేర్లు బేర్‌ల ఫేవరెట్ 'సెల్ ఆన్ రైజ్'గా మిగిలిపోయాయి. గత నెలలో ఈ స్టాక్ దాదాపు 4 శాతం రాబడిని ఇచ్చింది. అయితే, గత ఆరు నెలల కాలంలో దాదాపు 7 శాతం, ఈ సంవత్సరంలో ఇప్పటివరకు (YTD) దాదాపు 21 శాతం క్షీణించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్- ప్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం