search
×

Stock Market Closing: రాకెట్‌ స్పీడ్‌తో ఐటీ స్టాక్స్‌ పరుగులు! సెన్సెక్స్‌ 650+, నిఫ్టీ 170+

Stock Market Closing Bell 08 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీగా లాభపడ్డాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు.

FOLLOW US: 
Share:

Stock Market Closing Bell 08 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీగా లాభపడ్డాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఉదయమే గ్యాప్‌ అప్‌తో ఓపెనైన సూచీలు సాయంత్రం మరింత పెరిగాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 174 పాయింట్ల లాభంతో 17,798 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 659 పాయింట్ల లాభంతో 59,688 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో 19 పైసలు లాభపడి 79.71 వద్ద స్థిరపడింది.

BSE Sensex

క్రితం సెషన్లో 59,028 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,374 లాభాల్లో మొదలైంది. 59,315 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,711 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 659 పాయింట్ల లాభంతో 59,688 వద్ద ముగిసింది.

NSE Nifty

బుధవారం 17,624 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,748 వద్ద ఓపెనైంది. 17,791 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,807 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 174 పాయింట్ల లాభంతో 17,798 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ భారీగా లాభపడింది.  ఉదయం 39,763 వద్ద మొదలైంది. 39,706 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,265 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 753 పాయింట్ల లాభంతో  40,208 వద్ద క్లోజైంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 33 కంపెనీలు లాభాల్లో 16 నష్టాల్లో ముగిశాయి. శ్రీ సెమ్‌, బీపీసీఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ లైఫ్‌, టాటా కన్జూమర్‌, కోల్‌ ఇండియా షేర్లు నష్టపోయాయి. మీడియా, మెటల్‌, ఫార్మా, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు దిద్దుబాటుకు గురయ్యాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్‌, ఐటీ, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎగిశాయి. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 08 Sep 2022 03:50 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!

AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!

KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం

KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం

Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?

Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?

Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి

Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి