By: ABP Desam | Updated at : 30 Jan 2023 04:02 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing 30 January 2023:
హమ్మయ్య! ఇన్వెస్టర్లు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచీ ఊగిసలాడిన సూచీలు సాయంత్రానికి కోలుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 44 పాయింట్ల లాభంతో 17,648 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 169 పాయింట్ల లాభంతో 59,500 వద్ద ముగిశాయి. ఐటీ షేర్లకు గిరాకీ పెరిగింది. డాలరుతో పోలిస్తే రూపాయి 2 పైసలు బలపడి 81.50 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,330 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,101 వద్ద మొదలైంది. 58,699 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,644 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 169 పాయింట్ల లాభంతో 59,500 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 17,604 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,541 వద్ద ఓపెనైంది. 17,405 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,709 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 44 పాయింట్ల లాభంతో 17,648 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ స్వల్ప లాభాల్లో ముగిసింది. ఉదయం 39,856 వద్ద మొదలైంది. 39,419 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,789 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 42 పాయింట్లు పెరిగి 40,387 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏసియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సెమ్ షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎల్‌టీ, జేఎస్‌డబ్ల్యూ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకు, కన్జూమర్ డ్యురబుల్ సూచీలు ఎగిశాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు పతనమయ్యాయి.
Also Read: జాతీయవాదం పేరు చెప్పి మోసాల్ని కప్పి పుచ్చలేరు, అదానీకి హిండన్ బర్గ్ స్ట్రాంగ్ కౌంటర్
Also Read: రికరింగ్ డిపాజిట్‌లో ఎక్కువ డబ్బు పొందాలంటే ఎలా?
Also Read: సుకన్య సమృద్ధికి బడ్జెట్‌లో బూస్ట్ - అలాంటి వారికీ ఛాన్స్ ఇస్తారట!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Congratulations to Aristo Bio-Tech and Lifescience Ltd. on getting listed on NSE Emerge today. Public Issue was of Rs. 1305.22 lakhs at an issue price of Rs. 72 per share.#NSE #Listing #ShareMarket #StockMarket pic.twitter.com/T7NMuX7ObR
— NSE India (@NSEIndia) January 30, 2023
Do you know about #Arbitration Mechanism in Stock Exchange for dispute resolution against listed companies/Registrars and Transfer Agents (RTA)? Follow the link to know more: https://t.co/kcsPDnOv6C#DisputeResolution #NSE #StockExchange @AshishChauhan
— NSE India (@NSEIndia) January 30, 2023
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?