By: ABP Desam | Updated at : 11 May 2023 03:52 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing 11 May 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. హై లెవల్స్‌లో కన్సాలిటేడ్ అయ్యే క్రమంలో స్వల్పంగా నష్టపోయాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 18 పాయింట్లు తగ్గి 18,297 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 35 పాయింట్లు తగ్గి 61,904 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు బలహీనపడి 82.09 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,940 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,940 వద్ద మొదలైంది. 61,823 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,168 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 35 పాయింట్ల నష్టంతో 61,904 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 18,315 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,357 వద్ద ఓపెనైంది. 18,270 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,389 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 18 పాయింట్లు తగ్గి 18,297 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 43,535 వద్ద మొదలైంది. 43,367 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,774 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 144 పాయింట్లు పెరిగి 43,475 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఏసియన్ పెయింట్స్, హిందుస్థాన్ యునీలివర్, అదానీ పోర్ట్స్, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్, ఎల్‌టీ, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, దివిస్ ల్యాబ్ షేర్లు నష్టపోయాయి. మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.62,130గా ఉంది. కిలో వెండి రూ.400 తగ్గి రూ.77,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.1090 పెరిగి రూ.29,260 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SENSEX derivatives contract is relaunching on 15th May, 2023, with a unique Friday expiry and lower lot size. #SENSEX #Derivatives #FridayExpiry #LowerLotSize pic.twitter.com/Q121t9Kx5V
— BSE India (@BSEIndia) May 11, 2023
Innokaiz India Ltd., 435th company on #BSESME Platform got listed today. Shri Balakrishnan Sukumarbalakrishnan, MD, Innokaiz India Limited along with
— BSE India (@BSEIndia) May 11, 2023
Shri Ajay Thakur, Head SME & Startups, BSE rang the #BSEBell mark the listing. pic.twitter.com/jT0iG5xTMw
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు