By: ABP Desam | Updated at : 09 Feb 2023 03:59 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Closing 09 February 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఉదయం నుంచి ఒడుదొడుకుల్లో సాగిన సూచీలు కనిష్ఠ స్థాయిల నుంచి తేరుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 21 పాయింట్ల లాభంతో 17,893 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 142 పాయింట్ల లాభంతో 60,806 వద్ద ముగిశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ టాప్ లాసర్స్ జాబితాలో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు తగ్గి 82.51 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 60,663 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,715 వద్ద మొదలైంది. 60,472 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,863 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 142 పాయింట్ల లాభంతో 60,806 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 17,871 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,885 వద్ద ఓపెనైంది. 17,779 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,916 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 21 పాయింట్ల లాభంతో 17,893 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ స్వల్ప లాభాల్లో ముగిసింది. ఉదయం 41,634 వద్ద మొదలైంది. 41,252 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,634 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 16 పాయింట్లు పెరిగి 41,554 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 25 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ముగిశాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఏసియన్ పెయింట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హీరోమోటో కార్ప్, సిప్లా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టపోయాయి.ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి. ఫైనాన్స్, ఐటీ, మీడియా సూచీలు స్వల్పంగా ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
విలువైన లోహాల ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ.160 పెరిగి రూ.57,710గా ఉంది. కిలో వెండి రూ.50 తగ్గి రూ.71,350 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.80 తగ్గి రూ.25,880 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Invest Right Toh Future Bright!
— BSE India (@BSEIndia) February 9, 2023
Visit https://t.co/ni4rMKlu27 to know safe investing practices.#Investor #Investment #InvestorAwareness pic.twitter.com/bPs8WYsXsS
Sensex opens at 60715 with a gain of 52 points pic.twitter.com/wbsXkeF8UE
— BSE India (@BSEIndia) February 9, 2023
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!