By: ABP Desam | Updated at : 08 Mar 2023 04:32 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Closing 08 March 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. అదానీ గ్రూపులో జీక్యూజీ పెట్టుబడులను పెంచడం మదుపర్లలో ఉత్సాహం నింపింది. వివిధ రంగాల సూచీలు మిశ్రమంగా కదలాడాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 42 పాయింట్లు పెరిగి 17,754 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 123 పాయింట్లు ఎగిసి 60,348 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు బలహీనపడి 82.05 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 60,224 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,916 వద్ద మొదలైంది. 59,844 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,402 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 123 పాయింట్ల లాభంతో 60,348 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 17,711 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,665 వద్ద ఓపెనైంది. 17,602 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,766 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 42 పాయింట్లు పెరిగి 17,754 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 41,178 వద్ద మొదలైంది. 41,100 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,625 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 226 పాయింట్లు పెరిగి 41,577 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 28 కంపెనీలు లాభాల్లో 22 నష్టాల్లో ముగిశాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఆటో, ఎల్‌టీ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, టెక్ మహీంద్రా, ఇన్ఫీ, అపోలో హాస్పిటల్స్ షేర్లు నష్టపోయాయి. ఐటీ, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకు, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.720 తగ్గి రూ.55,630 గా ఉంది. కిలో వెండి రూ.1450 తగ్గి రూ.65,550 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.1010 తగ్గి రూ.24,570 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Sensex opens at 59916 with a loss of 308 points pic.twitter.com/XWYiKfFHMx
— BSE India (@BSEIndia) March 8, 2023
Invest Right Toh Future Bright!
— BSE India (@BSEIndia) March 8, 2023
Visit https://t.co/ni4rMKlu27 to know safe investing practices.#Investor #Investment #InvestorAwareness pic.twitter.com/NBmaUywYLG
BSE wishes you a Happy Women’s Day#happwomensday #WomensDay #WomensDay2023 #DigitAll #FinEmpower pic.twitter.com/nT2JeFshEq
— BSE India (@BSEIndia) March 8, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
YSRCP Kannababu: పవన్ కల్యాణ్‌ను షిప్‌లోకి వెళ్లకుండా ఆపిందెవరు? చంద్రబాబే బాధ్యత వహించాలి: కన్నబాబు
Hydra News: హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
TV Movies: సలార్, సమరసింహా రెడ్డి to టిల్లు స్క్వేర్, బలగం - ఈ ఆదివారం టీవీలలో ఏయే సినిమాలు వస్తున్నాయంటే?
Bigg Boss Telugu Season 8: డబుల్ ఎలిమినేషన్‌లో తేజ, పృథ్వీ - గోల్డెన్ టికెట్‌తో లక్కీ ఛాన్స్... టైటిల్ గెలిచే దమ్ము ఎవరికి?