search
×

Stock Market News: స్టాక్‌ మార్కెట్లో జజ్జనక! 18,700 పైన నిఫ్టీ, 63,142 వద్ద సెన్సెక్స్‌ క్లోజింగ్‌!

Stock Market Closing 07 June 2023: స్టాక్‌ మార్కెట్లు బుధవారం దూసుకెళ్లాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 127 పాయింట్లు పెరిగి 18,726 వద్ద ముగిసింది.

FOLLOW US: 
Share:

Stock Market Closing 07 June 2023: 

స్టాక్‌ మార్కెట్లు బుధవారం దూసుకెళ్లాయి. ఉదయం నుంచీ లాభాల్లో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్ల  నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 127 పాయింట్లు పెరిగి 18,726 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 350 పాయింట్లు పెరిగి 63,142 వద్ద క్లోజయ్యాయి. నిఫ్టీ ఈ ఏడాదిలో తొలిసారి 18,700 దాటేసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు పెరిగి 82.54 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 62,792 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,792 వద్ద మొదలైంది. 62,841 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,196 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 350 పాయింట్ల లాభంతో 63,142 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

మంగళవారం 18,599 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,665 వద్ద ఓపెనైంది. 18,636 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,738 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 127 పాయింట్లు ఎగిసి 18,726 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 44,318 వద్ద మొదలైంది. 44,143 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,346 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 110 పాయింట్లు పెరిగి 44,275 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 43 కంపెనీలు లాభాల్లో 7 నష్టాల్లో ఉన్నాయి. బ్రిటానియా, టాటా కన్జూమర్‌, బీపీసీఎల్‌, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు లాభపడ్డాయి. కొటక్‌ బ్యాంక్‌, సిప్లా, మారుతీ, బజాజ్ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు నష్టపోయాయి. నేడు అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎక్కువ లాభపడ్డాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరల్లో మార్పేమీ లేదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.60,650గా ఉంది. కిలో వెండి రూ.73,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.40 పెరిగి రూ.27,510 వద్ద ఉంది.

Also Read: స్టాక్‌ మార్కెట్‌పై పెరుగుతున్న క్రేజ్‌, ఇంతకంటే ప్రూఫ్‌ ఇంకేం కావాలి?

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 07 Jun 2023 03:56 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Stock Market Today: సూచీల ఊగిసలాట! లాభాల్లోంచి మళ్లీ నష్టాల్లోకి జారుకున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Today: సూచీల ఊగిసలాట! లాభాల్లోంచి మళ్లీ నష్టాల్లోకి జారుకున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Today: వరుస నష్టాలకు తెర! రీబౌండ్‌ అయిన నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Today: వరుస నష్టాలకు తెర! రీబౌండ్‌ అయిన నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Crash: వణికించిన స్టాక్‌ మార్కెట్లు! 796 పాయింట్ల పతనమైన సెన్సెక్స్‌

Stock Market Crash: వణికించిన స్టాక్‌ మార్కెట్లు! 796 పాయింట్ల పతనమైన సెన్సెక్స్‌

Stock Market Update: రక్తమోడుతున్న స్టాక్‌ మార్కెట్లు! నేడు రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి!

Stock Market Update: రక్తమోడుతున్న స్టాక్‌ మార్కెట్లు! నేడు రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి!

Stock Market Today: 20,200 టచ్‌ చేసిన నిఫ్టీ - 320 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

Stock Market Today: 20,200 టచ్‌ చేసిన నిఫ్టీ - 320 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

టాప్ స్టోరీస్

BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

BRS Leaders For Chandrababu :  చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి