search
×

Stock Market News: 18,500 మీదే నిఫ్టీ క్లోజింగ్‌ - ఆటో, రియాల్టీ, మెటల్స్‌ బూమ్‌!

Stock Market Closing 02 June 2023: స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం మోస్తరు లాభాల్లో ముగిశాయి. సూచీలు కొన్ని రోజులుగా ఆచితూచి కదులుతున్నాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing 02 June 2023: 

స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం మోస్తరు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్‌ మార్కెట్ల  నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. సూచీలు కొన్ని రోజులుగా ఆచితూచి కదులుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 46 పాయింట్లు పెరిగి 18,534 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 118 పాయింట్లు ఎగిసి 62,547 వద్ద క్లోజయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి 82.30 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 62,428 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,601 వద్ద మొదలైంది. 62,379 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,719 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 118 పాయింట్ల లాభంతో 62,547 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

గురువారం 18,478 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,550 వద్ద ఓపెనైంది. 18,478 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,573 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 46 పాయింట్లు పెరిగి 18,534 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 43,997 వద్ద మొదలైంది. 43,812 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,088 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 147 పాయింట్లు ఎగిసి 43,937 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 18 నష్టాల్లో ఉన్నాయి. హీరో మోటో, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్‌, టాటా స్టీల్‌, మారుతీ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, బీపీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, టీసీఎస్‌, విప్రో షేర్లు నష్టపోయాయి. ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ మినహా అన్ని రంగాల సూచీలుపెరిగాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ సూచీలు ఎక్కువ పెరిగాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.340 పెరిగి రూ.61,100గా ఉంది. కిలో వెండి రూ.1000 పెరిగి రూ.78,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.80 పెరిగి రూ.26,620 వద్ద ఉంది.

Also Read: ప్రతి 3 నెలలకు రూ.60వేలు వడ్డీ ఇచ్చే గవర్నమెంట్‌ స్కీమ్‌ ఇది!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది

Published at : 02 Jun 2023 04:01 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Stock Market Today: కొనసాగిన నష్టాలు! 19,550 కిందకు నిఫ్టీ!

Stock Market Today: కొనసాగిన నష్టాలు! 19,550 కిందకు నిఫ్టీ!

Stock Market Today: నెగెటివ్‌ సెంటిమెంటు నింపిన ముడి చమురు! నష్టాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ!

Stock Market Today: నెగెటివ్‌ సెంటిమెంటు నింపిన ముడి చమురు! నష్టాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ!

Stock Market Today: సెన్సెక్స్‌, నిఫ్టీ రికవరీ! కొంతైన పూడిన నిన్నటి నష్టాలు

Stock Market Today: సెన్సెక్స్‌, నిఫ్టీ రికవరీ! కొంతైన పూడిన నిన్నటి నష్టాలు

Stock Market Today: కోలుకున్న స్టాక్‌ మార్కెట్లు! మధ్యాహ్నం ఏం జరుగుతుందో?

Stock Market Today: కోలుకున్న స్టాక్‌ మార్కెట్లు! మధ్యాహ్నం ఏం జరుగుతుందో?

Stock Market Today: 19,700 మీదే నిఫ్టీ ముగింపు - 173 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

Stock Market Today: 19,700 మీదే నిఫ్టీ ముగింపు - 173 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

టాప్ స్టోరీస్

Lokesh No Arrest : లోకేష్‌కు అరెస్టు ముప్పు తప్పినట్లే - అన్ని కేసుల్లో అసలేం జరిగిందంటే ?

Lokesh No Arrest :   లోకేష్‌కు అరెస్టు ముప్పు తప్పినట్లే  - అన్ని  కేసుల్లో అసలేం జరిగిందంటే ?

Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!

Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!

Chandramukhi 2: ‘చంద్రముఖి 2’కు ఆ ఓటీటీ నుంచి భారీ ఆఫర్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Chandramukhi 2: ‘చంద్రముఖి 2’కు ఆ ఓటీటీ నుంచి భారీ ఆఫర్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!