By: ABP Desam | Updated at : 02 Feb 2023 04:09 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్, ( Image Source : Pixabay )
Stock Market Closing 02 February 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఐరోపా మార్కెట్లు మొదలయ్యాక లాభాల బాట పట్టాయి. నిఫ్టీ 50 సూచీపై అదానీ కంపెనీల షేర్లు ప్రతికూల ప్రభావం చూపించాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 5 పాయింట్ల నష్టంతో 17,610 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 224 పాయింట్ల లాభంతో 59,932 వద్ద ముగిశాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు డిమాండ్ కనిపించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 25 పైసలు బలహీనపడి 82.18 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,708 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,459 వద్ద మొదలైంది. 59,215 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,007 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 224 పాయింట్ల లాభంతో 59,932 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 17,616 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,517 వద్ద ఓపెనైంది. 17,445 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,653 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 5 పాయింట్ల నష్టంతో 17,610 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ మోస్తరు లాభాల్లో ముగిసింది. ఉదయం 39,943 వద్ద మొదలైంది. 39,761 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,757 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 156 పాయింట్లు పెరిగి 40,669 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 20 కంపెనీలు లాభాల్లో 30 నష్టాల్లో ముగిశాయి. ఐటీసీ, బ్రిటానియా, ఇన్ఫీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యునీలివర్ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, యూపీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అదానీ పోర్ట్స్, ఐచర్ మోటార్స్ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, రియాల్టీ సూచీలు ఎగిశాయి. ఫైనాన్స్, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి.
Also Read: మెరుపులు మిస్సింగ్, అంచనాలు అందుకోని టైటన్
Also Read: సిద్ధంగా ఉన్నారా?, రెండు కంపెనీలు పబ్లిక్ ఆఫర్స్ ప్రకటించబోతున్నాయ్!
Also Read: బడ్జెట్ బూస్ట్ దొరికిన 30 స్టాక్స్, మార్కెట్ కళ్లన్నీ ఇప్పుడు వీటి మీదే!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
In this segment of #DosAndDonts, lets understand the need to strike off blanks in your KYC!#SochKarSamajhKarInvestKar #NSE #NSEIndia #InvestorAwareness #StockMarket #StockMarketIndia #StockExchange @ashishchauhan @psubbaraman pic.twitter.com/ppbtOUdrcV
— NSE India (@NSEIndia) February 2, 2023
In today's #StockTerms, let's look at what #Volatility is!#StockMarket #Market #Trading #NSE #ShareMarket #StockTrader #Investing #NSEIndia #InvestorEducation #StockMarketIndia #StockExchange #StockMarketEducation #Investor pic.twitter.com/12Z8jZ5KL6
— NSE India (@NSEIndia) February 1, 2023
Stock Market News: ఆఖరి రోజు అదుర్స్! రిలయన్స్ అండతో 1031 పాయింట్లతో ఢంకా మోగించిన సెన్సెక్స్
Stock Market News: రాకెట్లా దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు - సెన్సెక్స్ 550, నిఫ్టీ 160 పాయింట్లు అప్!
Stock Market News: ఈక్విటీ మార్కెట్లో ఈ జోష్ ఎక్కడిదీ! భారీగా పెరిగిన సెన్సెక్స్, నిఫ్టీ
Stock Market Opening 29 March 2023: అదానీ షేర్ల జోరు - నిఫ్టీ 80, సెన్సెక్స్ 229 పాయింట్లు అప్!
Stock Market: ఊగిసలాడిన సూచీలు - రూపాయి 18 పైసలు జంప్!
Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం
IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు
NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్