By: ABP Desam | Updated at : 23 May 2023 12:17 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pixabay )
Stock Market @12 PM, 23 May 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. వరుసగా మూడో రోజు అదానీ కంపెనీల షేర్లు యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 85 పాయింట్లు పెరిగి 18,399 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 221 పాయింట్లు పెరిగి 62,184 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,963 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,098 వద్ద మొదలైంది. 62,061 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,245 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 221 పాయింట్ల లాభంతో 62,184 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 18,314 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,362 వద్ద ఓపెనైంది. 18,349 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,413 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 85 పాయింట్లు పెరిగి 18,399 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 43,978 వద్ద మొదలైంది. 43,861 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,084 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 98 పాయింట్లు పెరిగి 43,983 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 39 కంపెనీలు లాభాల్లో 11 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, దివిస్ ల్యాబ్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, బీపీసీఎల్ షేర్లు లాభపడ్డాయి. కొటక్ బ్యాంక్, గ్రాసిమ్, ఎల్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఐటీ, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు అధికంగా లాభపడ్డాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.310 తగ్గి రూ.61,100గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.74,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.210 పెరిగి రూ.28,450 వద్ద కొనసాగుతోంది.
Also Read: ₹2000 నోట్ల ఉపసంహరణ వల్ల ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టం ఎంత?
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
In this episode of #MoneyMindedMalini understand why it is important to take informed decision before trading in derivatives!#FNO #Derivatives #StockMarket #Trading #Futures #Options #Investing #Investment #Nifty50 #banknifty #finnifty #NiftyMidCap #Nifty #EquityDerivatives… pic.twitter.com/6XX24SxT7P
— NSE India (@NSEIndia) May 22, 2023
Congratulations AURO IMPEX & CHEMICALS LIMITED on getting listed on NSE Emerge today! Public Issue was of Rs. 2706.91 lakhs at an issue price of Rs. 78 per share. #NSE #Listing #IPO #NSEIndia #StockMarket #ShareMarket #AuroImpex @ashishchauhan pic.twitter.com/RNE0KOzPrA
— NSE India (@NSEIndia) May 23, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు