By: ABP Desam | Updated at : 11 Oct 2023 12:30 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market at 12 PM, 11 October 2023:
భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో లాభపడ్డాయి. బుధవారం కళకళలాడుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 111 పాయింట్లు పెరిగి 19,801 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 389 పాయింట్లు పెరిగి 66,478 వద్ద కొనసాగుతున్నాయి. మరో రెండు సెషన్లు ఇలాగే పెరిగితే నిఫ్టీ మళ్లీ 20,000 స్థాయిని అందుకోవడం ఖాయం! ఈ పరిణామం కంపెనీల త్రైమాసిక ఫలితాల సరళిపై ఆధారపడి ఉంటుంది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 66,079 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 66,376 వద్ద మొదలైంది. 66,299 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,592 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 389 పాయింట్లు పెరిగి 66,478 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 19,689 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,767 వద్ద ఓపెనైంది. 19,756 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,839 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 111 పాయింట్లు పెరిగి 19,801 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ ఎగిసింది. ఉదయం 44,554 వద్ద మొదలైంది. 44,445 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,710 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 142 పాయింట్లు ఎగిసి 44,502 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 43 కంపెనీలు లాభాల్లో 7 నష్టాల్లో ఉన్నాయి. విప్రో, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యునీలివర్, డాక్టర్ రెడ్డీస్ లాభపడ్డాయి. ఎస్బీఐ లైఫ్, కోల్ ఇండియా, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఇన్ఫోసిస్ నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంకు సూచీ స్వల్ప నష్టాల్లో ఉంది. ఆటో, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్, ఫార్మా, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు కళకళలాడుతున్నాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరల్లో పెద్దగా మార్పులేదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.58,530 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.72,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.180 తగ్గి రూ.23,580 వద్ద ఉంది.
క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. సోమవారం నాటి నష్టాల నుంచి రికవరీ అయ్యాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధ భయాల నుంచి ఇన్వెస్టర్లు బయటపడ్డారు. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 177 పాయింట్లు పెరిగి 19,689 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 566 పాయింట్లు పెరిగి 66,079 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు బలపడి 83.27 వద్ద స్థిరపడింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Lagacharla Incident: అధికారులపై దాడి కేసులో కీలక పరిణామం, లొంగిపోయిన కీలక నిందితుడు సురేష్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?