అన్వేషించండి

e-KYC transactions: ఒక్క నెలలో 25 కోట్ల ఈ-కేవైసీ ట్రాన్జాక్షన్లా?, రేంజ్‌ పెరుగుతోంది బాస్‌!

ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి, మొత్తం 1297.93 కోట్ల ఆధార్ అనుసంధానిత ఈ-కేవైసీ ట్రాన్జాక్షన్లు జరిగినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ & ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

e-KYC transactions: దేశవ్యాప్తంగా ఆధార్‌ అనుసంధానిత ఈ-కేవైసీ లావాదేవీలు జనంలోకి చొచ్చుకుపోతున్నాయి. లాస్ట్‌-మైల్‌ ప్రజలు కూడా ఆర్థిక అవసరాలకు ఈ-కేవైసీని ఒక సాధనంగా వాడడం మొదలు పెట్టారు. ఒక్క సెప్టెంబర్‌ నెలలోనే ఆధార్ ద్వారా 25.25 కోట్ల ఈ-కేవైసీ లావాదేవీలు జరిగాయి. ఆగస్టుతో పోలిస్తే ఇవి దాదాపు 7.7% పెరిగాయి. బ్యాంకింగ్, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సేవల్లో ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ కీలక పాత్ర పోషిస్తోంది. ఇటు ప్రజల పనిని, అటు వ్యాపారాన్నీ సరళంగా మారుస్తోంది.

దాదాపు 1300 కోట్ల లావాదేవీలు
ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి, మొత్తం 1297.93 కోట్ల ఆధార్ అనుసంధానిత ఈ-కేవైసీ ట్రాన్జాక్షన్లు జరిగినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ & ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబరు చివరి నాటికి; ఏఈపీఎస్‌, మైక్రో ఏటీఎంల నెట్‌వర్క్‌ ద్వారా 1549.84 కోట్ల లాస్‌-మైల్ బ్యాంకింగ్ లావాదేవీలు జరిగాయి. ఒక్క సెప్టెంబర్‌లోనే దేశవ్యాప్తంగా 21.03 కోట్ల ఏఈపీఎస్‌ ట్రాన్జాక్షన్లు జరిగాయి.

సెప్టెంబర్‌లో, ఆధార్ ద్వారా 175.41 కోట్ల అథెంటికేషన్‌ ట్రాన్జాక్షన్లు జరిగాయి. ఈ లావాదేవీల్లో ఎక్కువ భాగం వేలిముద్రల అథెంటికేషన్‌ను ఉపయోగించి జరిగాయి. దీని తర్వాతి స్థానంలో డెమోగ్రాఫిక్, ఆ తర్వాత ఓటీపీ అథెంటికేషన్‌ లావాదేవీలు ఉన్నాయి. సెప్టెంబర్ చివరి నాటికి మొత్తం 8250.36 కోట్ల అథెంటికేషన్‌ లావాదేవీలు పూర్తయ్యాయి. ఆధార్ ఉద్దేశ్యం ఎంత వేగంగా నెరవేరుతోందో ఈ సంఖ్య సూచిస్తోంది.

93.92 శాతం జనాభాకు ఆధార్‌ కార్డ్‌లు
మన దేశంలో పెద్దవాళ్లకు ఆధార్‌ కార్డుల జారీ దాదాపుగా సంపూర్ణ స్థాయికి చేరింది. సెప్టెంబర్ చివరి నాటికి, ఆధార్ తీసుకున్న అన్ని వయసుల వారు దేశ మొత్తం జనాభాలో 93.92 శాతంగా ఉన్నారు.

1.62 కోట్ల ఆధార్‌ అప్‌డేషన్లు 
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు ఆధార్‌ కార్డుతో అనుసంధానమయ్యాయి. పారదర్శకత, సమర్థవంతంగా అమలు చేయడం కోసం.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల సంక్షేమ పథకాలను కూడా ఆధార్‌కు అనుసంధానించాలని కేంద్రం గతంలోనే సూచించింది. దీంతో, ఇప్పటివరకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సుమారు 1000 పథకాలను ఆధార్‌తో అనుసంధానించారు. వీటి నుంచి లబ్ధి పొందేందుకు ఆధార్‌ కార్డ్‌లో అడ్డంకిగా మారిన కొన్ని వివరాలను మార్చుకునేందుకు ప్రజలు ఆధార్‌ సెంటర్లకు క్యూ కడుతున్నారు. ఆధార్‌ కార్డుల్లో వివరాల్లో మార్పుచేర్పుల కోసం ఆధార్‌ కార్డ్‌హోల్డర్ల నుంచి భారీగా వినతులు ఆధార్‌ అధీకృత సంస్థ ఉడాయ్‌కి (UIDAI) అందుతున్నాయి. 

పేరులో అక్షర దోషాల మార్పు, ఫొటోల మార్పు, చిరునామాలో మార్పులు, వేలిముద్రల మార్పు వంటి అప్‌డేషన్ల కోసం వచ్చే విజ్ఞప్తులు నెలనెలా పెరుగుతూనే ఉన్నాయి. కార్డుదారుల నుంచి వచ్చిన రిక్వెస్ట్‌ల మేరకు, సెప్టెంబర్ నెలలో 1.62 కోట్లకు పైగా ఆధార్‌ కార్డ్‌ వివరాలను విజయవంతంగా అప్‌డేట్‌ చేశారు. ఆగస్టులో 1.46 కోట్ల ఆధార్‌ కార్డ్‌ వివరాల అప్‌డేషన్లు జరిగాయి. మొత్తంగా చూస్తే, సెప్టెంబర్ చివరి నాటికి 66.63 కోట్ల ఆధార్ కార్డ్‌ వివరాలను అప్‌డేషన్లు పూర్తయ్యాయి. ఫిజికల్‌ ఆధార్ సెంటర్లకు వెళ్లడం ద్వారా, లేదా ఆన్‌లైన్ ఆధార్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రజలు అప్‌డేషన్ల కోసం విజ్ఞప్తులు చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Flipkart Big Billion Days 2026: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌పై బిగ్ అప్డేట్.. అక్టోబర్ 9 నుంచి సేల్!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌పై బిగ్ అప్డేట్.. అక్టోబర్ 9 నుంచి సేల్!
UPI Charges New Rules: యూపీఐ కొత్త రూల్స్.. రూ.2 వేలు పైబడిన లావాదేవీలపై ఎండీఆర్.. చిరు వ్యాపారులు, సాధారణ కస్టమర్లకు పూర్తిగా ఫ్రీ
యూపీఐ కొత్త రూల్స్.. రూ.2 వేలు పైబడిన లావాదేవీలపై ఎండీఆర్.. చిరు వ్యాపారులు, సాధారణ కస్టమర్లకు పూర్తిగా ఫ్రీ
Tim Cook Net Worth: Apple మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంత? సంస్థలో ఇక నుంచి కొత్త ఇన్నింగ్స్
Apple మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంత? సంస్థలో ఇక నుంచి కొత్త ఇన్నింగ్స్
Credit Card Eligibility: బ్యాంక్ అకౌంట్ లేకున్నా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చా ? ఎవరికి జారీ చేస్తారు
బ్యాంక్ అకౌంట్ లేకున్నా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చా ? ఎవరికి జారీ చేస్తారు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aakasamlo Oka Tara Release Date : దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
Eshwar Sai Madhuri Rathod : ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
Russia Sanctions Bill: భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
Ganesha Visarjan Date time 2026: గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 24 or 25? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
గణేష్ నిమజ్జనం 2026: సెప్టెంబర్ 24, 25లో ఏది సరైన తేదీ? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Narendra Modi birthday 2026: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
AP local body elections 2026: స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
Supriya Yarlagadda: సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
Embed widget