అన్వేషించండి

Blue Grey Collar Jobs: ఉద్యోగం కావాలా! ఈ జాబ్‌ ప్రొఫైల్స్‌కు హైరింగ్‌ ఓ రేంజ్‌లో ఉండబోతోంది!

Blue Grey Collar Jobs: ఆర్థిక మాంద్యం దెబ్బకు పశ్చిమ దేశాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఊడుతున్నాయి. భారత్‌లో మాత్రం బ్లూ కాలర్‌, గ్రే కాలర్‌ ఉద్యోగులకు డిమాండ్‌ పెరుగుతోంది.

Blue Grey Collar Jobs:

ఆర్థిక మాంద్యం దెబ్బకు పశ్చిమ దేశాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఊడుతున్నాయి. భారత్‌లో మాత్రం బ్లూ కాలర్‌, గ్రే కాలర్‌ ఉద్యోగులకు డిమాండ్‌ పెరుగుతోంది. 2022లో కంపెనీలు వీరిని నాలుగు రెట్లు ఎక్కువగా నియమించుకున్నాయి. భారీ స్థాయిలో డిజిటైజేషన్‌, ఆటోమేషన్‌, సరికొత్త పని సంస్కృతుల ఆవిర్భావమే ఇందుకు కారణాలని ఉద్యోగ నియామకాల కంపెనీ బిలియన్‌ కెరీర్స్‌ (క్వెస్‌ కార్ప్‌) తెలిపింది. 2023లోనూ వీరికి ఎక్కువ డిమాండ్‌ ఉందని వెల్లడించింది.

వేర్వేరు రంగాల్లో బ్లూ, గ్రే కాలర్‌ వ్యాపారాల్లో ఉద్యోగ ఖాళీలు 301 శాతానికి పెరిగాయని బిలియన్‌ కెరీర్స్‌ పేర్కొంది. 2021లో వీరి సంఖ్య 26,26,637గా ఉండగా 2022లో 1,05,42,820కి పెరిగిందని వెల్లడించింది. పైగా ఈ రంగాల్లో ఉద్యోగాలు కోరుతున్నవారి సంఖ్య అదనంగా 236 శాతానికి చేరుకుంది. ఉత్పత్తి, సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు ప్రత్యేక నైపుణ్యాలున్న ఉద్యోగులను భారీ స్థాయిలో నియమించుకొనేందుకు కంపెనీలు సిద్ధమవ్వడాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. కరోనా మహమ్మారి వచ్చాక పరిశ్రమల్లో డిజిటలీకరణ పెరిగింది. వీటిపై అవగాహన, నైపుణ్యాలు, విశ్లేషణ సామర్థ్యాలు ఉన్న వారి కోసం కంపెనీలు ఎదురు చూస్తున్నాయి.

దిల్లీ (11.57%), బెంగళూరు (11.55%) వంటి మెట్రో నగరాల్లో బ్లూ, గ్రే కాలర్‌ ఉద్యోగులకు అత్యధిక డిమాండ్‌ ఉన్నట్టు బిలియన్‌ కెరీర్స్‌ తెలిపింది. ముంబయి (10.21%), హైదరాబాద్‌ (7.78%), పుణె (5.8%) నగరాల్లో హైరింగ్‌ పెరుగుతోందని వివరించింది. 'గతేడాది జాబ్‌ మార్కెట్లో భిన్నమైన ట్రెండ్స్‌ కనిపించాయి. గ్రేట్‌ రెసిగ్నేషన్‌ నుంచి కొత్త పని సంస్కృతుల ఆవిర్భావం వంటివి చూశాం. దాంతో బ్లూ, గ్రే కాలర్‌ ఉద్యోగులు సహా అన్ని విభాగాల్లో ప్రత్యేక దృష్టితో నియమకాలు జరుగుతున్నాయి' అని బిలియన్‌ కెరీర్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజయ్‌ కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు. భారత్‌లో డిజిటైజేషన్‌ పెరగడంతో సాంకేతిక సామర్థ్యాలున్న ఉద్యోగుల ఎంపికకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయని వెల్లడించారు.

బిలియన్‌ కెరీర్స్‌ 2021 నవంబర్‌ గణాంకాలను 2022 నవంబర్‌తో పోల్చింది. బీపీవో/బయ్యర్‌ కేర్‌ (21%), డిసిప్లిన్‌ గ్రాస్‌ సేల్స్‌ (7%), ఎంటర్‌ప్రైజ్‌ గ్రోత్‌ రోల్స్‌ (19%), అడ్మిన్‌, హ్యూమన్‌ అసెట్స్‌ (31%), సేఫ్టీ గార్డ్‌ (110%) రంగాల్లో జాబ్‌ ప్రొఫైల్స్‌ పెరిగాయి. కొన్ని విభాగాల్లో మాత్రం డిమాండ్‌ తగ్గింది. బ్లూ, గ్రే కాలర్‌ ఉద్యోగాల్లో సున్నా నుంచి మూడేళ్లలోపు అనుభవం ఉన్న ప్రెషర్స్‌ను 60 శాతం తీసుకున్నారు. మెషీన్‌ స్టడీయింగ్‌, రొబోటిక్స్‌, త్రీడీ ప్రింటింగ్‌, సింథెటిక్‌ ఇంటెలిజెన్స్‌, ఐటీ, హెల్త్‌కేర్‌, టెలికాం, బయ్యర్‌ కేర్‌ ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. వీరికి రూ.25,000 వరకు వేతనాలు ఇస్తున్నారు.

సోషల్ మీడియాలో ఏబీపీ దేశం ఫాలో అవ్వండి!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Desam (@abpdesam)

టాప్ హెడ్ లైన్స్

Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 

వీడియోలు

KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget