By: ABP Desam | Updated at : 20 May 2022 05:53 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఈముద్రా
eMudhra IPO: డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్స్ ప్రొవైడర్ ఈ-ముద్రా ఐపీవోకు మంచి స్పందనే వస్తోంది. శుక్రవారం నుంచి రిటైల్ ఇన్వెస్టర్లున ఐపీవోకు సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. మే 24 వరకు ఇష్యూ ఓపెన్‌లో ఉంటుంది. తొలిరోజే 47 శాతం సబ్‌స్క్రైబ్ కావడం గమనార్హం.
మొత్తంగా రూ.412 కోట్ల విలువతో ఈ-మద్రా ఇష్యూకు వస్తోంది. ప్రెష్ ఇష్యూ సైజ్‌ను రూ.200 కోట్ల నుంచి రూ.161 కోట్లకు తగ్గించింది. ప్రి ఐపీవో ప్లేస్‌మెంట్ కింద రూ.39 కోట్ల విలువైన 16,03,617 షేర్లను అలాట్ చేస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ కింద 98.35 లక్షల షేర్లు అమ్ముతున్నారు.
ఈ ఇష్యూ ద్వారా సేకరిస్తున్న డబ్బును అప్పులు తీర్చేందుకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, యంత్రాలు, భారత్, విదేశాల్లో ఏర్పాటు చేసిన డేటా సెంటర్ల ఖర్చులకు వినియోగించనున్నారు. ధరల శ్రేణిని రూ.243-256గా నిర్ణయించింది.
ఈ-ముద్రా ఇష్యూ తొలిరోజు 47 శాతం సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. రిటైల్ కోటాలో 91 శాతం షేర్లు బుక్ అయ్యాయి. మొత్తం 1.13 కోట్ల యూనిట్లలో తొలిరోజు 53.27 లక్షలకు దరఖాస్తులు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్లు 52.23 లక్షల షేర్లకు దరఖాస్తు చేశారు. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 4 శాతం చేయగా క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్లు ఇంకా స్పందించలేదు.
డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు జారీ చేయడంలో ఈ-ముద్రా కంపెనీకి మంచి అనుభవం ఉంది. ఈ రంగంలో మైక్రోసాప్ట్, మొజిల్లా, యాపిల్, అడోబ్ వంటి కంపెనీలు గుర్తించిన ఏకైక భారత కంపెనీ ఇదే. దేశ వ్యాప్తంగా 88,457 ఛానెల్ పాట్నర్స్ ఉన్నారు. 2021, సెప్టెంబర్ 30 నాటికి 36,233 రిటైల్ కస్టమర్లు, 563 ఎంటర్‌ప్రైజెస్‌కు సేవలు అందించింది.
2020-21లో ఆర్థిక ఏడాదిలో ఈ-ముద్రా 25.36 కోట్ల లాభం నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే సమయంలో ఇది రూ.18.41 కోట్లే కావడం గమనార్హం. గతేడాది రూ.116.8 కోట్లుగా ఉన్న రాబడి ఇప్పుడు రూ.132.45 కోట్లకు పెరిగింది.
యాంకర్ బుక్‌లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్, ఎస్‌బీఐ ఎంఎఫ్, బారింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఇండియా, హార్న్‌బిల్ ఆర్చిడ్ ఇండియా ఫండ్, పైన్ బ్రిడ్జ్ ఇండియా ఈక్విటీ ఫండ్, అబాకస్ గ్రోత్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, యెస్ సెక్యూరిటీస్, ఇండోరీయెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి. ఈ ఇష్యూకు లింక్ ఇన్‌టైమ్ ఇండియా రిజిస్ట్రార్.
బ్రోకరేజ్ సంస్థలు ఈ-ముద్రా ఇష్యూకు మిశ్రమంగా స్పందించాయి. డిజిటల్ సెగ్మెంట్‌లో ఈ కంపెనీ అగ్రస్థానంలో ఉందని చాలా సంస్థలు అంటున్నాయి. ఏంజిల్ వన్ న్యూట్రల్ రేటింగ్ ఇచ్చింది. ఛాయిస్ బ్రోకింగ్, మార్వాడి ఫైనాన్షియల్ సర్వీసెస్ అప్రమత్తంగా ఉంటూ సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చని సూచించాయి. రిలయన్స్ సెక్యూరిటీస్ రేటింగ్ ఇవ్వలేదు.
ఈవారం IPOకు వస్తున్న 11 కంపెనీలు, నిధుల సమీకరణే లక్ష్యంగా పోటీ
Mega IPO: ఫస్ట్ లిస్టింగ్‌లో దూసుకెళ్లిన హెచ్‌డీబీ ఫైనాన్షియల్ షేర్ - కొనసాగుతుందా? ఇతర వాటిలా పడిపోతుందా?
Nuvvunte Na Jathaga Serial july 1st: నువ్వుంటే నా జతగా సీరియల్: ఆనంద్ సీక్రెట్ లీక్.. దేవా ప్రేమ పసిగట్టేసిన మిథున.. బేబీ దగ్గరకు ప్రేమ జంట!
Most Awaited IPO: ఈ IPO కోసం 9 ఏళ్లుగా ఎదురుచూపులు - అతి త్వరలో సెబీ అనుమతి!
Upcoming IPO: మార్కెట్‌లోకి రానున్న రూ.15000 కోట్ల IPO, డబ్బులతో రెడీగా ఉండండి
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!