అన్వేషించండి

Foxconn Bengalore : బెంగళూరులో స్థలం కొన్న ఫాక్స్ కాన్ - ఐ ఫోన్ల తయారీ అక్కడేనా ? హైదరాబాద్ సంగతేంటి ?

ఐ ఫోన్ తయారీ దారు ఫాక్స్ కాన్ బెంగళూరులో స్థలం కొనుగోలు చేసింది. మరి హైదరాబాద్ లో పెట్టుబడులపై వెనక్కి తగ్గినట్లేనా ?

Foxconn Bengalore :  తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్‌ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ (Foxconn) బెంగళూరు శివారులో 300 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది.  ఈ విషయాన్ని   లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కు తెలియజేసింది.  యాపిల్‌ ఐఫోన్ల అసెంబ్లింగ్‌ను చేపడుతున్న ప్రధాన కంపెనీల్లో ఫాక్స్‌కాన్‌ ఒకటి. ఈ సంస్థ ప్లాంట్ ను ఇండియాలో పెట్టాలని అనుకుంది. యాపిల్ కూడా మేడిన్ ఇండియా యాపిల్ ఫోన్లను భారీగా తీసుకు రావాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఫాక్స్ కాన్ అనేక రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపింది. చివరికి కర్ణాటకలో 300 ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా ప్రకటించింది.  దీని కోసం అనుబంధ సంస్థ 'ఫాక్స్‌కాన్‌ హాన్‌ హాయ్‌ టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్‌మెంట్‌' దాదాపు రూ.300 కోట్లు చెల్లించినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.  

కర్ణాటకలోనే ఐ ఫోన్లు తయారవుతాయన్న  సీఎం బొమ్మై

కర్ణాటకలో  యాపిల్‌ తమ ఐఫోన్లను తయారు చేయనుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మార్చిలో ప్రకటించారు. దాదాపు లక్ష మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. అయితే ఫాక్స్ కాన్ చైర్మన్  తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనూ సమావేశమయ్యారు. మార్చి రెండో తేదీన  ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో ఆ సంస్థ చైర్మ‌న్ యంగ్ లియూ భేటీ అయ్యారు. పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. లక్ష మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.  ఆ తర్వాత ఏప్రిల్ 24వ తేదీన కొంగర కలాన్ వద్ద 250 ఎకరాలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది.  

హైదరాబాద్‌లో కొంగరకలాన్ వద్ద ల్యాండ్ కొంటామన్న ఫాక్స్ కాన్

తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిఎస్‌ఐఐసి) పార్క్‌లో సుమారు 186 ఎకరాలను రూ.196 కోట్లకు కొనుగోలు చేయాలని అనుకున్నట్లుగా ఫాక్స్ కాన్ ప్రకటించింది.  కానీ ఆ కొనుగోలు ప్రక్రియపై ఎలాంటి అడుగు ముందుకు పడలేదు.  హైదరాబాద్‌లో స్థలం కొనుగోలు చేయాలనుకున్న   ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ లిమిటెడ్   పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ చాంగ్ యి ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్  . కానీ ఇంకా ఎలాంటి భూ లావాదేవీలు చేయలేదని తెలుస్తోంది. 

ఇప్పుడు హైదరాబాద్‌లో ప్లాంట్ ఉన్నట్లా ? లేనట్లా ? 

హఠాత్తుగా కర్ణాటకలో  బెంగళూరు ఎయిర్ పోర్టుకు సమీపంలో దేవనహళ్లి దగ్గర మూడు వంద ఎకరాలు అనుబంధ సంస్థ ద్వారా కొనగోలు చేసినట్లుగా లండన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు  ఫాక్స్ కాన్ తెలిపింది.  బెంగళూరులో ల్యాండ్ కొనుగోలు చేసిన అనుబంధ కంపెనీ పేరు ఫాక్స్ కాన్ హాన్ హాయ్ టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్‌మెంట్ కంపెనీ ఈ స్థలం కొనుగోలు చేసింది. హైదరాబాద్‌లో ల్యాండ్ కొనాలనుకున్న ఫాక్స్ కాన్ అనుబంధ సంస్థ, బెంగళూరులో ల్యాండ్ కొన్న అనుబంధ సంస్థ రెండూ వేర్వేరు. అయితే హైదరాబాద్‌లో ల్యాండ్ తీసుకుంటారా లేదా.. ప్లాంట్ పెడతారా లేదా అన్నది కంపెనీనే ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికి బెంగళూరులో  ఫాక్స్ కాన్ ల్యాండ్ కొన్నట్లు స్పష్టం కావడంతో.. అక్కడే యాపిల్ తయారీ యూనిట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Post Office RD Scheme: మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ
మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget