అన్వేషించండి

FASTag కార్డు ఒకటే, ప్రయోజనాలే అనేకం; చలాన్ల నుంచి పార్కింగ్ వరకు చాలా పనులు చేయవచ్చు తెలుసా!

FASTag అప్‌గ్రేడ్ అవుతోంది. త్వరలో టోల్ చెల్లింపులకే పరిమితం కాకుండా అనేక సేవలు ఇందులో చేర్చనున్నారు.

FASTag has Multiple Uses. FASTag సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద టోల్ టాక్స్ చెల్లించడానికి ఉపయోగిస్తూ వస్తున్నాం. అయితే, ఇప్పుడు పార్కింగ్ ఫీజులు చెల్లించడానికి, ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేయాడానికి, బీమా ప్రీమియంలు, EV ఛార్జింగ్ కోసం కూడా ఉపయోగించవచ్చు.  వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, బ్యాంకుల ద్వారా జారీ చేసిన దాదాపు 11 కోట్ల FASTagలను అప్‌గ్రేడ్ చేయనున్నారు. FASTagను మరింత సౌకర్యవంతంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. తద్వారా FASTagను వేర్వేరు పనులకు కూడా ఉపయోగించుకునేలా ఆధునీకరించబోతున్నారు. దీని వల్ల వివిధ కార్డులు క్యారీ చేయడం తప్పుతుంది. పెండింగ్‌ పనులు లేకుండా ఉంటాయని భావిస్తున్నారు.  

రవాణా, మొబిలిటీ సేవలను నిర్వహించడం సులభం 
FASTag ఈ అప్‌గ్రేడేషన్‌పై బుధవారం ఓవర్క్‌షాప్ జరిగింది.రోడ్డు రవాణా,  రహదారుల మంత్రిత్వ శాఖ, NHAI, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఫిన్‌టెక్ సంస్థల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.  
ఈ వర్క్‌షాప్ లక్ష్యం FASTag వినియోగానికి సంబంధించి కొత్త ఆలోచనలు పంచుకోవడం, ఫిన్‌టెక్ సంస్థల నుంచి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం. ఈ సమయంలో, టోల్ ప్లాజాల కాకుండా FASTagను ఎక్కడ, ఏ పనిలో ఉపయోగించవచ్చనే దానిపై లోతైన చర్చ జరిగింది. 

రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ FASTag అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఫిన్‌టెక్, ఇతర వాటాదారుల సహకారంతో FASTag వినియోగాన్ని మరింత విస్తృతపరుస్తున్నట్టు వెల్లడించారు. యూజర్స్‌కు మరిన్న సేవలు అందించి రవాణా, మొబిలిటీ సేవలను మరింత ఈజీగా నిర్వహించేలా చేస్తామని పేర్కొన్నారు. అన్నింటికీ ఒక బలమైన వేదికగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. 

 ముఖ్యమైన అంశంపై చర్చ  
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, సమావేశంలో 'మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో' (MLFF) టోలింగ్ సిస్టమ్‌పై కూడా చర్చ జరిగింది. ఇది టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఆగకుండానే టోల్ టాక్స్ చెల్లించే ఒక వ్యవస్థ. ఇది టోల్ వసూలును మెరుగుపరచడంతోపాటు టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

టూ వీలర్‌లకు నో టోల్‌
టూ వీలర్లకు టోల్ ఛార్జ్ వసూలు చేస్తారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఎక్కడైనా టూవీలర్లకు ఎలాంటి టోల్‌ ఫీజు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఇలాంటి తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకుంటామని కామెంట్ చేసింది.

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget