అన్వేషించండి

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త ఫెసిలిటీ, 'పే లేటర్‌'ను EMIల్లోకి మార్చుకోవచ్చు

ICICI బ్యాంక్ తీసుకొచ్చిన సదుపాయం కోసం లావాదేవీ మొత్తం రూ. 10,000 కంటే తగ్గకూడదు.

EMI on UPI Payments: ICICI బ్యాంక్ కస్టమర్లకు ఇది శుభవార్త. ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదార్లు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా చేసే 'పే లేటర్‌' చెల్లింపులకు ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ (EMI) సౌకర్యం పొందవచ్చని బ్యాంక్‌ ప్రకటించింది. ICICI బ్యాంక్‌ "బయ్‌ నౌ - పే లేటర్‌" (BNPL) ద్వారా చేసే UPI చెల్లింపులను ఇకపై నెలవారీ వాయిదాల్లోకి మార్చుకోవచ్చు. ఇప్పటివరకు ఉన్న పద్ధతి ప్రకారం, "బయ్‌ నౌ - పే లేటర్‌" మార్గంలో ఏదైనా వస్తువు కొన్నప్పుడు, ఆ మొత్తాన్ని తిరిగి ఏకమొత్తంగా బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంటుంది. దీనినే నెలవారీ వాయిదాల పద్ధతిలోకి మార్చుకునే సౌకర్యాన్ని ఐసీఐసీఐ బ్యాంకు తీసుకొచ్చింది.

కొత్త ఫెసిలిటీ ఎవరి కోసం?
‘బయ్‌ నౌ - పే లేటర్‌’ వినియోగదార్లకు ఇది వర్తిస్తుంది. ICICI బ్యాంక్ కస్టమర్‌ ఏదైనా స్టోర్‌కు వెళ్లి, QR కోడ్‌ని స్కాన్ చేసి "బయ్‌ నౌ - పే లేటర్‌"తో UPI ద్వారా చెల్లింపులు చేసినప్పుడు, ఆ మొత్తాన్ని సులభమైన వాయిదాల్లోకి మార్చుకోవచ్చు.
దుస్తులు, ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌, కిరాణా సామగ్రి వంటివి కొనుగోలు చేసిన బిల్లులు లేదా హోటల్‌ బుకింగ్స్‌, ప్రయాణాల కోసం బుకింగ్‌ వంటి మొత్తాలను ఐసీఐసీఐ ‘బయ్‌ నౌ - పే లేటర్‌’ ద్వారా చెల్లిస్తే, ఆ మొత్తాన్ని EMIల్లోకి మార్చుకునే సదుపాయం కనిపిస్తుంది. QR కోడ్‌ స్కాన్‌ చేసి, UPI ద్వారా చెల్లించినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది.

ICICI బ్యాంక్ తీసుకొచ్చిన సదుపాయం కోసం లావాదేవీ మొత్తం రూ. 10,000 కంటే తగ్గకూడదు. అంటే, రూ. 10,000 దాటిన బిల్లులను QR కోడ్‌ స్కాన్‌ చేసి, పే లేటర్‌ను ఉపయోగించి UPI ద్వారా చెల్లిస్తే, దానిని EMIగా మార్చవచ్చు. మీ అవసరానికి అనుగుణంగా.. ఆ మొత్తాన్ని 3, 6, 9 నెలల వాయిదా ఆప్షన్స్‌లో ఒకదానిని ఎంచుకోవచ్చు. చాలామంది వినియోగదార్లు 'పే లేటర్‌'ను ఉపయోగించి, యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారని, వాళ్ల ప్రయోజనం కోసం ఉండేలా ఈఎంఐ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ డిజిటల్‌ ఛానెల్‌ హెడ్‌ బిజిత్‌ భాస్కర్‌ వెల్లడించారు.

త్వరలో ఆన్‌లైన్ షాపింగ్‌లోనూ పే లేటర్‌ EMIs
ప్రస్తుతం.. పే లేటర్‌ UPI చెల్లింపుల్లో ఆన్‌లైన్ పేమెంట్స్‌కు EMI సౌకర్యం అందుబాటులో లేదు. ఆన్‌లైన్ షాపింగ్‌కు కూడా ఈ సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని బిజిత్‌ భాస్కర్‌ చెప్పారు. 

ICICI పే లేటర్‌ ద్వారా UPI చెల్లింపులను EMIల్లోకి ఎలా మార్చుకోవాలి?
ఉదాహరణకు, మీరు ICICI బ్యాంక్ కస్టమర్ అయితే, మీరు షాపింగ్ దుకాణానికి వెళ్లి కిరాణా సామాగ్రిని కొనుగోలు చేశారని అనుకుందాం. బిల్లు మొత్తం రూ.10,000 కంటే ఎక్కువయితే, iMobile Pay యాప్‌ ఓపెన్‌ చేయండి. QR కోడ్‌ స్కాన్‌ చేసి, పే లేటర్ EMI ఆప్షన్‌ ఎంచుకోండి. ఇందులో... 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు ఆప్షన్లు కనిపిస్తాయి. మీ ఇష్టప్రకారం ఒక ఆప్షన్‌ ఎంచుకుని పే చేయండి. దీంతో ఆ లావాదేవీ పూర్తవుతుంది, ఆ మొత్తం EMIల్లోకి మారుతుంది.

ICICI బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, చెల్లించాల్సిన EMI మొత్తం మీ ICICI బ్యాంక్ సేవింగ్స్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా కట్‌ అవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Personal Loan: ప్లాన్ చేసిన, అత్యవసర ఖర్చుల నిర్వహణలో మీకు పర్సనల్ లోన్ ఎలా సహాయపడుతుంది
ప్లాన్ చేసిన, అత్యవసర ఖర్చుల నిర్వహణలో మీకు పర్సనల్ లోన్ ఎలా సహాయపడుతుంది
1.39 కోట్ల బిడ్లు, ఏకంగా రూ. 7.4 లక్షల కోట్ల డిమాండ్‌తో Jio Platforms IPO సరికొత్త రికార్డ్
1.39 కోట్ల బిడ్లు, ఏకంగా రూ. 7.4 లక్షల కోట్ల డిమాండ్‌తో Jio Platforms IPO సరికొత్త రికార్డ్
Jio Platforms IPO: చరిత్ర సృష్టించిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ.. కోటి పైగా సబ్‌స్క్రిప్షన్లతో వరల్డ్ రికార్డు
చరిత్ర సృష్టించిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ.. కోటి పైగా సబ్‌స్క్రిప్షన్లతో వరల్డ్ రికార్డు
Jio IPO Subscribed 3.47 Times: జియో ఐపీఓ ప్రభంజనం - రెండో రోజే 3.47 రెట్ల సబ్‌స్క్రిప్షన్ - రూ. 3.5 లక్షల కోట్లు
జియో ఐపీఓ ప్రభంజనం - రెండో రోజే 3.47 రెట్ల సబ్‌స్క్రిప్షన్ - రూ. 3.5 లక్షల కోట్లు

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
El Nino Impact: విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
Ban on non-BS6 vehicles: కాలుష్యంపై కఠిన చర్యలు.. నాన్‌-BS6 వెహికల్స్‌కు నో ఎంట్రీ, PUC లేకుంటే పెట్రోల్‌ కూడా దొరకదు!
మీ వెహికల్‌ BS6 కాదా? అయితే, నవంబర్‌ 1 నుంచి సిటీలోకి 'నో ఎంట్రీ'!
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
Bihar Politics: జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Viral Video: నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
Two Wheeler Technology: ఇప్పుడు టూవీలర్లలోనూ లగ్జరీ కార్లకు పోటీగా స్మార్ట్‌ ఫీచర్లు.. ఇలాంటివి ఉన్నట్లు మీకు తెలుసా?
కార్లలోనే కాదు.. టూవీలర్లలోనూ అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు! మీ బండిలో ఇవి ఉన్నాయా?
Crime Thriller OTT : నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
Embed widget