అన్వేషించండి

IDFC First Bank Case: రూ. 504 కోట్ల ప్రభుత్వ ధనం స్వాహా.. CBI తొలి ఛార్జిషీటు దాఖలు, 15 మంది పేర్లు ప్రస్తావన

రూ.504 కోట్ల ప్రభుత్వ ధనం కొల్లగొట్టిన కేసులో నిందితులపై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, సాక్ష్యాలను తుడిచిపెట్టడం, అవినీతి నిరోధక చట్టం 1988 కింద నిబంధనలను ఉల్లంఘించినట్లు సీబీఐ (CBI) తెలిపింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హర్యానా ప్రభుత్వ రూ. 504 కోట్ల నిధుల దుర్వినియోగంపై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు.
  • బ్యాంక్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, నకిలీ కంపెనీల భాగస్వాములు నిందితులుగా ఉన్నారు.
  • నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదయ్యాయి.
  • ప్రభుత్వ శాఖల నిధులను నకిలీ కంపెనీల ఖాతాల్లోకి మళ్లించినట్లు సీబీఐ పేర్కొంది.

CBI Submit Chargesheet IDFC Fraud Case: చండీగఢ్: హర్యానా ప్రభుత్వానికి చెందిన రూ. 504 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణల కేసులో సీబీఐ (CBI) పంచకులలోని ప్రత్యేక సిబిఐ కోర్టులో తొలి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ నిధుల దుర్వినియోగంలో బ్యాంక్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్యలు భాగస్వాములుగా ఉన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 15 మంది నిందితులపై ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో హర్యానా ప్రభుత్వ ఉద్యోగులు, షెల్ కంపెనీలు, సామాన్యులు ఉన్నారని సీబీఐ తమ ఛార్జిషీటులో పేర్కొంది. నిందితులపై నేరపూరిత కుట్ర, నేరపూరిత నమ్మకద్రోహం, చీటింగ్, సంతకాలు ఫోర్జరీ, సాక్ష్యాలను తారుమారు చేయడం, అవినీతి నిరోధక చట్టం 1988 కింద నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చినట్లు సీబీఐ తెలిపింది. 

 ఛార్జ్‌షీట్ ఎవరిపై దాఖలైంది?
ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు అయిన వారిలో ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank), ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU Small Finance Bank) లకు చెందిన ఆరుగురు బ్యాంక్ అధికారులు, హర్యానా పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, వికాస్ అండ్ పంచాయతీ డిపార్ట్‌మెంట్, హర్యానా స్కూల్ శిక్షా పరియోజన పరిషత్‌లకు చెందిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు నిందితులుగా ఉన్నారు. దర్యాప్తు సంస్థ సీబీఐ ఈ ఛార్జ్‌షీట్‌లో రెండు నకిలీ కంపెనీలు, వాటికి చెందిన ముగ్గురు భాగస్వాములు లేక డైరెక్టర్లు, ఒక సామాన్యుడి పేరును కూడా చేర్చింది.

Also Read: RBI Loan Recovery Guidelines 2026: అప్పు ఇచ్చారని అడ్డగోలుగా వసూలుకు ప్రయత్నిస్తే నేరమే - ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవిగో

జుడీషియల్ కస్టడీలో నిందితులు
మరోవైపు, నిందితులందరూ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్లు సిబిఐ ఆ ప్రకటనలో తెలిపింది. దర్యాప్తు చేస్తున్న అధికారుల ప్రకారం, ఈ కేసు హర్యానా ప్రభుత్వానికి చెందిన పలు శాఖల బ్యాంక్ ఖాతాల నుండి రూ. 504 కోట్ల నిధులను కొల్లగొట్టారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో బ్యాంక్ అధికారులు నేరపూరిత కుట్ర ద్వారా ఈ నిధులను వేరే చోట్లకు మళ్లించారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. హర్యానా రాష్ట్ర విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేయడంతో ఈ కేసు మొదలైంది. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించారు. కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న 15 మంది నిందితులపై ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న విచారణ పూర్తయిందని సిబిఐ తెలిపింది. అలాగే ఇతర నిందితులపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. 

నేరం ఎలా జరిగింది? 
హర్యాణ ప్రభుత్వ శాఖల్లో కీలక పదవుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంక్ అధికారులతో చేతులు కలిపారు. ప్రభుత్వ విభాగాల అధికారిక బ్యాంక్ ఖాతాల్లో ఉండాల్సిన రూ. 504 కోట్ల నిధులను, నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ అధికారుల సహాయంతో నకిలీ కంపెనీల ఖాతాల్లోకి మళ్లించారు. ఈ నిధులను విత్‌డ్రా చేయడానికి లేదా వైట్ మనీగా మార్చడానికి కొన్ని షెల్ (నకిలీ) కంపెనీలను ఉపయోగించారు.

Also Read: Post Office FD:రెండు లక్షలకు 47వేల రూపాయల వడ్డీ! పోస్టాఫీస్‌లోని ఈ పథకం గురించి తెలుసా?

Frequently Asked Questions

హర్యానా ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో సీబీఐ ఏం చేసింది?

హర్యానా ప్రభుత్వానికి చెందిన రూ. 504 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారనే కేసులో సీబీఐ పంచకులలోని ప్రత్యేక కోర్టులో తొలి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో 15 మంది నిందితులు ఉన్నారు.

ఈ నిధుల దుర్వినియోగంలో ఎవరు భాగస్వాములుగా ఉన్నారు?

ఈ కేసులో బ్యాంక్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, రెండు నకిలీ కంపెనీలు, వాటి భాగస్వాములు, ఒక సామాన్యుడు భాగస్వాములుగా ఉన్నారు. వీరందరినీ సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చేర్చింది.

నిందితులపై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి?

నిందితులపై నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం, చీటింగ్, సంతకాలు ఫోర్జరీ, సాక్ష్యాలను తారుమారు చేయడం, అవినీతి నిరోధక చట్టం కింద నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

నేరం ఎలా జరిగింది?

ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంక్ అధికారులు చేతులు కలిపి, ప్రభుత్వ ఖాతాల్లో ఉండాల్సిన నిధులను నకిలీ కంపెనీల ఖాతాల్లోకి మళ్లించారు. ఈ నిధులను వైట్ మనీగా మార్చడానికి నకిలీ కంపెనీలను ఉపయోగించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
October Rule Changes: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
Bank Employees Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
Mobile Prepaid 30 Days: మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
Weight Loss Journey : 100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
Embed widget