అన్వేషించండి

Post Office FD:రెండు లక్షలకు 47వేల రూపాయల వడ్డీ! పోస్టాఫీస్‌లోని ఈ పథకం గురించి తెలుసా?

Post Office Time Deposit Scheme:పోస్టాఫీసులో మీరు 2 లక్షల రూపాయలు ఎఫ్‌డీ చేస్తే మీకు మూడేళ్లలో 47 వేల రూపాయల వడ్డీ లభిస్తుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ పథకం ద్వారా పొదుపును ప్రోత్సహిస్తున్నారు.
  • మూడేళ్లపాటు రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే రూ. 47,015 వడ్డీ వస్తుంది.
  • టైమ్ డిపాజిట్లలో పెట్టుబడికి 6.9% నుండి 7.5% వరకు వడ్డీ లభిస్తుంది.
  • సీనియర్ సిటిజన్లకు ఈ పథకంలో ప్రత్యేక వడ్డీ రేటు లేదు.

Post Office Time Deposit Scheme: భారత్‌లో పోస్టాఫీసు అంటే కేవలం సమాచార చేరవేసే సంస్థగానే కాకుండా ప్రజలకు పొదుపును అలవాటు చేసే వ్యవస్థ కూడా మారింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఊరిలో ఉంటుందనే భరోసా, కళ్ల ముందే కనిపించే ఉద్యోగులు, ఎప్పుడైనా వెళ్లే వెసులుబాటు ఉన్నందున గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పోస్టాఫీస్‌ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న భారతీయ పోస్టాఫీసు ప్రజలకు ఉపయోగకరమైన సులభమైన పొదుపు పథకాలను అందిస్తోంది. ఇప్పుడు చెప్పే పొదుపు పథకం కూడా అలాంటిదే . ఇందులో మీరు రెండు లక్షల రూపాయలను మూడేళ్లపాటు ఫిక్స్డ్‌ డిపాజిట్ చేస్తే మీకు వడ్డీ రూపంలో భారీ ప్రయోజనం కలగనుంది. 

ఈ టైం డిపాజిట్ స్కీమ్‌లో పెట్టిన పెట్టుబడికి మంచి లాభం వస్తుంది. ఇలా చేయడం వల్ల మీకు వడ్డీ, అసలు వస్తుందా రాదా అనే టెన్షన్ ఉండదు. బ్యాంకుల్లో ఇలాంటి ఎఫ్‌డీ చేయాలి అంటే చాలా ప్రక్రియను పూర్తి చేయాలి. అక్కడ కూడా చాలా సంవత్సరాలు ఫిక్స్డ్‌ చేస్తే తప్ప ప్రయోజనం ఉండదు. పోస్టాఫీస్‌లో అయితే మీరు నాలుగు విధాలుగా ఫిక్స్డ్‌ చేయవచ్చు. ఒక సంవత్సరం, రెండేళ్లు, మూడేళ్లు లేదా ఐదేళ్ల టెన్యూర్ చూసుకొని పెట్టుబడి పెట్టుకోవచ్చు. 

తక్కువ రిస్క్‌ కారణంగా మంచి వడ్డీ వస్తున్నందున చాలా మంది ప్రజలు ఈ ఫిక్స్డ్‌ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ స్కీమ్‌లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. అప్పుడే మీరు ఎన్ని సంవత్సరాలకు పెట్టుబడి పెట్టాలనే విషయంపై క్లారిటీ వస్తుంది. 

  • టీడీ(టైమ్‌ డిపాజిట్‌) స్కీమ్‌లో ఒక సంవత్సరం మీరు డబ్బులు డిపాజిట్ చేస్తే మీరు 6.9శాతం వడ్డీని పొందుతారు. 
  • టీడీ(టైమ్‌ డిపాజిట్‌) స్కీమ్‌లో రెండేళ్లకు మీరు డబ్బులు డిపాజిట్ చేస్తే మీరు 7 శాతం వడ్డీని పొందుతారు. 
  • టీడీ(టైమ్‌ డిపాజిట్‌) స్కీమ్‌లో మూడేళ్లకు మీరు డబ్బులు డిపాజిట్ చేస్తే మీరు 7.1 శాతం వడ్డీని పొందుతారు. 
  • టీడీ(టైమ్‌ డిపాజిట్‌) స్కీమ్‌లో ఐదేళ్లకు  మీరు డబ్బులు డిపాజిట్ చేస్తే మీరు 7.5 శాతం వడ్డీని పొందుతారు. 
  • మీరు ఐదేళ్లకు డబ్బులు డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ ప్రయోజనం పొందుతారు. 

మీరు రెండు లక్షల రూపాయల డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుందో చూద్దాం!

టీడీ అకౌట్‌లో మీరు రెండు లక్షల రూపాయలను మూడేళ్లకు డిపాజిట్ చేస్తే ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం మీరు 7.1 శాతం వడ్డీ రేటు అప్లై అవుతుంది. ఈ వడ్డీ రేటు ప్రకారం మీరు 36న నెలల్లో 47, 015 రూపాయల వడ్డీ లభిస్తుంది.  మీరు ఇవాళ రెండు లక్షలు మూడేళ్లకు టీడీ స్కీమ్‌లో పెడితే మూడేళ్ల తర్వాత మీకు 2,47,015 రూపాయలు లభిస్తాయి.

మార్కెట్‌ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నా, ప్రపంచం తలకిందులైనా సరే మీ వడ్డీకి, మీ డబ్బులకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అందుకే ఎక్కువ మంది ఈ స్కీమ్‌వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో మార్కెట్‌ ఆధారిత రిస్క్ లేకపోవడంతో ఎక్కువ మంది ఈ టీడీ స్కీమ్‌లో డబ్బులు డిపాజిట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు.

సీనియర్ సిటిజన్‌లకు అదనపు  ప్రయోజనం లేదు

చాలా బ్యాంకులు, ఇతర పోస్టాఫీసు స్కీమ్‌లలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వడ్డీ రేటు ఇస్తుంటారు. సాధారణ పౌరులతో పోల్చుకుంటే వారికి కనీసం యాభై పైసలైనా ఎక్కువ వడ్డీ ఉంటుంది. మరిన్ని బ్యాంకులు 80 ఏళ్లు దాటిన వారికి మరిన్ని రాయితీలు ఇస్తున్నాయి. కానీ ఇప్పుడు చెప్పుకున్న టీడీ స్కీమ్‌లో మాత్రం సీనియర్ సిటిజన్స్‌కు ఎలాంటి ప్రత్యేక రాయితీలు లేవు. పోస్టాఫీస్‌ చందాదారులందరికీ ఒకటే రూల్‌ పెట్టారు. అందరికీ ఒకే వడ్డీ రేటును అమలు చేస్తున్నారు. ఒక్కో వర్గానికి ఒక్కో వడ్డీ రేటు అంటూ ఎలాంటి గ్రేడింగ్స్ లేవు. 

Frequently Asked Questions

పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్ లో ఎన్ని రకాల టెన్యూర్లు అందుబాటులో ఉన్నాయి?

ఈ స్కీమ్ లో మీరు ఒక సంవత్సరం, రెండేళ్లు, మూడేళ్లు లేదా ఐదేళ్ల టెన్యూర్ ఎంచుకొని పెట్టుబడి పెట్టవచ్చు. మీ అవసరాన్ని బట్టి మీరు టెన్యూర్ ను ఎంచుకోవచ్చు.

రెండు లక్షల రూపాయలను మూడేళ్ల పాటు పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ లో పెడితే ఎంత వడ్డీ వస్తుంది?

ప్రస్తుత 7.1% వడ్డీ రేటు ప్రకారం, మీరు రెండు లక్షల రూపాయలను మూడేళ్లకు డిపాజిట్ చేస్తే సుమారు 47,015 రూపాయల వడ్డీ వస్తుంది. మూడేళ్ల తర్వాత మీకు మొత్తం 2,47,015 రూపాయలు లభిస్తాయి.

పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్ లో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయా?

ఈ టైమ్ డిపాజిట్ స్కీమ్ లో సీనియర్ సిటిజన్లకు ఎలాంటి ప్రత్యేక వడ్డీ రేట్లు లేదా రాయితీలు లేవు. అందరు చందాదారులకు ఒకే వడ్డీ రేటు వర్తిస్తుంది.

పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ లో పెట్టుబడి పెట్టడానికి కారణాలు ఏమిటి?

ఈ స్కీమ్ లో తక్కువ రిస్క్ తో మంచి వడ్డీ వస్తుంది. మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం ఉండదు కాబట్టి మీ పెట్టుబడికి, వడ్డీకి నష్టం ఉండదు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Sai Durgha Tej : సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Sai Durgha Tej : సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
Embed widget