Reliance AGM LIVE Updates: రాబోయే ఐదేళ్లు రిలయన్స్ ఛైర్మన్, ఎండీగా నేనే!
Reliance AGM LIVE Updates: రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ ఏజీఎం మొదలైంది. ఆ కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ ఇన్వెస్టర్లను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కొన్ని కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు.

Background

Reliance AGM 2023: దేశంలోనే అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. రాబోయే ఐదేళ్లలో కంపెనీకి తానే ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంటానని ముకేశ్ అంబానీ స్పష్టం చేశారు. ఆకాశ్, అనంత్, ఇషాకు మెంటార్‌గా ఉంటానన్నారు. అందరికీ డిజిటల్ టూల్స్ అందించడం, అంతాటా గ్రీన్ ఎనర్జీ, అంతటా ఆర్థిక స్వావలంబన, వ్యాపార దక్షత, ఉపాధి కల్పన, అంతటా ఆరోగ్యకరమైన వినియోగం, అంతటా నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు అందించడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
Reliance AGM LIVE Updates: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! రాబోయే 10 ఏళ్లలో డబ్బులే డబ్బులు!
Reliance AGM 2023: భవిష్యత్తులో చక్కని డిమాండ్ ఉండే వ్యాపారాలనే ఎంచుకుంటున్నామని ముకేశ్ అంబానీ అన్నారు. మానవ వనరులే తమకున్న అతిపెద్ద బలమని పేర్కొన్నారు. సృజనాత్మక మేథస్సు, లక్ష్య కోసం పనిచేసే బృందాలే గొప్ప విలువను చేకూరుస్తాయని తెలిపారు. ఇన్వెస్టర్లకు చివరి 45 ఏళ్లలో సృష్టించిన సంపద కన్నా రాబోయే దశాబ్దంలో మరిన్ని రెట్లు అందిస్తామన్నారు.