అన్వేషించండి

BSNL 5G Services: బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు ఇప్పట్లో లేనట్లే, మరో ఏడాది ఆగమంటున్న కేంద్ర మంత్రి

మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం సేవలు అందించేందుకు వంద 4G టవర్లను సైతం ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

BSNL 5G Services: భారతదేశంలో టెలికాం సేవలు అందిస్తున్న మూడు ప్రైవేట్‌ కంపెనీల్లో రెండు (రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌) ఇప్పటికే దేశంలోని ముఖ్య నగరాల్లో 5G సేవలను (5G services) ప్రారంభించాయి. 4G రేట్లకే 5G సేవలు అందిస్తూ, కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటూ దూసుకెళ్తున్నాయి. ఈ విషయంలో, అతి పెద్ద ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మాత్రం 4G సేవలను పూర్తి స్థాయిలో అందించడానికే ఇప్పటికీ ఆపసోపాలు పడుతోంది. 

ఈ నేపథ్యంలో, BSNLను కూడా 5G రేసులోకి తీసుకు వచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. 2024లో ఈ టెలికాం కంపెనీ 5G సేవలను ప్రారంభించేలా సిద్ధం చేస్తోంది. కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) ఈ విషయాన్ని వెల్లడించారు. ఒడిశాలో జియో, ఎయిర్‌టెల్‌ 5G సేవలను ఆయన ప్రారంభించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒడిశా రాజధాని నగరమైన భువనేశ్వర్‌తో పాటు కటక్‌లోనూ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Bharati Airtel) 5G సర్వీసులు ప్రారంభమయ్యాయని, మరో రెండేళ్లలో ఒడిశా అంతటా ఈ వేగమంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయని అశ్విని వైష్ణవ్‌ చెప్పారు. కొత్త ఏడాదిలో గణతంత్ర దినోత్సవం నాటికి (2023 జనవరి 26వ తేదీ లోపు) ఒడిశాలో 5G సేవలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నామని, అనుకున్న సమయానికి ఆ పని పూర్తయిందని తెలిపారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం సేవలు అందించేందుకు వంద 4G టవర్లను సైతం ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

ఈ సందర్భంగా, BSNL 5G సర్వీసుల గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ 4G నెట్‌వర్క్‌ను 5Gలోకి మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. 4G నెట్‌వర్క్‌ను 5Gలోకి అప్‌గ్రేడ్‌ చేయడానికి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) & సి డాట్‌ (C-DOT) నేతృత్వంలోని కన్సార్టియంను BSNL షార్ట్‌ లిస్ట్ చేసిందని వెల్లడించారు. ఈ కన్సార్టియంతో BSNL కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం... ఆర్డర్ చేసిన తేదీ నుంచి దాదాపు ఒక సంవత్సరంలో, ఆ  4G నెట్‌వర్క్‌ మొత్తాన్ని 5Gలోకి అవి అప్‌గ్రేడ్‌ చేస్తాయని కేంద్ర మంత్రి వివరించారు. ఈ లెక్కన, BSNL వినియోగదారులకు 5G సేవలు ఇప్పట్లో లేనట్లే. మరో ఏడాది పాటు ఎదురు చూస్తే తప్ప BSNL 5G సర్వీసులను ఉపయోగించుకోలేరు.

5000 మొబైల్ టవర్లను ఏర్పాటుకు రంగం సిద్ధం
ఒడిశా రాష్ట్రంలో టెలికాం కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు, మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ. 5,600 కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఒడిశాలోని 100 గ్రామాలను కవర్ చేస్తూ, 4G సేవల కోసం 100 టవర్లను ప్రారంభించామని వెల్లడించారు. ఒడిశా రాష్ట్రంలో ప్రపంచ స్థాయి కమ్యూనికేషన్ సౌకర్యాలతో 5,000 మొబైల్ టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Varanasi Update : స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్
స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Varanasi Update : స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్
స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్
Pallichattambi OTT : పళ్లిచట్టంబి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
పళ్లిచట్టంబి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
2027 ODI World Cup Plan: వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
Posani Krishna Murali : మీరు మారిపోయారు సార్ - అరెస్ట్ చేస్తారని భయమా రాజా?
మీరు మారిపోయారు సార్ - అరెస్ట్ చేస్తారని భయమా రాజా?
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Embed widget