News
News
X

Bank Holidays: వచ్చే వారంలో బ్యాంకులు 5 రోజులు బంద్‌, పనుంటే ఇప్పుడే పూర్తి చేసుకోండి

ఈ నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.

FOLLOW US: 
Share:

Bank Holidays: మార్చి నెలలో హోలీ, ఉగాది, శ్రీరామ నవమి సహా బ్యాంకులకు చాలా రోజులు సెలవులు (Bank Holiday in March 2023) ఉన్నాయి. ముఖ్యంగా, వచ్చే వారంలో హోలీ (Holi 2023) పండుగ సన్నాహాలు ప్రారంభమవుతాయి. హిందూ మతంలోని ముఖ్య పండుగల్లో హోలీ ఒకటి. ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా విశిష్టంగా జరుపుకుంటారు. కాబట్టి, హోలీ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు మూడు రోజులు సెలవులు ఉన్నాయి. 

ప్రజల జీవితంలో బ్యాంక్‌ చాలా ముఖ్యమైన భాగంగా మారింది. బ్యాంక్‌ లావాదేవీలు చాలామంది జీవితంలో దైనందిన కార్యక్రమంలా మారాయి. బ్యాంకులకు సెలవు వచ్చిందంటే అలాంటి వాళ్లు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

వచ్చే వారంలో 5 రోజులు సెలవులు 

వచ్చే వారం మొత్తం బ్యాంకులు దాదాపుగా మూతబడే కనిపిస్తాయి. ఈ వారంలో, మార్చి 4వ తేదీన (శనివారం) బ్యాంకులు పూర్తి రోజు పని చేస్తాయి. ఆ తర్వాత, 5వ తేదీ ఆదివారం నాడు సెలవు. 6వ తేదీ, సోమవారం పని చేస్తాయి. ఆ తర్వాత, 7వ తేదీ మంగళవారం నుంచి 9వ తేదీ గురువారం వరకు, హోలీ కారణంగా, అనేక రాష్ట్రాల్లో వరుస సెలవులు ఉంటాయి. 10వ తేదీ శుక్రవారం పూర్తి రోజు పని చేస్తాయి. ఆ తర్వాత, 11, 12 తేదీల్లో రెండో శనివారం & ఆదివారం కారణంగా బ్యాంకులు మూసి ఉంటాయి. మీకు బ్యాంకుల్లో పని ఉంటే ముందే జాగ్రత్త పడి, ఈ సెలవులకు అనుగుణంగా ప్లాన్‌ చేసుకోవడం అవసరం. 

ఈ నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. హోలీతో పాటు చైత్ర నవరాత్రి, తెలుగు కొత్త సంవత్సరం ఉగాది, మళయాళీల పెద్ద వేడుక గుడి పడ్వా, దేశవ్యాప్తంగా జరుపుకునే పెద్ద పండుగల్లో ఒకటైన శ్రీ రామనవమి వంటి అనేక పర్వదినాలు మార్చి నెలలో రానున్నాయి. ఈ పండుగల సందర్భంగా... రాష్ట్రాల వారీగా సెలవుల జాబితాను రిజర్వ్‌ బ్యాంక్‌ విడుదల చేసింది. ఈ పర్వదినాలు కాకుండా... వారాంతపు సెలవులైన శని & ఆదివారాలు ఆ నెలలో 6 రోజులు ఉన్నాయి. మార్చి నెలలో ఏ రోజున బ్యాంకులు పని చేస్తాయో, ఏ రోజును సెలవు తీసుకుంటాయో ఇప్పుడు చూద్దాం.

మార్చి 2023లో బ్యాంక్ సెలవుల జాబితా:

మార్చి 03, 2023- చాప్‌చార్ కూట్ సందర్భంగా ఐజ్వాల్‌లో బ్యాంకులు పని చేయవు
మార్చి 05, 2023 - ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మార్చి 07, 2023- హోలీ / హోలిక దహన్ / ధులెండి / డోల్ జాత్రా / యాసోంగ్ సందర్భంగా బేలాపూర్, గువాహటి, కాన్పూర్, లక్‌నవూ, హైదరాబాద్, జైపూర్, ముంబై, నాగ్‌పుర్, రాంచీ, పనాజీలో బ్యాంకులను మూసివేస్తారు.
మార్చి 08, 2023 - అగర్తల, అహ్మదాబాద్, గాంగ్‌టక్, ఇంఫాల్, పట్నా, రాయ్‌పుర్, ఐజ్వాల్, భోపాల్, లక్‌నవూ, దిల్లీ, భువనేశ్వర్, చండీఘర్‌, దెహ్రాదూన్, రాంచీ, షిల్లాంగ్, శ్రీనగర్, సిమ్లాలో ధూలేటి/ డోల్ జాత్రా/ హోలీ సందర్భంగా బ్యాంకులకు సెలవు
మార్చి 09, 2023- హోలీ సందర్భంగా పట్నాలో మాత్రమే బ్యాంకులు పని చేయవు
మార్చి 11, 2023 - రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మార్చి 12, 2023 - ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మార్చి 19, 2023 - ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మార్చి 22, 2023- గుడి పడ్వా/ ఉగాది/తెలుగు నూతన సంవత్సరం/ బిహార్ దివస్‌/ తొలి నవరాత్రి సందర్భంగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పట్నా, జమ్ము, ముంబైలలో బ్యాంకులు పని చేయవు.
మార్చి 25, 2023 - నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మార్చి 26, 2023 - ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మార్చి 30, 2023- శ్రీ రామ నవమి సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేసి ఉంటాయి.

బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
RBI, బ్యాంక్‌ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. 'హాలిడేస్‌ అండర్‌ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్', 'రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్' & 'క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌'. ఏ బ్యాంక్‌ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది.

అయితే, బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్ UPI సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా చేయవలసి వస్తే ATMని ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్‌ లేదా UPIని ఉపయోగించవచ్చు. 

Published at : 02 Mar 2023 11:41 AM (IST) Tags: Bank holidays March 2023 Bank Holiday list

సంబంధిత కథనాలు

Avalon IPO: ఏప్రిల్‌ 3 నుంచి అవలాన్‌ ఐపీవో - షేర్‌ ధర ఎంతో తెలుసా?

Avalon IPO: ఏప్రిల్‌ 3 నుంచి అవలాన్‌ ఐపీవో - షేర్‌ ధర ఎంతో తెలుసా?

Cryptocurrency Prices: 24 గంటల్లో రూ.50వేలు తగ్గిన బిట్‌కాయిన్‌!

Cryptocurrency Prices: 24 గంటల్లో రూ.50వేలు తగ్గిన బిట్‌కాయిన్‌!

Multibagger Stock: ఏడాదిన్నరలో లక్షను ₹2.25 కోట్లు చేసిన స్టాక్‌ ఇది, మీ దగ్గరుందా?

Multibagger Stock: ఏడాదిన్నరలో లక్షను ₹2.25 కోట్లు చేసిన స్టాక్‌ ఇది, మీ దగ్గరుందా?

Arshad Warsi: అర్షద్ వార్సీ దంపతులకు బిగ్‌ రిలీఫ్‌, వీళ్లు స్టాక్స్‌లో ట్రేడ్‌ చేయవచ్చు - సెబీ నిషేధం నిలుపుదల

Arshad Warsi: అర్షద్ వార్సీ దంపతులకు బిగ్‌ రిలీఫ్‌, వీళ్లు స్టాక్స్‌లో ట్రేడ్‌ చేయవచ్చు - సెబీ నిషేధం నిలుపుదల

Pan-Aadhaar: పాన్-ఆధార్ లింక్‌ గడువును పొడిగించే ఛాన్స్‌, మరో 3 నెలలు అవకాశం

Pan-Aadhaar: పాన్-ఆధార్ లింక్‌ గడువును పొడిగించే ఛాన్స్‌, మరో 3 నెలలు అవకాశం

టాప్ స్టోరీస్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన