అన్వేషించండి

Bank Holiday: ఈ నెలలో బ్యాంకులు 14 రోజులు బంద్‌, మీకేదైనా పనుంటే ఈ లిస్ట్‌ ప్రకారం ప్లాన్‌ చేసుకోండి

ఈ నెలలో మీకు బ్యాంక్‌లో ఎలాంటి పనున్నా ముందు ఈ హాలిడేస్‌ లిస్ట్‌ సేవ్‌ చేసుకోండి.

Bank Holidays list in August 2023: ఈ నెలలో (ఆగస్టు) బ్యాంకులు 14 రోజులు పని చేయవు. చెక్‌, డీడీ, డిపాజిట్‌, విత్‌డ్రా, కొత్త అకౌంట్‌ తెరవడం, లోన్స్‌ తీసుకోవడం, 2 వేల రూపాయల నోట్లు మార్చుకోవడం సహా ఈ నెలలో మీకు బ్యాంక్‌లో ఎలాంటి పనున్నా ముందు ఈ హాలిడేస్‌ లిస్ట్‌ సేవ్‌ చేసుకోండి. దీనివల్ల, సెలవు రోజుల మినహా మిగిలిన రోజుల్లో మీ పనిని ప్లాన్‌ చేసుకోవచ్చు, టైమ్‌ సేవ్‌ అవుతుంది.

ఈ నెలలో బ్యాంకులకు 14 రోజులు సెలవులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్‌ కస్టమర్ల కోసం, ప్రతి నెలకు సంబంధించిన బ్యాంక్‌ సెలవుల జాబితాను ముందుగానే విడుదల చేస్తుంది. ప్రతి రాష్ట్రంలోని పండుగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో వచ్చే సెలవుల వివరాలు ఆ లిస్ట్‌లో ఉంటాయి. ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉన్నాయి. శని, ఆదివారాల్లో వచ్చే సాధారణ సెలవులతో పాటు, పండుగలు, ఇతర కార్యక్రమాల వల్ల వచ్చే సెలవులు కూడా ఈ లిస్ట్‌లో కలిసి ఉన్నాయి. ఆగస్టు 06న ఆదివారంతో మొదలై ఆగస్టు 31న రాఖీ పండుగతో హాలిడేస్‌ ముగుస్తాయి. బ్యాంకు సెలవులు ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి వేర్వేరుగా ఉంటాయి.

2023 ఆగస్టు నెలలో బ్యాంకుల సెలవు రోజులు:

ఆగస్టు 06 - ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 08 - మంగళవారం - (టెండోంగ్ లో రమ్ ఫాత్): సిక్కింలో బ్యాంక్ సెలవు
ఆగస్టు 12 - రెండో శనివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 13 - ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 15 - మంగళవారం - (స్వాతంత్ర్య దినోత్సవం): దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 16 - బుధవారం - (పార్సీ నూతన సంవత్సరం- షాహెన్‌షాహి): బేలాపూర్, ముంబై, నాగ్‌పుర్‌లలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 18 - శుక్రవారం - (శ్రీమంత శంకరదేవుని తిథి): గువాహతిలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 20 - ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 26 - నాలుగో శనివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 27 - ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 28 - సోమవారం - (మొదటి ఓనం): కోచి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 29 - మంగళవారం - (తిరువోణం): కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 30 - బుధవారం - (రాఖీ పండుగ): జైపూర్, సిమ్లాలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 31 - గురువారం - (రాఖీ పండుగ/శ్రీనారాయణ గురు జయంతి/పాంగ్-లాబ్సోల్): డెహ్రాడూన్, గాంగ్‌టక్, కాన్పూర్, కొచ్చి, లఖ్‌నవూ, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు

బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
RBI, బ్యాంక్‌ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. 'హాలిడేస్‌ అండర్‌ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్', 'రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్' & 'క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌'. ఏ బ్యాంక్‌ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI, ATM సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా/డిపాజిట్‌ చేయాల్సివస్తే ATMను ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్‌ లేదా UPIని ఉపయోగించవచ్చు. 

మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Power Grid, Maruti, Adani Energy

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget