అన్వేషించండి

రిలయన్స్ రిజెల్ట్ అదుర్స్... గత త్రైమాసికంలో భారీగా లాభాలు...ఈ ఏడాది రూ. 4519.6 కోట్లు పెరిగిన ముఖేశ్ అంబానీ ఆదాయం

ఆసియాలో అత్యంత ధనవంతుడు ముఖేశ్ అంబానీ ఆదాయం ఆయన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీ ఆదాయం కన్నా వేగంగా పెరుగుతోంది. గత త్రైమాసికంలో రిలయన్స్ ప్రతీ రోజూ, ప్రతీ గంటకు ఎంత ఆర్జించిందో మీకు తెలుసా?

భారతదేశంలో అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL)  జూన్ తో  ముగిసిన చివరి త్రైమాసికంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా ప్రతి గంటకు రూ .6.32 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మనీ మార్కెట్ లో గంటకు రూ. 3.79 కోట్లతో పోలిస్తే ఇది 67% అధికంగా ఉంది. గత త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీన్ రోజువారీ ప్రాతిపదికన రూ.151.71 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇది గత ఏడాది కాలంలో రోజు వారీ ప్రాతిపదికన ఆర్జించిన రూ. 91 కోట్ల లాభాల కన్నా అధికంగా ఉంది. 

రిలయన్స్ సంస్థలో 42% వాటా కల్గిన రిలయన్స్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ఆదాయం ఈ సంవత్సరం ప్రారంభం నుంచి 608 మిలియన్ డాలర్లు (రూ. 4519.6 కోట్లు) పెరిగింది. అంటే సగటున రోజుకు 2.86 మిలియన్ డాలర్లు (రూ. 212.6 కోట్లు) ఆర్జించారు. ఆయన ఆదాయం రోజుకు రూ.8.85 కోట్లు పెరిగింది.

బీఎస్‌ఈలో రిలయన్స్ షేర్లు శుక్రవారం దాదాపు 1% తగ్గి రూ. 2035.40 వద్ద ముగిశాయి. రిలయన్స్ కంపెనీ విలువ ప్రస్తుతం రూ .12,90,330 కోట్లు ఉంటే ఇందులో ఆ సంస్థ ఛైర్మన్ ముఖేష్ అంబానీ నికర ఆదాయం విలువ 77.3 బిలియన్ డాలర్లు (రూ. 5,74,6250 కోట్లు) అని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. గత త్రైమాసికంలో రిలయన్స్ సంస్థ రోజు వారీగా రూ.1745.7 కోట్లు ఆర్జించింది. గంటకు రూ.72.74 కోట్లుతో 57.4 % వృద్ధి సాధించింది. ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ సంస్థ ఎగుమతులు రూ .56,156 కోట్లుగా ఉన్నాయి. సగటున రోజుకు రూ. 617 కోట్లు, గంటకు రూ. 25.71 కోట్లుగా ఉన్నాయి. 

రిలయన్స్ లాభాల్లో జియో ప్లాట్‌ఫామ్‌ వాటా రోజుకు రూ.40.12 కోట్లుగా ఉంటే, రిలయన్స్ రిటైల్ రూ. 10.57 కోట్లు ఉంది. ప్రతీ గంటకు జియో నుంచి వచ్చిన లాభాలు రూ .1.67 కోట్లు కాగా, రిలయన్స్ రిటైల్ లాభం రూ .44 లక్షలు వచ్చింది.  జియో ద్వారా కంపెనీకి రోజుకు రూ .224.69 కోట్ల ఆదాయం, రిటైల్ కార్యకలాపాల ద్వారా రూ. 423.59 కోట్లు, ఆయిల్-టు-కెమికల్స్ (O2C) వ్యాపారం ద్వారా రూ .1134.2 కోట్ల ఆదాయం లభిస్తుంది. గంటవారీ ప్రాతిపదికన, జియో నుండి వచ్చిన ఆదాయం రూ. 10.19 కోట్లు, రిటైల్ ఆదాయం రూ .17.64 కోట్లు, O2C వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం రూ .47.25 కోట్లుగా ఉంది. జూన్ త్రైమాసికంలో రిలయన్స్ జియో 1.4 కోట్ల కొత్త కస్టమర్లను జోడించింది. నెలకు సగటున 1.57 లక్షలు... గంటకు 6547 మంది కస్టమర్‌లు జోడైయ్యారు. ఈ కస్టమర్‌లు ప్రతిరోజూ దాదాపు అరగంటపాటు జియో నెట్‌వర్క్‌లో మాట్లాడుతూ, 500 MB డేటా వినియోగించారు.

 

Also Read: Mogalikudugu: తూర్పుగోదావరి జిల్లాలో ఓ కుటుంబం అదృశ్యం... సూసైడ్ నోట్ హల్ చల్... గోదావరి వంతెనపై పిల్లల దుస్తులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AI Agent Trading: ఏఐ ఏజెంట్ ద్వారా ఒక్క రాత్రిలో 40 లక్షల ప్రాఫిట్, క్లెయిమ్ చేసిన యూజర్.. నెటిజన్లు షాక్
ఏఐ ఏజెంట్ ద్వారా ఒక్క రాత్రిలో 40 లక్షల ప్రాఫిట్, క్లెయిమ్ చేసిన యూజర్.. నెటిజన్లు షాక్
FASTag Annual Pass Fees: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
Adobe CEO Shantanu Narayen : అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా - ఏఐ ఎఫెక్టే ?
అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా - ఏఐ ఎఫెక్టే ?
Sensex tumbles: మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్ - ఒక్క రోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం!
మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్ - ఒక్క రోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం!

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
YSRCP local polls plan: లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
Kerala Assembly Elections 2026: కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Embed widget