అన్వేషించండి

Apple CEO Salary: యాపిల్‌ సీఈవో జీతంలో భారీ కోత, 40 శాతానికి పైగా తగ్గిన ప్యాకేజీ

40 శాతం పైగా కోత తర్వాత, టిమ్ కుక్ వార్షిక జీతం 49 మిలియన్‌ డాలర్లు,

Apple CEO Salary: ఐఫోన్ (iPhone) తయారీ సంస్థ యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్‌ కుక్‌ (Apple CEO Tim Cook), తన జీతభత్యాల్లో స్వచ్ఛందంగా భారీ కోతను విధించుకున్నారు. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం.. తన వేతనాన్ని తగ్గించాలని సీఈవో టిమ్ కుక్ స్వయంగా కంపెనీని అభ్యర్థించారు. ఈ అభ్యర్థన తరువాత, టిమ్‌ కుక్‌ జీతభత్యాలు (compensation) 40 శాతానికి పైగా తగ్గాయి.

తగ్గింపు తర్వాత ఎంత జీతం వస్తుంది?
40 శాతం పైగా కోత తర్వాత, టిమ్ కుక్ వార్షిక జీతం 49 మిలియన్‌ డాలర్లు, అంటే 4 బిలియన్ రూపాయలకు తగ్గింది. 2023 ప్రారంభం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 

అంతకుముందు... 2022 సంవత్సరంలో, టిమ్‌ కుక్ 99.4 మిలియన్‌ డాలర్లను శాలరీ ప్యాకేజీని వార్షిక జీతంగా అందుకున్నారు. ఇందులో.. 3 మిలియన్‌ డాలర్లు ప్రాథమిక జీతం కాగా, 83 మిలియన్‌ డాలర్ల విలువైన స్టాక్‌ అవార్డ్స్‌, బోనస్‌లు ఉన్నాయి. వీటితో పాటు రిటైర్‌మెంట్‌ ప్లాన్స్‌కు సంబంధించిన కాంపన్సేషన్‌, భద్రత, విమాన ప్రయాణాలు, విహార యాత్రలు వంటి సదుపాయాల కోసం 46,000 డాలర్లను కూడా కుక్‌ అందుకున్నారు.

అంతకుముందు, 2021లో, టిమ్ కుక్‌కు ఆపిల్‌ కంపెనీ మొత్తం 98.7 మిలియన్‌ డాలర్లు చెల్లించింది. 2022లో ఇది అతి కొద్దిగా పెరిగింది.

వాటాదారుల అభిప్రాయం, కంపెనీ పనితీరు, కుక్ అభ్యర్థన ఆధారంగా కుక్‌కు అందించే ప్యాకేజీని కుదించాలని నిర్ణయించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో యాపిల్‌ ఇంక్‌ పేర్కొంది.

ప్యాకేజీ మీద విమర్శలు
గత ఏడాది టిమ్ కుక్ అందుకున్న 99.4 మిలియన్‌ డాలర్ల ప్యాకేజీపై చాలా విమర్శలు వచ్చాయి. గత సంవత్సరం CEOకి ఇచ్చిన ప్యాకేజీని చాలా మంది వాటాదారులు వ్యతిరేకించారు, అయితే, మెజారిటీ వాటాదారులు (64 శాతం మంది) ఈ భారీ శాలరీ ప్యాకేజీకి అనుకూలంగా ఓటు వేయడంతో, ఆ ప్రతిపాదన నెగ్గింది. గత సంవత్సరం టిమ్ కుక్‌కు అందిన ఈక్విటీ అవార్డ్స్‌ విలువ 75 మిలియన్‌ డాలర్లు. టిమ్‌ కుక్‌కు ఈ సంవత్సరం అందించే ప్యాకేజీ మీద కూడా వాటాదార్ల నుంచి తీవ్ర వ్యతిరేకత, కంపెనీ మీద ఒత్తిడి వచ్చింది. దీంతో, వాటాదార్ల అభిప్రాయం ప్రకారం, ఆయన జీతభత్యాలను తగ్గించాలని కంపెనీ నిర్ణయించింది. దీనికి కుక్‌ కూడా అంగీకరించారు. దీంతోపాటు... రిటైర్‌మెంట్‌ నాటికి ఇచ్చే స్టాక్‌ అవార్డ్స్‌  సైజ్‌ను కూడా తగ్గించాలని కంపెనీ నిర్ణయించింది.

గత ఏడాది కంపెనీ షేర్లు 27 శాతం మేర పతనం అయ్యాయి. అయితే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కంపెనీ షేర్లు 2.7 శాతం పెరిగాయి. కంపెనీ మార్కెట్ విలువ 2.122 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

ప్రస్తుతం టిమ్‌ కుక్‌ వయస్సు 62 సంవత్సరాలు. వయస్సు అన్నది కేవలం ఒక సంఖ్య మాత్రమే అన్నది ఈయన విషయంలో నిజమైంది. 62 ఏళ్ల వయస్సులోనూ 26 ఏళ్ల కుర్రాడిలో ఉన్నంత ఉత్సాహం చూపిస్తారు. తన సంపదను స్వచ్ఛంద సేవ కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలని టిమ్‌ కుక్‌ నిర్ణయించుకున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Mumtaz Hotel : శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
Target Revanth Reddy :  రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే -  పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Chandrababu Skill Case: స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP DesamRishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడుPujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Mumtaz Hotel : శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
Target Revanth Reddy :  రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే -  పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Chandrababu Skill Case: స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Maharashtra Assembly Election 2024: మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్
మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్
Weather Today: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- 23 బంగాళాఖాతంలో అల్పపీడనం
తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- 23 బంగాళాఖాతంలో అల్పపీడనం
AP News: ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Embed widget