అన్వేషించండి

3M India Dividend: 3M ఇండియా మైండ్‌ బ్లోయింగ్‌ ఆఫర్‌, ఒక్కో షేరు మీద ₹850 డివిడెండ్‌

మార్కెట్‌ ఫ్లోటింగ్‌లో ఉన్న మొత్తం 1,12,65,070 ఈక్విటీ షేర్లకు మధ్యంతర (ప్రత్యేక) డివిడెండ్‌గా ఈ మొత్తాన్ని చెల్లిస్తుంది.

3M India Dividend: 2022-23 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికం (Q2FY23) ఆర్థిక ఫలితాలను బుధవారం ప్రకటించిన 3M ఇండియా లిమిటెడ్‌, షేర్‌ హోల్డర్ల కోసం ఒక బంపర్‌ ఆఫర్‌ కూడా ప్రకటించింది. ఒక్కో షేరు మీద 8500 శాతం స్పెషల్‌ డివిడెండ్‌ ఇస్తామని వెల్లడించింది. 

ఒక్కో షేర్‌ ముఖ విలువ (ఫేస్‌ వాల్యూ) 10 రూపాయలు. దీని మీద 8500 శాతం అంటే, ఒక్కో షేరుకు రూ. 850 స్పెషల్‌ డివిడెండ్‌గా కంపెనీ ప్రకటించింది. మార్కెట్‌ ఫ్లోటింగ్‌లో ఉన్న మొత్తం 1,12,65,070 ఈక్విటీ షేర్లకు మధ్యంతర (ప్రత్యేక) డివిడెండ్‌గా ఈ మొత్తాన్ని చెల్లిస్తుంది. 

3M ఇండియా లిమిటెడ్‌ను 1988లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఎలక్ట్రానిక్స్, టెలీ కమ్యూనికేషన్స్, ఇండస్ట్రియల్, కన్స్యూమర్ అండ్ ఆఫీస్, హెల్త్ కేర్, సేఫ్టీ వంటి విభిన్న కేటగిరీల్లో ఉత్పత్తులను తయారు చేస్తుంది.

ఈ స్టాక్‌ ఒక అండర్‌ పెర్ఫార్మర్‌. గత ఏడాది కాలంలో 14 శాతం నెగెటివ్‌ రిటర్న్స్‌ (నష్టాలు) ఇచ్చింది. Q2 ఫలితాలు, ప్రత్యేక డివిడెండ్‌ ప్రకటన వెలువడగానే, బుధవారం స్టాక్‌ బాగా లాభపడింది. దాదాపు 5 శాతం పెరిగి, రూ. 23,484 వద్ద క్లోజ్‌ అయింది.

డివిడెండ్ రికార్డ్‌ తేదీ
షేర్‌హోల్డర్లకు డివిడెండ్‌ ఇవ్వడానికి 2022 నవంబర్ 22ను (మంగళవారం) రికార్డ్‌ తేదీగా కంపెనీ ప్రకటించింది. 

డివిడెండ్ ఎక్స్-డేట్
నవంబర్ 22ను రికార్డ్‌ డేట్‌గా ప్రకటించింది కాబట్టి, దీని ముందు తేదీ అయిన నవంబర్‌ 21 (సోమవారం) ఎక్స్‌ డేట్‌ (Ex Date) అవుతుంది. రికార్డ్‌ డేట్‌ అంటే, డివిడెండ్‌ వంటి కార్పొరేట్‌ చర్యల కోసం రికార్డులను కంపెనీ పరిశీలించే తేదీ. ఎక్‌ డేట్‌ నాటికి షేర్లు డీమ్యాట్‌ ఖాతాలో ఉన్నవాళ్లు మాత్రమే కంపెనీ ప్రకటించిన డివిడెండ్‌ పొందడానికి అర్హులు అవుతారు. ఇప్పటికే మీ దగ్గర ఈ కంపెనీల షేర్లు ఉండి, ఎక్స్‌ డేట్‌ వరకు వాటిని కొనసాగిస్తే మీరు అర్హులు అవుతారు. మీకు డివిడెండ్‌ కావాలన్నా ఇప్పటి వరకు మీ చేతిలో షేర్లు లేకపోతే, ఎక్స్‌ డేట్‌ నాటికి కనీసం రెండు రోజుల ముందే వాటిని కొనాలి. ఎందుకంటే మన స్టాక్‌ మార్కెట్‌లో T+2 ‍‌(కొన్ని స్క్రిప్‌లకు T+1) సెటిల్‌మెంట్‌ పద్ధతి అమలవుతోంది. అంటే, కనీసం రెండు రోజుల ముందు షేర్లు కొంటేనే, ఎక్స్‌ డేట్‌ నాటికి అవి మీ డీమ్యాట్‌ ఖాతాలోకి వచ్చి చేరతాయి. రికార్డ్‌ డేట్‌ నాడు రికార్డ్స్‌ చెక్‌ చేసే కంపెనీ, ఆ రోజున ఎవరి డీమ్యాట్‌ అకౌంట్‌లో షేర్లు ఉంటే వాళ్లను డివిడెండ్‌కు అర్హులుగా నిర్ణయిస్తుంది. ఎక్స్‌ డేట్‌ లేదా ఆ తర్వాత కంపెనీ షేర్లను కొన్నా మధ్యంతర డివిడెండ్‌కు అర్హులు కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఎక్స్‌ డేట్‌ నాడు లేదా ఆ తర్వాత మీ దగ్గరున్న షేర్లను అమ్మేసినా, కంపెనీ రికార్డ్స్‌లో అప్పటికే మీ పేరు ఉంటుంది కాబట్టి మీకు డివిడెండ్‌ అందుతుంది.

అంతేకాదు, కంపెనీ ఒక్కో షేరుకు ఎంత మొత్తం డివిడెండ్‌ ప్రకటిస్తుందో, ఎక్స్‌ డివిడెండ్‌ డేట్‌ నాడు షేరు ధర అంత మేర తగ్గుతుందన్న విషయం కూడా గుర్తుంచుకోండి. 3M ఇండియా లిమిటెడ్‌ ఒక్కో షేరుకు రూ. 850 డివిడెండ్‌ ప్రకటించింది కాబట్టి, ఎక్స్‌ డేట్‌ నాడు షేరు ధర నుంచి ఆ మొత్తం తగ్గిపోతుంది. 

డివిడెండ్ చెల్లింపు తేదీ
2022 డిసెంబర్‌ 9న లేదా ఆలోగా డివిడెండ్‌ చెల్లిస్తామని కంపెనీ ప్రకటించింది. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

టాప్ హెడ్ లైన్స్

Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Embed widget