అన్వేషించండి

₹2000: కోరిన కోర్కెలు తీరుస్తున్న ₹2000 నోట్లు, అంతా మన మంచికేనట!

పబ్బులు, సినిమాలు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌, ఈ-కామర్స్‌ సైట్స్‌లో రష్‌ పెరిగింది.

2000 Rupees Notes: రిజర్వ్ బ్యాంక్ (RBI) 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత, దేశంలో జనం చేసే ఖర్చులు అకస్మాత్తుగా పెరిగాయి. కొవిడ్‌ గుణపాఠంతో పొదుపు నేర్చుకున్న ప్రజలు, పింక్‌ నోట్ల విత్‌ డ్రా తర్వాత విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. క్యాష్‌ పేమెంట్స్‌ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. 2 వేల నోట్లను దాచినవాళ్లు వాటిని బయటకు తీసి పాత కోర్కెలన్నీ తీర్చుకుంటున్నారు. బలవంతంగా నిద్రపుచ్చిన కోర్కెలను తట్టి లేపుతున్నారు. ఏం కొనాలనిపిస్తే అది కొంటున్నారు. పబ్బులు, సినిమాలు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌, ఈ-కామర్స్‌ సైట్స్‌లో రష్‌ పెరిగింది. 

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటోలో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకున్న వారిలో దాదాపు 75 శాతం మంది రూ. 2,000 నోట్లతో డబ్బులు చెల్లిస్తున్నట్లు వెల్లడైంది. 2 వేల నోట్లతో జనం చేస్తున్న జల్సాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన విభాగం నివేదిక వెలుగులోకి తీసుకొచ్చింది. 

పెట్రోల్ పంపుల్లో పడిపోయిన డిజిటల్‌ పేమెంట్స్
పెట్రోల్ పంపుల వద్ద నగదు లావాదేవీలు వేగంగా పెరిగాయి. అవసరం ఉన్నా లేకున్నా ట్యాంక్‌ ఫుల్‌ చేయిస్తున్న వినియోగదార్లు బిల్లు చెల్లించడానికి రూ. 2000 నోట్లను ఉపయోగిస్తున్నారు. గతంలో, పెట్రోల్‌ బంకుల్లో రోజువారీ విక్రయాల్లో 40 శాతంగా ఉండే డిజిటల్ పేమెంట్స్‌ ఇప్పుడు 10 శాతానికి తగ్గాయని, నగదు విక్రయాలు విపరీతంగా పెరిగాయని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (ఏఐపీడీఏ) వెల్లడించింది.

ఏది కొన్నా 'క్యాష్ ఆన్ డెలివరీ' ఆప్షన్‌
SBI రిపోర్ట్‌ ప్రకారం.. ఈ-కామర్స్, ఫుడ్‌, ఆన్‌లైన్ కిరాణాల్లో ఆర్డర్లు పెట్టి, క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకునే కస్టమర్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 2 వేల నోట్లను ఖర్చు చేసి పుణ్యక్షేత్రాలు తిరుగుతున్న పరమ భక్తులు.. దేవాలయాలు & ఇతర మత సంస్థలకు రూ. 2000 నోట్ల ద్వారా విరాళాలు ఇస్తున్నారు. ఈ ధోరణి ఇంకా పెరగవచ్చన్నది స్టేట్‌ బ్యాంక్‌ అంచనా. 

అప్పుడు అలా - ఇప్పుడు ఇలా
2000 రూపాయల నోట్లను బ్యాంక్‌ అకౌంట్లలో డిపాజిట్ చేయమని లేదా మార్చుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. అయినా.. బంగారం, వజ్రాభరణాలు, ACలు, ఖరీదైన మొబైల్ ఫోన్‌లు, లగ్జరీ ఫర్నీచర్‌ వంటి కన్స్యూమర్ డ్యూరబుల్స్ కోసం పింక్‌ నోట్లను పదేపదే ఉపయోగిస్తున్నారు. రేటెక్కువ అంటూ గతంలో నసిగిన వాళ్లు కూడా ఇప్పుడు సెకండ్‌ థాట్‌ లేకుండా సీరియస్‌గా కొంటున్నారు. ఇళ్లు, స్థలాల వంటి రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో 2000 రూపాయల నోట్ల కట్టలు చేతులు మారుతున్నాయి. ఈ తరహా ఖర్చులు ఇంకా పెరుగుతాయని ఎస్‌బీఐ రిపోర్ట్‌ అంచనా వేసింది. 

స్టేట్‌ బ్యాంక్‌ రిపోర్ట్‌ ప్రకారం... దాదాపు రూ. 3.08 లక్షల కోట్లు డిపాజిట్ల రూపంలో బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వస్తాయి. అందులో రూ. 92 వేల కోట్లు సేవింగ్స్‌ అకౌంట్లలో జమ అవుతాయి. ఈ డబ్బులో సింహభాగాన్ని 2 వేల రూపాయల నోట్ల మార్పిడి కోసం జమ చేశారు తప్ప, అకౌంట్లలో ఉంచడానికి డిపాజిట్‌ చేయలేదు. కాబట్టి, అందులో 60 శాతం మొత్తాన్ని, అంటే దాదాపు రూ. 55,000 కోట్లను ప్రజలు వెనక్కు తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు వినియోగం పెరగొచ్చని ఎస్‌బీఐ వెల్లడించింది. దీర్ఘకాలంలో ఇది రూ. 1.83 లక్షల కోట్లకు చేరొచ్చని లెక్కగట్టింది. దీనివల్ల వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందని, ఇదంతా మన మంచికేనని చెబుతోంది.

మరో ఆసక్తికర కథనం: ₹1000 లోపు ధరలో దొరుకుతున్న 7 బ్లూచిప్‌ స్టాక్స్‌ 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget