By: ABP Desam | Updated at : 29 May 2023 04:27 PM (IST)
సద్గురు
IPL 2023, CSK:
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తనకు ఇష్టమైన జట్టని సద్గురు 'జగ్గీ వాసుదేవ్' అంటున్నారు. కొన్నేళ్లుగా వారికి సపోర్ట్ చేస్తున్నానని పేర్కొన్నారు. మిగతా జట్లకీ సీఎస్కేకి కెప్టెన్ ఎంఎస్ ధోనీయే డిఫరెన్స్ అని వెల్లడించారు. ఈ సీజన్లో సీఎస్కే, ఆర్సీబీ మ్యాచులో ఆయన కనిపించిన సంగతి తెలిసిందే.
గతేడాది యూనివర్స్ బాస్ క్రిస్‌గేల్.. సద్గురును ఇంటర్వ్యూ చేశారు. అందులో ఆయన చెన్నై సూపర్ కింగ్స్ గురించి చెప్పారు. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది. 'మీకు ఇష్టమైన జట్టేది' అని గేల్ అడగ్గా 'ఇంకేం ఉంటుంది. చెన్నై జట్టే' అని నవ్వుతూ సమాధానం చెప్పారు.
అంతకు ముందు ఏడాదే చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. అప్పుడు జరిగిన ఓ సంఘటనను సద్గురు వివరించారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఫైనల్ మ్యాచులో తాము గెలిచేలా ఆశీర్వదించాలని అడిగిందన్నారు. 'గతేడాది కేకేఆర్ టీమ్ ఫైనల్ చేరుకుంది. అప్పుడు వారు నన్ను పిలిచారు. సద్గురూ.. మీరు మమ్మల్ని తప్పకుండా ఆశీర్వదించాలి అన్నారు. అప్పుడు నేను.. మీరు ఎవరితో పోటీపడుతున్నారని ప్రశ్నించాను. వారు చెన్నై అని జవాబు చెప్పారు. చూడండీ.. ఆ ఒక్కటీ నన్ను అడగొద్దు.. ఆ పని నేను చేయలేనన్నాను' అని గేల్‌కు సద్గురు వివరించారు.
అదే వీడియోలో 'చెన్నై సూపర్ కింగ్స్ నంబర్ వన్ టీమ్' అని గేల్ చెప్పగా.. 'ధోనీ ఆ జట్టును మార్చేశాడు' అని సద్గురు చెప్పారు. ఈ సీజన్లో సద్గురు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ప్రోత్సహిస్తూ కనిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో సద్గురు దయ వల్ల సోమవారం చెన్నై ఐదో ట్రోఫీ గెలుస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు!
Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!
Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం
Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!
Anasuya Bharadwaj: రౌండ్ కళ్లద్దాలతో రంగమత్త - భలే బాగుంది కదూ!
/body>