Mahindra, Renault ,Tata Motors Latest Updates: బంపర్ ఆఫర్.. 22వ తేదీ కన్నా ముందే తగ్గింపు ధరతో కార్లు కొనవచ్చు.. అలా చేస్తే చాలు.. ఏయే కంపెనీ నుంచి ఎంత డిస్కౌంట్ అంటే..
4 నెలలుగా డల్ గా ఉన్న కార్ మార్కెట్కి జీఎస్టీ స్లాబుల సవరింపుతో ఒక్కసారిగా నూతనొత్తేజం వచ్చింది. భారీగా ధరలు తగ్గుతుండటంతో ఈ సీజన్లో రికార్డు అమ్మకాలు జరుగుతాయని కంపెనీలు భావిస్తున్నాయి.

Mahindra Renault and Tata Motors Slashes Prices Latest News: నిజానికి కొత్త జీఎస్టీ రేట్లు ఈనెల 22 నుంచి వర్తిస్తుండగా, చాలా కంపెనీలు ఇప్పటి నుంచే ఆ వెసులు బాటును అందిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు బుక్ చేసుకుని, అప్పుడు ధర చెల్లించేవారికి కొత్త జీఎస్టీని అమలు చేస్తామని ప్రకటించాయి. జీఎస్టీ 2.0 అమలుతో కార్ల ధరలు గణనీయంగా తగ్గడంతో వినియోగదారులకు భారీ లాభాలు లభిస్తున్నాయి. మహీంద్రా SUVల కొనుగోలు దారులు రూ.1.01 లక్షల నుండి రూ.1.56 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.
కంపెనీ ప్రకారం, సెప్టెంబర్ 22 నుంచే కొత్త రేట్లు అమలులోకి వచ్చినా, అదే తేదీకి ముందు బిల్లింగ్ పూర్తిచేసిన వారికి కూడా జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం వర్తిస్తుంది. మహీంద్రా SUVలపై ధర తగ్గింపులు ఇలా ఉన్నాయి: Bolero / Bolero Neo రూ.1.27 లక్షల వరకు, XUV3XO (పెట్రోల్) రూ.1.40 లక్షల వరకు, XUV3XO (డీజిల్) రూ.1.56 లక్షల వరకు, Thar 2WD (డీజిల్) రూ.1.35 లక్షల వరకు, Thar 4WD (డీజిల్) రూ.1.01 లక్షల వరకు, Scorpio Classic రూ.1.01 లక్షల వరకు, Scorpio-N రూ.1.45 లక్షల వరకు, Thar Roxx రూ.1.33 లక్షల వరకు, XUV700 రూ.1.43 లక్షల వరకు తగ్గింపు లభిస్తున్నాయి.
రెనాల్ట్ కూడా..
మహీంద్రా తర్వాత, రెనాల్ట్ ఇండియా కూడా తమ మూడూ మోడల్స్ అయిన Kwid, Triber, Kiger పై ధరలు రూ.96,395 వరకు తగ్గించాయి. ఇప్పుడు Kwid ధర రూ.4,29,900 (ఎక్స్‌షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది, Triber , Kiger ధరలు రూ.5,76,300 (ఎక్స్‌షోరూమ్) నుండి మొదలవుతున్నాయి. ఈ ధరలు సెప్టెంబర్ 22 నుండి డెలివరీలపై వర్తించనున్నప్పటికీ, బుకింగ్స్ ఇప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. రెనాల్ట్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిల్లపల్లె దీనిపై మాట్లాడుతూ, GST ప్రయోజనాన్ని పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేయడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు.
అదే బాటలో టాటా మోటార్స్ కూడా..
అంతేగాక, టాటా మోటార్స్ కూడా GST 2.0 ప్రయోజనాన్ని సెప్టెంబర్ 22 నుండి అమలు చేస్తుందని ప్రకటించింది. ఇందులో Tiago ధర రూ.75,000 వరకు, Nexon ధర రూ.1,55,000 వరకు తగ్గుతుంది. GST కౌన్సిల్ తన 56వ సమావేశంలో ప్రధాన మార్పులు చేసి, ఆటో రంగానికి వర్తించే సామాన్య పన్ను రేటును 28% నుంచి 18%కి తగ్గించింది. ముఖ్యమైన మార్పులలో, 1200cc లోపు పెట్రోల్, హైబ్రిడ్, LPG, CNG కార్లు , 1500cc లోపు డీజిల్ కార్లు (అన్ని 4 మీటర్లలోపు) వాటిపై 18% GST మాత్రమే ఉంటుంది. 350cc లోపు బైక్‌లు, త్రీ వీలర్లు, గూడ్స్ వాహనాలు కూడా 18% GST కిందకు వస్తాయి.
చిన్న వాహనాలు (హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్ సేడాన్లు, కాంపాక్ట్ SUVలు) ఇప్పుడు 18% GST పరిధిలోకి వస్తుండగా, మిడ్-సైజ్, లగ్జరీ వాహనాలపై 40% వరకు పన్ను ఉంటుంది. ఇంతకుముందు, ICE వాహనాలపై 28% తో పాటు 1% నుండి 22% వరకు కంపెన్సేషన్ సెస్ ఉండేది. ఎలక్ట్రిక్ వాహనాలపై GST అదే విధంగా 5% ఉండగా, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాలపై GST 12% నుండి 5%కి తగ్గించబడింది. ఈ నిర్ణయాలు పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవి. దీంతో కార్ మార్కెట్లో వివిధ వాహనాలకు డిమాండ్‌ను పెంచే అవకాశముంది.





















