News
News
X

Kia Dealer: కియా డీలర్‌కు రూ.16 లక్షలు ఫైన్ - అసలు ఏం చేశారు?

కొత్త మోడల్ బదులుగా పాత మోడల్ డెలివరీ చేసినందుకు కియా డీలర్‌కు రూ.16 లక్షల ఫైన్‌ను విధించారు.

FOLLOW US: 
Share:

కారు డీలర్ షిప్స్ సర్వీసుల విషయంలో ఉండే కంప్లయింట్లు అందరికీ తెలిసిందే. కొన్ని సార్లు సమస్యలు మరింత సంక్లిష్టం అయినప్పుడు అది బ్రాండ్ వాల్యూ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా పెద్ద బ్రాండ్లు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

ఇప్పుడు తాజాగా ఒక కియా సెల్టోస్ ఓనర్ డీలర్‌కు వ్యతిరేకంగా డిస్ట్రిక్ట్ గ్రీవెన్సెస్ రీడ్రసల్ ఫోరంలో ఫిర్యాదు చేశారు. కొత్త మోడల్ బుక్ చేసుకుంటే తనకు పాత మోడల్ డెలివరీ చేశారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోరం విచారణలో ఇది నిజమని తేలింది. దీంతో తీర్పు వినియోగదారుడి వైపు వచ్చింది.

ఓల్డ్ మోడల్ డెలివరీ చేసిన డీలర్
2020 మే 28వ తేదీన నాగరాజ్ పాటిల్ అనే వ్యక్తి ఫేస్ లిఫ్ట్ ప్లస్ మఫ్లర్ బంపర్ ఉన్న కియా సెల్టోస్ హెచ్‌టీకే+జీ స్మార్ట్ స్ట్రీమ్ 1.5 లీటర్ పెట్రోల్ కారును కొనుగోలు చేశారు. 2020 జులై 2వ తేదీన ఈ కారును డీలర్ డెలివరీ చేశారు. అప్పుడు వినియోగదారుడికి ఎటువంటి అనుమానం రాలేదు. డీలర్ షిప్ దగ్గర మొదటి సర్వీస్ కూడా చేయించారు.

ఒక నెల రోజులు దాటాక కారు ఓనర్‌కు కాస్త అనుమానం వచ్చింది. ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశాక అతనికి ఒక షాకింగ్ విషయం చేసింది. అతనికి పాత కియా సెల్టోస్ హెచ్‌టీకే+ 1.5 మోడల్‌ను డెలివరీ చేశారు. 2020 జూన్ 2వ తేదీన లాంచ్ అయిన కొత్త మోడల్ కాదని తెలిసింది.

కియా ఇండియా డీలర్‌కు వ్యతిరేకంగా సెల్టోస్ ఓనర్ కేసు
ఓనర్ విషయం తెలుసుకున్న వెంటనే డీలర్‌ను సంప్రదించాడు. తనకు రీప్లేస్‌మెంట్ కావాలని కోరాడు. ఈ విషయంపై విచారణ జరిపి అనంతరం పరిష్కరిస్తామని మొదట ఓనర్‌కు భరోసా ఇచ్చారు. కానీ ఆ తర్వాత వాహనాన్ని రీప్లేస్ చేయడానికి డీలర్ నిరాకరించాడు. రూ.23 వేల విలువైన ఎక్స్‌టెండెడ్ వారంటీ, కొత్త మోడల్‌లో ఉన్న ఫీచర్లను ఈ కారులో కూడా ఎక్విప్ చేస్తామని డీలర్ ఆఫర్ చేశాడు. కానీ కారు ఓనర్ మాత్రం తనకు రీప్లేస్‌మెంటే కావాలన్నాడు. దీనికి డీలర్ నిరాకరించాడు. దీంతో కారు ఓనర్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరమ్‌ను సంప్రదించాడు.

డీలర్‌కు రూ.16 లక్షల ఫైన్
ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం డిస్ట్రిక్ట్ కన్య్సూమర్ కోర్డు వినియోగదారుడికి అనుకూలంగా తీర్పును ఇచ్చింది. కియా డీలర్ కొన్ని అన్యాయమైన వాణిజ్య పద్ధతులను పాటించాడని, సర్వీసులో కూడా లోపం ఉందని కన్స్యూమర్ ఫోరం నిర్ణయించింది. వారు తెలిపిన విషయాలు ఇవే.

1. బుకింగ్ అమౌంట్‌కు ఇచ్చిన రశీదులో మోడల్ నంబర్ పేర్కొనలేదు. వినియోగదారుడు పాత మోడల్ బుక్ చేశాడు అనడానికి డీలర్ వద్ద ఎటువంటి పత్రాలు లేవు. ఓనర్ తెలుపుతున్న దాని ప్రకారం, అతనికి కొత్త మోడల్ అందిస్తామని నోటి మాట ద్వారా తెలిపారు.

2. కేవలం ఐదు రోజుల్లోనే కొత్త మోడల్ లాంచ్ అవుతుంది కాబట్టి, కొత్త మోడలే కావాలనుకోవడం సహజంగానే మానవ నైజం.

3. పాత మోడల్ ఇప్పటికే డీలర్ వద్ద అందుబాటులో ఉంది. కానీ వినియోగదారుడిని కావాలని నెల రోజుల పాటు వెయిట్ చేయించారు.

4. కొత్త మోడల్ లాంచ్ కావడానికి ముందే అనధికారిక బుకింగ్స్ తీసుకోవడం డీలర్లు సహజంగా చేసేదే.

5. ఫిర్యాదు చేసిన వ్యక్తి అందించిన టెలిఫోన్ కాల్ రికార్డింగుల్లో డీలర్ షిప్ సిబ్బంది తమ తప్పును ఒప్పుకున్నట్లు తేలింది.

కియా సెల్టోస్ ఓనర్‌కు పరిహారం చెల్లించేందుకు కన్స్యూమర్ ఫోరం డీలర్ షిప్‌కు కొన్ని ఆప్షన్లు ఇచ్చింది.

1. వినియోగదారుడు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పాత మోడల్ వెనక్కి తీసుకుని కొత్త మోడల్‌ను డెలివరీ చేయండి.

2. ఒకవేళ కొత్త మోడల్ అందుబాటులో లేకపోతే ఫిర్యాదు చేసిన వ్యక్తి కోరుకున్న మరో వేరియంట్‌ను అందించండి. అదనపు మొత్తం ఏదైనా అవసరం అయితే దాన్ని ఫిర్యాదు చేసి వ్యక్తి చెల్లిస్తాడు.

3. కారు డెలివరీ చేసిన దగ్గర నుంచి ఫైనల్ పేమెంట్ డేటు వరకు వినియోగదారుడు చెల్లించిన రూ.14,85,110 మొత్తాన్ని సంవత్సరానికి ఎనిమిది శాతం వడ్డీ రేటుతో తిరిగి చెల్లించండి.

వినియోగదారుడికి కలిగిన అసౌకర్యానికి, మానసిక వేదనకు రూ.లక్ష అదనంగా చెల్లించాలి. దీంతోపాటు లిటిగేషన్ కాస్ట్ రూ.10 వేలు కూడా ఇవ్వాలి.

ప్రీ-డెలివరీ ఇన్‌స్పెక్షన్ ప్రాముఖ్యతను కన్స్యూమర్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు తిరిగి గుర్తు చేస్తుంది. దీని కారణంగా తప్పులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించవచ్చు. కష్టమైన కోర్టు గొడవలను తప్పించుకోవచ్చు. కావాలని వినియోగదారులను మోసగిస్తే కఠినమైన శిక్షలు విధించేలా ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలి.

Published at : 06 Mar 2023 03:28 PM (IST) Tags: Kia Seltos Kia Dealer Fined Kia News

సంబంధిత కథనాలు

Mahindra Thar SUV: సైలెంట్‌గా సూపర్ హిట్ అవుతున్న మహీంద్రా ఎస్‌యూవీ - కీలకమైన మైలురాయి!

Mahindra Thar SUV: సైలెంట్‌గా సూపర్ హిట్ అవుతున్న మహీంద్రా ఎస్‌యూవీ - కీలకమైన మైలురాయి!

Kia EV9 SUV: టెస్లా కంటే మెరుగైన ఆటోపైలట్ ఫీచర్‌తో కియా కొత్త కారు - మస్క్‌కి మంట పెడతారా?

Kia EV9 SUV: టెస్లా కంటే మెరుగైన ఆటోపైలట్ ఫీచర్‌తో కియా కొత్త కారు - మస్క్‌కి మంట పెడతారా?

Key steps To Buy Car: సెకండ్ హ్యాండ్ కారు కొనాలి అనుకుంటున్నారా? ఈ 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి!

Key steps To Buy Car: సెకండ్ హ్యాండ్ కారు కొనాలి అనుకుంటున్నారా? ఈ 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి!

Expensive Bikes: దేశంలో అత్యంత ఖరీదైన బైక్స్ ఇవే - చూడటం తప్ప కొనడం కష్టమే!

Expensive Bikes: దేశంలో అత్యంత ఖరీదైన బైక్స్ ఇవే - చూడటం తప్ప కొనడం కష్టమే!

Car Fuel Tank Tips: కారులో ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారా? - అయితే మీ వాహనం డేంజర్‌లో ఉన్నట్లే! - ఎందుకో తెలుసా?

Car Fuel Tank Tips: కారులో ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారా? - అయితే మీ వాహనం డేంజర్‌లో ఉన్నట్లే! - ఎందుకో తెలుసా?

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు