Citroen C3 MS Dhoni Edition: మార్కెట్ లోకి 'ధోని ఎడిషన్' సిట్రోయెన్ కార్లు.. అదనపు హంగులతో అదుర్స్, ధర ఎంతకంటే?
Dhoni Edition: ప్రముఖ కార్ల బ్రాండ్ సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ కార్లలో ధోని ఎడిషన్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది ధోని ఎడిషన్.
Citroen C3 MS Dhoni Edition Launched: ప్రముఖ కార్ల బ్రాండ్ సిట్రోయెన్ ఇండియా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఆయన పేరు మీద సీ3, సీ3 ఎయిర్‌క్రాస్ కార్లలో ప్రత్యేక ఎడిషన్ తీసుకొస్తున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు ఆ ఎడిషన్‌ను లాంచ్ చేసింది కంపెనీ. కేవలం 100 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. సీ3 ఎయిర్‌క్రాస్ కార్ల ధర, ప్రత్యేకత, ఫీచర్లు ఒకసారి చూద్దాం.
100 మంది.. వారిలో ఒకరికి అదృష్టం..
ధోనీ ఎడిషన్ సీ3 కార్లు బుకింగ్ దేశవ్యాప్తంగా ఉన్న సిట్రోయెన్ డీలర్ షిప్స్ లో ప్రారంభమైంది. అయితే, ధోని ఎడిషన్ కార్లు మాత్రం కేవలం 100 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక సీ3 ఎయిర్‌క్రాస్ ధర రూ.8.99 లక్షలు కాగా.. ధోని ఎడిషన్ దాదాపు రూ.11.82 లక్షలు పడుతుంది (ఎక్స్ షూరూమ్). ధోని ఎడిషన్ కార్లు కొన్న 100 మందిలో ఒకరికి మాత్రం అదృష్టం దక్కనుంది. అదేంటంటే ఆయన స్వయంగా సంతకం పెట్టిన ఒక గ్లో సెట్ ఆ కారులో ఉంటుందట. ఆ అదృష్టవంతులు ఎవరో చూడాల్సి ఉంది అంటూ కంపెనీ ప్రకటించింది.
ఫీచర్లు..
ధోనీ ఎడిషన్ కి కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు ఇచ్చింది కంపెనీ. ప్రతి కారులో ప్రత్యేకమైన ధోని థీమ్ డికాల్స్ ని అమర్చింది. ఇక ఈ ఎడిషన్ లో కలర్ కో ఆర్డినేటెడ్ కవర్లు, కుషన్ దిండ్లు, సీట్ బెల్ట్ కుషన్స్ ని ఇచ్చింది. ఫ్రంట్ ప్లేట్లు ప్రకాశించేవిగా, ఫ్రంట్ డ్యాష్ క్యామ్ కూడా ఏర్పరిచారు. ఇక ప్రతి ధోని ఎడిషన్ కారులోని గ్లో బాక్స్ లో ప్రత్యేకంగా ధోనీ థీమ్ తో గూడీస్ కూడా ఉంటాయి. ఒక కొనుగోలు దారుని కారులో మాత్రం స్వయంగా ధోని సంతకం పెట్టిన గ్లోవ్స్ ఉంటాయి.
సిట్రోయెన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ శిశిర్ మిశ్రా మాట్లాడుతూ.. "ఇలాంటి ఎక్స్ క్లూజివ్ ధోని ఎడిషన్ ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. సీ3 ఎయిర్ క్రాస్ కేవలం 100 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మా బ్రాండ్ అంబాజిడర్ ధోనిలో లీడర్ షిప్ క్వాలిటీస్, దేనైనా ఎదుర్కొనే సత్తా లాంటి మంచి లక్షణాలు, గుణాలు ఉన్నాయి. అలానే మేం కూడా అద్భుతమైన అనుభూతిని ఇచ్చే కార్లను డెలివరీ చేస్తున్నాం. ఈ అరుదైన, లిమిటెడ్ ఎడిషన్ ని ధోని లైఫ్ జర్నీకి ట్రిబ్యూట్ గా అందిస్తున్నాం. ఆయన ఫ్యాన్స్ కి ఒక మంచి, చరిత్రాత్మక కారును ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాం. ఇలాంటి మంచి ఎక్స్ పీరియెన్స్ ని మిస్ చేసుకోకండి" అని అన్నారు.
సీ3 ఎయిర్ క్రాస్ ఫీచర్లు..
సిట్రోయెన్ సీ3 ఎయిర్ క్రాస్ ని అక్టోబర్ 2023లో లాంచ్ చేసింది. ఈ కారులో మ్యానుయల్, ఆటోమెటిక్ రెండు అందుబాటులో ఉన్నాయి. దీంట్లో 1.2 లీటర్, 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 109 బీహెచ్ పీ, 205 ఎన్ ఎమ్ టార్క్యూని రిలీజ్ చేస్తుంది. ఈ ఎస్ యూవీ ధర రూ.9.99 - రూ.14.33 లక్షల మధ్య ఉంది (ఎక్స్ షోరూమ్). మైలేజ్ విషయానికొస్తే దాదాపు 17.9 కి.మీ. నుంచి 18.5 కి.మీ. వరకు ఇస్తుంది. ఈ మోడల్ కారు 5 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్ లో అందుబాటులో ఉంది.
ఫీచర్ల విషయానికొస్తే..
26 సెంటీమీటర్ల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉంది. వైర్ లెస్ యాండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే ఉంది. దాంతో పాటుగా 17.78 సెం.మీ. ఇంటెల్లీ స్మార్ట్ టిఎఫ్ టీ క్లస్టర్ అందుబాటులో ఉంది. ఈఎస్పీ, హిల్ హోల్డ్, టీపీఎమ్ ఎస్, ఇంజిన్ స్టార్ట్ స్టాప్ కూడా ఉంది. 38 స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. దాంతో పాటుగా డోర్లు తీసేందుకు, లాక్ వేసేందుకు, లైట్లు ఆఫ్, ఆన్ చేసేందుకు రిమోట్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఈ కారు 4 మోనోటోన్, 6 డ్యూయెల్ టోన్, 2 ఇంటీరియర్ డ్యాష్ బోర్డ్ కలర్ ఆప్షన్స్ లో ఉంది. దాంటో పాటుగా 4 క్టమైజేషన్ ప్యాక్స్, 70 యాక్సిసరీలు అందుబాటులో ఉన్నాయి.
Also Read: ‘గ్రాండే పాండా’ను రివీల్ చేసిన ఫియట్ - వావ్ అనిపిస్తున్న కొత్త కారు!