అన్వేషించండి

Best Mileage SUVs: బెస్ట్ మైలేజ్ ఉన్న ఎస్‌యూవీ కొనాలనుకుంటున్నారా? - అయితే ఈ ఐదు కార్లపై లుక్కేయండి!

Best Mileage SUVs in India: మనదేశంలో బెస్ట్ మైలేజీని అందించే ఎస్‌యూవీలు ఇవే.

ఎస్‌యూవీ కార్లు భారతదేశంలో ప్రస్తుతం చాలా ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వాటి కోసం డిమాండ్ కూడా చాలా పెరిగింది. అందుకే కార్ల తయారీ కంపెనీలు కూడా ఎ‌స్‌యూవీలను ఎప్పటికప్పుడు ఎక్కువ గ్యాప్ లేకుండా విడుదల చేస్తున్నాయి. ఎస్‌యూవీల ప్రత్యేకత ఏమిటంటే ఎక్కువ స్థలంతో రావడంతో పాటు, అద్భుతమైన పనితీరును కూడా కనబరుస్తాయి. ప్రస్తుతం మన దేశంలో అత్యధిక మైలేజీనిచ్చే ఎస్‌యూవీ కార్ల గురించి తెలుసుకుందాం.

కియా సెల్టోస్ 1.5 టర్బో
మంచి మైలేజ్ కావాలంటే మీరు కియా సెల్టోస్‌ని కూడా ఎంచుకోవచ్చు. కియా సెల్టోస్‌లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 160 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఇది 6 స్పీడ్ iMT లేదా 7 స్పీడ్ DCT ఆప్షన్‌ను పొందుతుంది. ఇది ఈ సెగ్మెంట్లో శక్తివంతమైన ఇంజన్‌తో వస్తుంది. మైలేజీ గురించి చెప్పాలంటే సగటున లీటరుకు 17.8 కిలోమీటర్లు అందిస్తుంది.

మారుతి గ్రాండ్ విటారా / టయోటా హైరైడర్ 1.5 పెట్రోల్
మరొక ఆప్షన్‌గా మారుతి స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ అనే రెండు కార్లు ఉన్నాయి. ఈ రెండు ఎస్‌యూవీలు 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో రానున్నాయి. ఇవి 103 హెచ్‌పీ పవర్‌ని ఉత్పత్తి చేస్తాయి. రెండు కార్లు సగటున లీటరుకు 21.12 కిలోమీటర్ల మైలేజీని అందించనున్నాయి. దీంతో పాటు ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను పొందుతుంది.

మారుతి గ్రాండ్ విటారా / టయోటా హైరైడర్ 1.5 స్ట్రాంగ్ హైబ్రిడ్
ఈ రెండు ఎస్‌యూవీలు ఒక లీటర్ పెట్రోల్‌కు 27.97 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి. రెండు కార్లు టయోటా స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో మార్కెట్లోకి వచ్చాయి. ఇది 1.5 లీటర్ 4 సిలిండర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. అయితే ఈ కారు కేవలం ఈ-సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను మాత్రమే పొందుతుంది. అధిక ట్రాఫిక్ ఉన్న రోడ్లపై ఈ కార్లు ఎక్కువ మైలేజీని ఇస్తాయి.

స్కోడా కుషాక్ 1.5 టీఎస్ఐ
స్కోడా కుషాక్ 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో అమర్చబడి ఉంది. ఇది 150 హెచ్‌పీ పవర్‌ని పొందుతుంది. అలాగే 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంది. కుషాక్ 1.5 టీఎస్ఐ లీటరుకు 17.83 కిలోమీటర్ల మైలేజీని పొందుతుందని తెలిసింది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ 1.5 టీఎస్ఐ
మీరు టైగన్‌ని ఐదో ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. ఈ ఎస్‌యూవీ స్కోడా కుషాక్ ఫోక్స్‌వ్యాగన్ మోడల్. ఇది 150 హెచ్‌పీ పవర్‌తో 1.5 లీటర్ నాలుగు సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా పొందుతుంది. అలాగే 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ డీసీటీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మైలేజీ గురించి చెప్పాలంటే ఇది లీటరుకు 18.18 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget