కంఫర్ట్, స్టైల్, రిలాక్స్ రైడింగ్: 2025లో లాంచ్ అయిన బెస్ట్ క్రూయిజర్ మోటార్‌సైకిళ్లు
2025లో క్రూయిజర్ బైక్‌లకు మంచి డిమాండ్ కనిపించింది. Royal Enfield Meteor 350 నుంచి Triumph Rocket 3 వరకు కంఫర్ట్, రోడ్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్న టాప్ 5 క్రూయిజర్ బైక్‌ల వివరాలు.

Best Cruiser Bikes 2025: క్రూయిజర్ మోటార్‌సైకిళ్లకు కొత్త ఊపునిచ్చిన ఏడాదిగా 2025 సంవత్సరం గురించి చెప్పుకోవచ్చు. స్పోర్ట్స్ బైక్‌లు, అడ్వెంచర్ బైక్‌ల జోరు కొనసాగినప్పటికీ.... రిలాక్స్‌డ్ రైడింగ్, కంఫర్ట్, రోడ్ ప్రెజెన్స్‌ను ఇష్టపడే రైడర్లకు క్రూయిజర్ బైక్‌లు ఇప్పటికీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది లాంచ్ అయిన క్రూయిజర్ బైక్‌లు పెర్ఫార్మెన్స్ తగ్గకుండా, డైలీ యూజ్‌కు సరిపడేలా తయారయ్యాయి. నగరంలో నిదానంగా క్రూయిజింగ్ చేయడానికి, హైవేపై గంటల తరబడి ప్రయాణించడానికి - 2025 క్రూయిజర్ బైక్‌లు చాలా ఆప్షన్స్ ఇచ్చాయి.
2025లో లాంచ్ అయిన టాప్ 5 క్రూయిజర్ బైక్‌లు
Royal Enfield Meteor 350 - ఎక్స్-షోరూమ్ ధర ₹1.96 లక్షలు
Royal Enfield Meteor 350 ఈ ఏడాది మరింత అప్‌డేట్ అయింది. LED హెడ్‌ల్యాంప్స్, ట్రిప్పర్ నావిగేషన్, అడ్జస్టబుల్ లీవర్స్ లాంటి ఫీచర్లు దీని టూరింగ్ కంఫర్ట్‌ను పెంచాయి. LED టర్న్ ఇండికేటర్స్, USB Type-C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్, స్లిప్పర్ క్లచ్ వంటి అదనపు ఫీచర్లు దీన్ని మరింత ప్రాక్టికల్‌గా మార్చాయి. Motoverseలో పరిచయమైన Sundowner Editionలో కొత్త రంగు, విండ్‌స్క్రీన్, ప్రీమియం సీట్స్, ముఖ్యంగా ట్యూబ్‌లెస్ స్పోక్‌డ్ వీల్స్ రావడం దీన్ని లాంగ్ రైడ్స్‌కు మరింత అనుకూలంగా చేసింది.
Honda Rebel 500 - ఎక్స్-షోరూమ్ ధర ₹5.49 లక్షలు
Honda Rebel 500 లైట్ నుంచి మిడిల్‌వెయిట్ క్రూయిజర్ సెగ్మెంట్‌లో నిలుస్తుంది. 471 cc ప్యారలల్-ట్విన్ ఇంజిన్, 690 mm తక్కువ సీటు ఎత్తు, ముందుకు తీసుకెళ్లిన ఫుట్‌పెగ్స్‌తో ఇది రిలాక్స్‌డ్ రైడింగ్ అనుభూతిని ఇస్తుంది. క్లాసిక్ క్రూయిజర్ డిజైన్‌కు మోడ్రన్ బాబర్ స్టైల్‌ను కలిపిన Rebel 500, స్టైల్‌తో పాటు రోజువారీ వినియోగాన్ని కోరుకునే వారికి సరైన ఎంపికగా మారింది.
Kawasaki Eliminator - ఎక్స్-షోరూమ్ ధర ₹6.16 లక్షలు
2025 Kawasaki Eliminator మోడ్రన్, లైట్‌వెయిట్ క్రూయిజర్‌గా రూపొందించారు. Ninja 500తో పంచుకునే 451 cc లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజిన్ దీనికి శక్తినిస్తుంది. లాంగ్ అండ్ లో స్టాన్స్, ట్రెలిస్ ఫ్రేమ్, 18 ఇంచ్ ఫ్రంట్, 16 ఇంచ్ రియర్ వీల్స్‌తో ఇది యువ రైడర్లను ఆకట్టుకుంటుంది. LED లైటింగ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు దీన్ని ఆధునిక క్రూయిజర్‌గా నిలబెట్టాయి.
Triumph Rocket 3 - ఎక్స్-షోరూమ్ ధర ₹24.03 లక్షలు
Triumph Rocket 3 అనేది సాధారణ క్రూయిజర్ కాదు. 2,458 cc భారీ ఇంజిన్‌తో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రొడక్షన్ మోటార్‌సైకిల్ ఇంజిన్ అనే గుర్తింపు దీనికి ఉంది. 7,000 rpm వద్ద 182 PS శక్తి, 4,000 rpm వద్ద 225 Nm భారీ టార్క్ దీని ప్రత్యేకత. ఈ శక్తిమంతమైన టార్క్ డెలివరీ Rocket 3 కి అసాధారణ రోడ్ ప్రెజెన్స్‌ను ఇస్తుంది.
Bajaj Dominar 400 - ఎక్స్-షోరూమ్ ధర ₹2.39 లక్షలు
Dominar 400 సంప్రదాయ క్రూయిజర్ కాకపోయినా, భారత్‌లో బలమైన అభిమాన వర్గాన్ని సంపాదించింది. 2025 అప్‌డేట్‌తో రైడ్-బై-వైర్, మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు, బ్లూటూత్ కనెక్టివిటీతో కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చాయి. లగేజ్ క్యారియర్, GPS మౌంట్ లాంటి మార్పులు దీన్ని టూరింగ్‌కు మరింత అనుకూలంగా చేశాయి.
మొత్తానికి, 2025 సంవత్సరం, క్రూయిజర్ బైక్‌లు ఇంకా రిలవెంట్‌గానే ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా చూపించింది. కంఫర్ట్, స్టైల్, రిలాక్స్‌డ్ పెర్ఫార్మెన్స్ కోరుకునే రైడర్లకు ఈ ఏడాది లాంచ్‌లు మంచి ఎంపికలను ముందుంచాయి. రాబోయే కాలంలో కూడా ఈ సెగ్మెంట్ మరింత బలపడవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















