అన్వేషించండి

Arijit Singh: అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదేనా? న్యూమరాలజీ ఏం చెబుతోంది!

Numerology: బాలీవుడ్ గాయకుడు అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ వార్త ట్రెండింగ్ లో ఉంది. ఇంత అకస్మాత్తు నిర్ణయం తీసుకోవడం వెనుక ఆయన జన్మించిన తేదీ ప్రభావం కూడా ఉందంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు

Arijit Singh: బాలీవుడ్ సినీ గాయకుడు అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది. జనవరి 27 రాత్రి అర్జిత్ సింగ్ స్వయంగా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ ద్వారా ఈ సమాచారాన్ని పంచుకున్నారు. ప్లేబ్యాక్ సింగింగ్ కి రైటైర్మెంట్ ప్రకటిస్తున్నానంటూ అందుకు కారణం కూడా చెప్పారు. తన నిర్ణయానికి అనేక కారణాలు ఉన్నాయని...ఒకే రకమైన ట్యూన్‌లు , పాటలపై పనిచేసేందుకు ఇక ఆసక్తి లేదన్నారు. అయితే బాలీవుడ్ లో స్టార్ సింగర్ గా వెలుగుతున్న సమయంలో అర్జిత్ సింగ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? అందుకు కారణం న్యూమరాలజీ ప్రకారం ఆయన నంబర్ 7 కావడం..ఆ నంబర్ ని పాలించే గ్రహం కేతువు కావడమే అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు అనిష్ వ్యాస్. 
 
ఏ నెలలోనైనా 7, 16 లేదా 25 తేదీల్లో జన్మించిన వారి  సంక్య 7 అవుతుంది. 7 సంఖ్య ఉన్నవారు ఇతరులు తమ గురించి లేదా వారి నిర్ణయాల గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. ఈ వ్యక్తులు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, దాని వెనుక ఒక నిర్దిష్ట కారణం ఉంటుంది, అది సమయం వచ్చినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. చెప్పాలి అనుకున్న విషయాన్ని సూటిగా , స్పష్టంగా చెప్పేస్తారు. ఆ నిర్ణయం వెనుక ఎలాంటి రూమర్స్ కి అవకాశం ఇవ్వరు. ఈ తేదీల్లో జన్మించినవారు తమ వ్యక్తిగత జీవితం గురించి ఎవ్వరితోనూ పంచుకోరు. 

సంఖ్యాశాస్త్రం ప్రకారం 7 నంబర్ కేతువుకి సంబంధించినది..కేతువు అంటే తల ఉండదు..మొండెం మాత్రమే ఉంటుంది. అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం 7 నంబర్ కి చెందిన వ్యక్తులు హృదయంతో నిర్ణయం తీసుకుంటారని దీనివెనుకున్న ఆంతర్యం. 7వ నంబర్ వ్యక్తులకు బయటి ప్రపంచంతో పరిమిత సంబంధం ఉంటుంది. వారు ఎలాంటి ప్రదర్శనను ఇష్టపడరు. వారి స్వంత ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తూ తమ ఆలోచనలను సులభంగా పంచుకోవడానికి ఇష్టపడరు, ఈ లక్షణం అర్జిత్ సింగ్ లోనూ స్పష్టంగా కనిపిస్తుంది.
 
7వ సంఖ్య ఉన్న వ్యక్తులు మంచి ప్రణాళికలు వేసుకుంటారు. వారు తమ ప్రణాళికలు పూర్తయ్యే వరకు గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. వారు భవిష్యత్ కి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరి నీడగా ఉండేందుకు అస్సలు ఆసక్తి చూపించరు. ఇప్పుడు అర్జిత్ సింగ్ బాలీవుడ్ కి రిటైర్మెంట్ ప్రకటించడం అంటే రిటైర్ అవుతున్నారని అంతా భావిస్తున్నారు...కానీ తన భవిష్యత్ ప్రణాళికలు వేరే ఉంటాయంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు

పంజాబ్ కి చెందిన సంగీత కాళాకారుల కుటుంబంలో జన్మించిన అర్జిత్ సింగ్.. గురుకుల్ రియాలిటీ షో తో పాపులార్టీ సంపాదించుకున్నారు.  సంజయ్ లీలా బన్సాలీ సినిమాలో మొదటి అవకాశం దక్కినా..సినిమా విడుదల సమయానికి ఆ పాట లేదు. ఆ తర్వాత టిప్స్ కంపెనీతో కుదిరిన ఓ ఒప్పందం వెంటనే రద్దైంది.కెరీర్ ఆరంభంలోనే రెండు బ్రేక్ లు పడినా బాధపడలేదు..ముంబైకి చేరుకుని ఆల్బమ్ చేసుకున్నారు. మర్డర్ 2 లో అవకాశం వచ్చింది..ఆషికి 2 తర్వాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. రెండు దశాబ్థాలుగా బాలీవుడ్ లో వెలుగుతున్న అర్జిత్ సింగ్  ప్రస్తుతం 13 సినిమాలకు సైన్ చేశారు. అవి పూర్తైన తర్వాత కొత్త ప్రాజెక్టులు అంగీకరించేదిలేదని స్పష్టంగా చెప్పేశారు. స్టేజ్ షోస్, ఆల్బమ్స్ చేస్తానని చెప్పారు అర్జిత్ సింగ్.

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, పంచాంగం నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?
ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget