అన్వేషించండి

Weekly Horoscope, 25-31 July:ఈ వారం రాశిఫలాలు జులై 25 నుంచి జులై 31 వరకూ రాశిఫలాలు…

ఒక్కరోజులో చాలా మారిపోతుంటాయి. వారం రోజుల్లో అంటే ఇంకా మార్పులుంటాయి. మరి ఈ వారం అంటే జులై 25, 2021 నుంచి జులై 31, 2021 వరకు... వార ఫలాలు ఏ రాశివారికి ఎలా ఉన్నాయో చూద్దామా.

జులై 25, 2021 నుంచి జులై 31, 2021 వరకు వార ఫలాలు 


Weekly Horoscope, 25-31 July:ఈ వారం రాశిఫలాలు జులై 25 నుంచి జులై 31 వరకూ రాశిఫలాలు…

మేష రాశి (Aries)

ఈ వారం మేషరాశివారికి అనుకూలంగా ఉంది. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. వృత్తి-వ్యాపారాల్లో  లాభం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఈ వారం మేషరాశివారికి అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. నిర్ణయాలను సరైన సమయంలో ఆచరణలో పెడతారు. బంధువులు, స్నేహితులవల్ల ఖర్చులు పెరిగినా పనులు కలిసివస్తాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు తదితర వృత్తుల వారికి, రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం శుభసమయం.

వృషభ రాశి (Taurus)

వృషభరాశివారికి ఈ వారం ఇంటా, బయటా అనుకూలమైన పరిస్థితులుంటాయి. పెద్దల సలహాలు పాటించడం ద్వారా సత్ఫలితాలు పొందుతారు. నిత్యపనులు, వ్యాపారం సాఫీగా సాగతుంది. ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉంటుంది. సమాదంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినా సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వృత్తి,  వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. డాక్టర్లకు పని ఒత్తిడి తప్పదు. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. పై అధికారులతో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు…. సహోద్యోగులతో కొద్దిగా విభేదాలకు అవకాశం ఉంది..జాగ్రత్తగా ఉండండి. మొత్తంగా  ఈ వారం అన్నివిధాలా మేలు జరుగుతుంది.

మిథున రాశి (Gemini)

మిధునరాశివారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రం అనుకూలంగానే ఉన్నాయి.  వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తోంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత వరకు బయటపడతారు. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. కార్యాలయంలో అధికారులతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. తోటివారితో చిన్నపాటి మనస్పర్ధలున్నా పనులు పూర్తవుతాయి. ఉత్సాహంగా పనులు ప్రారంభించి తృప్తికరమైన ఫలితాలు పొందుతారు.  ఆత్మవిశ్వాసంతో తీసుకునే కొత్త నిర్ణయాలు భవిష్యత్తులో సత్ఫలితాలనిస్తాయి. మధ్య మధ్య కొద్దిగా ఆరోగ్య సమస్యలు తప్పవు.


Weekly Horoscope, 25-31 July:ఈ వారం రాశిఫలాలు జులై 25 నుంచి జులై 31 వరకూ రాశిఫలాలు…

కర్కాటక రాశి (Cancer)

కర్కాటక రాశివారికి ఈ వారం వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి ఉన్నా అందుకు తగిన ఫలితం ఉంటుంది. ఉత్సాహంతో పనులపై మనసు నిలుపుతారు.  మంచి ఆలోచనలను సమయానుకూలంగా ఆచరణలో పెట్టి, సత్ఫలితాలు పొందుతారు.
ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. అనవసరమైన పనులలో తలదూర్చకుండా తమ పనులు తాము చేసుకుంటూ వెళ్లడం అవసరం. ఆరోగ్యం జాగ్రత్త.

సింహ రాశి (Leo)

సింహరాశి వారికి ఈ వారమంతా అనుకూలంగానే ఉంది. ఇంటి వాతావరణం సంతృప్తిగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులను ప్రారంభించే ఆలోచన చేస్తారు. స్నేహితులు, బంధువులవల్ల ఖర్చులు ఉంటాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మీ సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది.

కన్య రాశి (Virgo)

కన్యారాశి వారు కొందరి స్నేహితుల కారణంగా అప్రతిష్టపాలయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులు చదువుపై మనసునిలుపుతారు. అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోవచ్చు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా వివాదాలలోకి వెళ్లకుండా, పనులపై శ్రద్ధ ఉంచడం అవసరం. పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కుటుంబపెద్దల సలహాలను పాటిస్తారు. ఆత్మీయుల కోసం సమయాన్ని కేటాయిస్తారు.

Weekly Horoscope, 25-31 July:ఈ వారం రాశిఫలాలు జులై 25 నుంచి జులై 31 వరకూ రాశిఫలాలు…

తుల రాశి (Libra)

తులా రాశివారికి ఈ వారం ఇంటా,బయట సంతృప్తి కరంగా ఉన్నప్పటికీ గ్రహసంచారం అంతగా అనుకూలంగా లేనందున వ్యక్తిగత సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటుచేసుకుంటాయి. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. రావలసిన డబ్బు కొంత చేతికి అందుతుంది. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. సంగీత, సాహిత్య, సినిమా కళాకారులకు ఈ వారం అనుకూలం. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. ఉన్నత విద్యకోసం శ్రమించి, అనుకూల ఫలితాలు పొందుతారు

వృశ్చిక రాశి (Scorpio)

వృశ్చికరాశి వారు సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. మంచివారి సాహచర్యం లభిస్తుంది. కుటుంబంలో పెద్దల సహకారాన్ని పొందుతారు. పిల్లలతో సంతృప్తిగా గడుపుతారు. ఆర్థికంగా అనుకూలత ఉన్నా పనుల్లో జాప్యం తప్పదు. కొత్త పనుల ప్రారంభాన్ని కొన్ని రోజులకోసం వాయిదా వేసుకుంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి లక్ష్యాల విషయంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. సహనంతో వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు రాశి (Sagittarius)

ధనస్సు రాశివారికి అన్ని విధాలా అనుకూలమైన సమయం….ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో ఉన్నవారు ఆర్థిక సంబంధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన కాలం. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు.బంధువర్గం, స్నేహితులతో పనులు నెరవేరుతాయి. చేతిలో డబ్బు లేకపోవడంతో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి, పనులపై మనసు నిలపడం అవసరం.

 


Weekly Horoscope, 25-31 July:ఈ వారం రాశిఫలాలు జులై 25 నుంచి జులై 31 వరకూ రాశిఫలాలు…

మకర రాశి (Capricorn)

మకరరాశివారికి ఏలినాటి శనికారణంగా  అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. ఊహించని ఖర్చులవల్ల కొన్ని పనుల్లో జాప్యం ఉండొచ్చు. పెద్దల విషయంలో గౌరవంతో ఉంటారు. ఆఫీసులో పై అధికారులతో పూజ్యభావంతో ఉంటూ పనులు పూర్తిచేసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఇంటాబయటా వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి బాగా శ్రమ పెరుగుతుంది.

కుంభ రాశి (Aquarius)
కుంభరాశివారికి ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులపై ఒత్తిడి ఉన్నా సమయానికి లక్ష్యాలను పూర్తి చేస్తారు. సహెూద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. స్నేహితులు, బంధువర్గంతో బాంధవ్యాలు పెంపొందుతాయి. వాహనాలవల్ల ఖర్చులు పెరుగవచ్చు.

మీన రాశి (Pisces)

మీనరాశివారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేయడంలో… కొత్త పనులు ప్రారంభించడంలో సఫలీకృతులవుతారు. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. స్థిర, చరాస్తుల తగాదాలు పరిష్కారమవుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవ కాశం ఉంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది.

నోట్- ఓ రాశి ఫలితాలను పూర్తిస్థాయిలో వ్యక్తిగతంగా భావించరాదు. ఓ వ్యక్తి పూర్తిస్థాయి జాతకం వారి వారి గ్రహస్థితిని బట్టి మారుతుంది. పూర్తి వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణులను సంప్రదించగలరు.

టాప్ హెడ్ లైన్స్

07-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
07-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
Shani Vakri 2026: శని వక్రగమనం - కెరీర్, సంబంధాలపై నిజ స్వరూపం! ఏ రాశులు జాగ్రత్త పడాలి?
శని వక్రగమనం: కెరీర్, సంబంధాలపై నిజ స్వరూపం! ఏ రాశులు జాగ్రత్త పడాలి?
CJP సపోర్ట్‌తో జార్ఖండ్ యువజన ఉద్యమం ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఉద్యమంపై జ్యోతిష్య అంచనాలు!
CJP సపోర్ట్‌తో జార్ఖండ్ యువజన ఉద్యమం ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఉద్యమంపై జ్యోతిష్య అంచనాలు!
పుష్యమి నక్షత్రంలోకి గురు గ్రహం! ఈ 4 రాశులకు స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు!
పుష్యమి నక్షత్రంలోకి గురు గ్రహం! ఈ 4 రాశులకు స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget