అన్వేషించండి

Today Horoscope In Telugu: జూన్ 2 రాశి ఫలాలు: ఆ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే, మీ రాశి ఉందేమో చూసుకోండి

Horoscope Prediction 2nd june 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for june 2nd 2024: 

మేషం

ఈ రాశి వారికి ఈరోజు ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. పనులలో ఆటంకాలు ఉన్నా నిదానంగా పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆలయ దర్శనాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.

వృషభం

ఈ రాశి వారికి ఈరోజు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉండవు. వృత్తి ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. వ్యాపారాలలో తగిన లాభం పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.  

మిథునం

ఈ రాశి వారికి ఈరోజు వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉన్నట్టుండి నిర్ణయాలలో మార్పులు చేసుకుని ఇబ్బంది పడతారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో దృష్టి పెట్టడం మంచిది. బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు కష్టంగా ఉంటాయి.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈరోజు దూర ప్రాత బంధువుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చేడతారు. సమాజంలో విలువ పెరుగుతుంది. విలువైన వస్తు, వస్త్ర, ధన లాభాలున్నాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు తొలుగుతాయి.

సింహం

ఈ రాశి వారు ఈరోజు విందు వినోదాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు కొత్త  పద్దతులు ప్రవేశపెడతారు. ఉద్యోగ విషయమై శుభవార్త అందుతుంది.  

కన్య

ఈరోజు ఈ రాశి వారు ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థిక నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అవాంతరాలు కలిగి మధ్యలో నిలిచిపోతాయి. వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. ద్విస్వభావ ఆలోచనలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

తుల

ఈ రాశి వారికి ఈరోజు ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు.

వృశ్చికం

ఈ రాశి వారికి ఈరోజు సంతాన విద్యా విషయాలలో సంతృప్తి కలుగుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. విబేధించినవారే దగ్గరవుతారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.

ధనస్సు

ఈ రాశి వారికి ఈరోజు అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. సన్నిహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది. చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశం లభిస్తుంది. వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగ విషయమై ఇరుక్కున్న సమస్యల నుంచి చాకచక్యంగా బయటపడతారు.

మకరం

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని వ్యవహారాలలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. శ్రమతో ప్రయాణాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. దైవ భక్తి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించడం మంచిది. మిత్రుల నుంచి సమస్యలు కలుగుతాయి.  

కుంభం

ఈ రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. సన్నిహితులతో దూరంగా మెలగడం మంచిది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చేసిన పని మళ్లీ మళ్లీ చేయవలసి రావచ్చు . వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉండవు.

మీనం

ఈరాశి వారికి ఈరోజు ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. చాలా కాలంగా తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. వ్యవహారాలు ఉత్సాహంగా ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూల వాతావరణం ఉంటుంది.

Note:  ఓక రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

ALSO READ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో క్లియర్ వేవ్ - స్వీప్ చేయబోతున్నది ఎవరో తెలుసా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
The Raja Saab: రాజా సాబ్ మీద రెబల్ స్టార్ ఇంజ్యూరీ ఎఫెక్ట్... ప్రభాస్ సినిమా వెనక్కి వెళ్ళిందండోయ్!
రాజా సాబ్ మీద రెబల్ స్టార్ ఇంజ్యూరీ ఎఫెక్ట్... ప్రభాస్ సినిమా వెనక్కి వెళ్ళిందండోయ్!
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Poco M7 Pro 5G: పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
Embed widget