మీరు ఎంత చెడ్డవారో మీ రాశే చెప్పేస్తుంది, చదివిన తర్వాత ఫీలవ్వద్దు!
రాశులను బట్టి మనుషుల్లో నెగెటివ్ కోణాన్ని తెలుసుకోవడం సాధ్యమే. మీ సన్ సైన్ ను బట్టి మీలోని చీకటి కోణాన్ని ఒక సారి చూసుకోండి మరి.
మనుషులు ఎవరైనా మంచి చెడుల సమ్మిళితంగా ఉంటారు. రాశి పోసినట్టు మంచిగానూ, లేదా చెడుగాను ఉండరు. కానీ చాలా సార్లు మనం మనలోని చెడు రూపాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తాం. మనలోని చీకటి కోణాన్ని ఎప్పుడూ వెలుగులోకి రానివ్వం. మనం కూడా ఎవరిలోని చెడు గురించైనా అర్థం చేసుకున్న తర్వాత వారికి దూరంగా ఉంటాం. నిజానికి చాలా సందర్భాల్లో మరీ అంత నెగెటివ్ గా ఉండి ఇతరులకు హాని చేసేంత చెడ్డగా ఉండే వారు చాలా తక్కువ. మనలోని ఇలాంటి రూపం కోపంలో ఉన్నపుడో, ఏదైనా ఆవేశంలోనో బయట పడుతూ ఉంటుంది. అయితే ఎవరిదైనా చీకటి కోణం తెలుసుకోవడం ఎలా? కొంత వరకు ఈ విషయంలో జోతిష్యశాస్త్రానికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. గ్రహాల స్థితి గతులను బట్టి, జన్మ రాశిని బట్టి కొన్ని విషయాలు తెలుసుకోవడం సాధ్యమే.
మేషం
వీరిలోని నెగెటివ్ కోణం అసహనం, కోపం. వీరికి పనులు క్షణాల మీద జరగాలి. ఏమాత్రం జాప్యం సహించలేరు. అదీ కూడా వారి ప్లాన్ ప్రకారమే జరగాలి. కాస్త అటూఇటైనా భరించలేరు. అందువల్ల వీరికి కోపం నషాళానికి అంటుతుంది. అది భరించడం ఎదుటి వారికి చాలాకష్టం.
వృషభం
ఇది మొత్తం రాశి చక్రంలోనే చాలా మొండి ఘటం. ఇక వీరిలోని చీకటి కోణం ఏంటంటే వీరిని కదిలించడం చాలా కష్టం, అంతేకాదు పొజెసివ్ గా, కోపంగా, బద్దకంగా ఉంటారు. వీరికి సౌకర్యవంతమైన స్థితి నుంచి పక్కకు జరగడం పెద్దగా నచ్చదు. వీరిని మార్చాలని అనుకుంటే కోపం కట్టలు తెంచుకుంటుంది. ఎందుకంటే వీరికి మార్పు అసలు ఇష్టం ఉండదు.
మిథునం
మిథున రాశి వారిని రెండు ముఖాలు కలిగిన వారిగా పరిగణించవచ్చు. చాలా సార్లు వీరి గురించిన నిజం తెలిసన తర్వాత ఎదుటివారికి హర్టింగ్ గా ఉంటుంది. వీరు గాసిప్పింగ్ లో బాగా పాలు పంచుకుంటారు. వారిలోని ఈ గుణమే వారికి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అంత చెడ్డ అలవాటు కాకపోయినా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని మాత్రం జోతిషం వీరికి సలహా ఇస్తుంది.
కర్కాటకం
వీరిలో కొందరు చాలా మూడీ వ్యక్తులు. వీరికి సహజంగానే ఘర్షణలు ఇష్టం ఉండదు. కానీ ఎవరైనా వీరిని బాధపెడితే మాత్రం దాన్నుంచి బయటపడడానికి చాలా సమయం పడుతుంది. అంతేకాదు వీరి మూడీతనం చుట్టు ఉన్నవారికి చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో.
సింహం
సింహ రాసిలో కొందరు చాలా డామినేటింగ్ గా ఉంటారు. కొంత మంది ఎదుటివారిని భయపెడతారు కూడా. ఎలాంటి ఎఫర్ట్ పెట్టకుండానే సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలని అనుకుంటారు. అది జరగనపుడు వీరికి పట్టరాని కోపం వస్తుంది.
కన్య
కన్య వారు నిరాశావాదులు. వారికి ప్రతీ విషయం నెగెటివ్ గానే కనిపిస్తుంది ముందుగా. చాలా సార్లు ప్రతి సందర్భంలో ఎంత నెగెటివ్ జరగవచ్చనేదే ఆలోచిస్తారు. ఇది చాలా సార్లు చుట్టూ ఉన్నవారికి విసుగు తెప్పిస్తుంది. కానీ, కొందరు దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంటారు.
తుల
కొంతమంది తులా రాశి వారు వారి స్వార్థం కోసం పరిస్థితులను మానిప్యులేట్ చేస్తారు. వీరికి ఇతరుల నమ్మకాన్ని గెలుచుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ఆ విషయం వీరికి కూడా తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క అవకాశాన్ని కూడా జార విడుచుకోరు.
వృశ్చిక
వృశ్చిక రాశి వారిలో కొందరు నిజంగా హృదయం లేనట్టే ఉంటారు. ఇతరుల బాధ అసలు కనిపించదు. ఎదుటి వారి ఫీలింగ్స్ అసలు పట్టించుకోనట్టే ఉంటారు.
ధనస్సు
వీరు వారి పనుల కోసం ఇతరులు ఎంత ఇబ్బంది పడేది అసలు పట్టించుకోరు. వీరిలోని ఈ లక్షణం వల్ల అందరు వీరిని తప్పించుకు తిరగాలని అనుకుంటారు.
మకరం
వీరు నిశ్శబ్దంగా ఉంటూ చూసే వారికి కాస్త భయం కొలిపేలా కనిపిస్తారు. ఎందుకంటే వీరు చాలా సందర్భాల్లో మనసు కష్టపెట్టుకుని ఉంటారు. కనుక ఇతరులతో కలవడానికి భయపడతారు.
కుంభం
కుంభ రాశి వారి చీకటి కోణం వారిలోని స్వార్థమే. కొన్ని సార్లు ఇతరులతో సున్నితంగా వ్యవహరించడం వీరికి తెలీనే తెలీదు. కొంత మందికి ఎమోషన్స్, బలహీనతలు టైం వేస్ట్ వ్యవహారంగా అనిపిస్తాయి కూడా.
మీనం
వీరికి ఎమోషన్స్ కొన్ని సార్లు అదుపులో ఉండవు. ఆవేశంగా ఉన్నపుడు అది తప్ప మరేది తోచదు కూడా. ఇలా ఎక్కువగా ఆవేశ పడి వారికి, వారి చుట్టూ ఉండే వారికి నిజంగానే నష్టం కలిగిస్తారు.
Also Read: ఈ ఐదు రాశులవారు చాలా టాలెంటెడ్ గురూ, ఇందులో మీరు, మీ ఫ్రెండ్స్ ఉన్నారా?
గమనిక: పైన పేర్కొన్న లక్షణాలు కొందరికి అంతర్లీనంగా ఉంటాయి. కానీ, బయటపడరు. మరికొందరు ఇందుకు పూర్తి విరుద్దంగా కూడా ఉంటారు. ఎందుకంటే ఆయా రాశుల స్థితిగతులు, సమయాన్ని బట్టి మార్పులు ఉంటాయి. కాబట్టి, ఈ వివరాలు కేవలం అవగాహన కోసమే.