శ్రీ పరాభవ నామ సంవత్సర గంటల పంచాంగం ప్రకారం, ఈ మూడు నెలల్లో అన్ని గ్రహాలకు సమసప్తకం, షష్ఠాష్టక స్థితి వలన పరిస్థితులు అనుకూలించవు. పాలకులకు ప్రతిరోజూ సమస్యలుంటాయి.
అక్టోబర్-డిసెంబర్ 2026: కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ మార్పులు, కొందరికి పదవీ గండం! ఈ 3 నెలలు ఏం జరగబోతోంది?
October to December 2026 Astrology : అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ మూడు నెలల్లో దేశంలో ఏం జరగబోతోంది? రాబోతున్న రాజకీయ, ఆర్థిక, వాతావరణ మార్పులేంటి? ప్రమాద సూచనలున్నాయా? తెలుసుకోండి

- గ్రహస్థితుల ప్రభావంతో రాజకీయ మార్పులు, కొందరికి పదవీ గండాలు.
- ఈశాన్య ఋతుపవనాలతో తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయి.
- బంగారం, నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరుగుతాయని అంచనా.
- పరిశ్రమలలో అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, విపత్తులు సంభవించే అవకాశం.
Astrology: శ్రీ పరాభవ నామ సంవత్సరం గంటల పంచాంగం ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి డిశంబర్ 31 వరకు ఈ మూడు నెలల సమయాన అన్నిగ్రహాలకు సమసప్తకం, షష్ఠాష్టక స్థితి వలన పరిస్థితులు అనుకూలించవు. ప్రతిరోజూ ఏదో ఒక సమస్య పాలకులను ఇబ్బందులకు గురిచేస్తుంది.
అక్టోబర్ నుంచి డిసెంబర్ వాతావరణ పరిస్థితి
ఈశాన్యఋతుపవన ప్రభావంతో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అధికవర్షం కురుస్తుంది. వర్షం రికార్డు స్థాయిలో ఉంటుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తుఫానుగా మారును. చెన్నైకి ఆగ్నేయదిశగాకదులుతాయి.
అక్టోబర్ నుంచి డిసెంబర్ ధరలు
అక్టోబర్
నార, వెరుశనగ, పసుపు, కంద, అపర దినుసులు, ధనియాలు, సుగంధద్రవ్యాలు, బంగారం, వెండి, రాగి, ఇత్తడి, పాదరసం, కుంకుళ్ళు, కొబ్బరి, మిర్చి, చింతపండు, మినుములు, దుంపరకాలకు మంచి ధరలు వచ్చును. పూల ధరలు విపరీతంగా పెరుగును. టమాటా, ఉల్లి ధరలు బాగుండును. ప్రత్తి, తవుడు, నూనె రకాలకు, శుద్ధంలోతగ్గినా, పౌర్ణమితర్వాత బాగాపెరుగును. షేర్మార్కెట్ 4వారాలు ఉత్సాహం గానేఉండును. ఆక్వా, పౌల్జిలకు మంచిలాభాలు, పాలధరలు, పెట్రో, డీజిల్ ధరలు పెరుగును.
నవంబర్
అన్నివస్తువుల ధరలు పెరుగుతాయి. బియ్యం, గోధుమలు, తృణధాన్యములు నిలపాటు, ఉల్లి, టమాటా ధరలుతగ్గును. కూరగాయలధరలు, పూలధరలు బాగా పెరుగును. పసుపు, ప్రత్తి,కాగితం, కలప,కందులు, శనగలు, మిను ములు, పెసలు ధరలు పెరుగుతాయి. బెల్లం, పంచదార, నూనెరకాలు మొదటస్వల్పంగా తగ్గినా, తదుపరి బాగా పెరుగును. మిర్చిధరవృద్ధి, ఇత్తడి, పాదరసం, ధరలు బాగా పెరుగును. నిల్వదారులు అమ్ము కొనుటమంచిది, కొబ్బరి, పండ్లరకాలు ధరలు పెరుగును.. షేర్ మార్కెట్ 2,3,4, వారాలు పెరుగుతుంది.
డిసెంబర్
నెయ్యి ధర పెరుగుతుంది. ధాన్యం, బియ్యం, గోధుమలు రాగుల ధరలు స్వల్పంగా తగ్గి తిరిగి పెరుగును. పశుగ్రాసం, పశువుల ధరలు బాగా పెరుగును. వేరుశనగ, ప్రత్తి, మిర్చి, చింతపండు, పసుపు, కూరగాయ ధరలు పాల ఉత్పత్తుల రకాలు, బంగారం, వెండి, రాగి, ఇత్తడి, పాదరసం ధరలు పెరుగును. కలప, కాగితం, సుగంధద్రవ్యాలు, మందులు, వస్త్రముల ధరలు ముందు తగ్గినా ఆ తర్వాత పెరుగుతాయి. షేర్ మార్కెట్ బాగా పెరిగే అవకాశం ఉంది.
అక్టోబర్ - డిసెంబర్ మధ్య ఇంకా...
ఉత్తరాది రాష్ట్రాల్లో దేవాలయాల్లో అపశ్రుతులు జరిగే అవకాశం ఉంది
పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు, జననష్టం సంభవించే ప్రమాదం
విహార యాత్రలో విషాదాలు జరిగే ప్రమాదం ఉంది
సముద్ర తీరాల్లో ప్రమాదాలు జరుగుతాయి
షేర్ మార్కెట్ ఆరంభంలో స్వల్పంగా బావుందనిపించినా తదుపరి ఒడిదొడుకులుగా ఉంటుంది
సినీ పరిశ్రమ బాగుంటుంది. ఈ మూడు నెలల కాలంలో ఇండస్ట్రీకి మంచి ఫలితాలున్నాయి
వ్యాపార రంగంలో ఉండేవారు మంచి లాభాలు ఆర్జిస్తారు..
పంజాబ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అరాచక శక్తులు విజృంభించే అవకాశం
జార్కండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో అల్లర్లు, హింసాత్మక సంఘటనలు జరుగుతాయి
ఈ మూడు నెలల కాలంలో వాహనప్రమాదాలు అధికంగా జరిగే ప్రమాదం. రహదారులపై బస్సు తగలబడిపోతుంది. కొన్ని రహదారులు మూతపడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి
సింహరాశిలో కుజ స్తంభనయోగం వల్ల ఎన్నో విపత్తులు సంభవిస్తాయి. భూకంప ప్రమాదం, పంటలకు కొత్త వైరస్ సోకి రైతులు పంటలు నష్టపోతారు.
దీపావళి సమయంలో మూడు రోజుల పాటు చిరుజల్లులు కురిసే అవకాశం
బంగారం, వెండి, పాదరసం ధరలు పెరుగుతాయి
కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ మార్పులు జరుగుతాయి..కొందరికి పదవీ గండం ఉంటుంది
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు
మేష రాశి నుంచి మీన రాశివరకూ..12 రాశుల డైలీ రాశిఫలాలు, వారఫలాలు, నెలవారీ ఫలితాలు, రాశులు గ్రహాలు మారినప్పుడు మీ రాశిపై ఉండే ప్రభావానికి సంబంధించిన కథనాలన్నీ తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
Frequently Asked Questions
2026 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు గ్రహ స్థితులు ఎలా ఉంటాయి?
అక్టోబర్-డిసెంబర్ 2026లో వాతావరణం, వర్షపాతం ఎలా ఉంటాయి?
ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో రికార్డు స్థాయిలో అధిక వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడి చెన్నైకి ఆగ్నేయంగా కదులుతుంది.
ఈ మూడు నెలల్లో ప్రధాన వస్తువుల ధరల పోకడలు ఎలా ఉంటాయి?
బంగారం, వెండి, పెట్రోల్, డీజిల్, పశుగ్రాసం, కూరగాయల ధరలు పెరుగుతాయి. అయితే, కొన్ని దినుసుల ధరలు మొదట్లో తగ్గినా, ఆ తర్వాత బాగా పెరుగుతాయి.
అక్టోబర్-డిసెంబర్ మధ్య ఏ రకమైన ప్రమాదాలు, విపత్తులు సంభవించవచ్చు?
పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు, విహారయాత్రలో విషాదాలు, సముద్ర తీరాల్లో ప్రమాదాలు, వాహన ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. భూకంప ప్రమాదం కూడా ఉంది.
ట్రెండింగ్ వార్తలు




















